ఏపీలో ఆర్ధిక ఎమర్జెన్సీ తప్పదా?

Publish Date:Jan 21, 2023

Advertisement

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అద్వాన్నంగా ఉందనేది అందరికీ తెలిసిన రహస్యం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన క్షణం నుంచే రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ అనేదే లేకుండా పోయింది. అందుకే సంవత్సరం తిరగ కుండానే, గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ముందుచూపుతో వేసిన ఆర్థిక పునాదులు సడలి పోయాయి. అప్పుల వేట మొదలైంది.

కూచమ్మ కూడా బెడితే మాచమొచ్చి మాయం చేసింది అన్నట్లుగా పరిస్థితి తల్లకిందులైపోయింది  ఆర్థిక మంత్రి అప్పుల మంత్రిగా మారిపోయారు. అప్పులు పుడితేనే కానీ పూట గడవని పరిస్థితికి రాష్ట్ర్ర ఆర్థిక పరిస్థితి చేరుకుంది. చివరకు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అయినా  ఇవ్వలేని దౌర్భాగ్య స్థితికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చేరుకుంది. అయినా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి  ప్రతిపక్ష నాయకులు చేసిన సూచనలను పట్టించుకోలేదు. ముఖ్యంగా, సుదీర్ఘ కాలం ఉమ్మడి రాష్ట్రంలో, రాష్ట్ర విభజన అనతరం అవశేష ఆంధ్ర ప్రదేశ్ లొ తొలి ఐదేళ్ళు ఆర్థిక మంత్రిగా పనిచేసిన యనమల రామకృష్ణుడు వంటి అనుభవజ్ఞులు చేసిన సూచనలను కూడా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పట్టించుకోలేదు.  బహుశా ఆయనకు సహజసిద్ధంగా అబ్బిన దురహంకారంతో కావచ్చును, మీటలు నొక్కుకుంటూ పోయారు. 

ఫలితంగా ఇప్పడు ఇదిగో, ఉద్యోగ సంఘాల మాజీ నాయకుడు, టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు అన్నట్లుగా జీతాల కోసం ఉద్యోగులు గవర్నర్ ని కలవడం అనేది దేశచరిత్రలో బహుశా ఇదే తొలిసారి కావచ్చును. అప్పులు పుడితే తప్ప ప్రభుత్వం నడిచే పరిస్థితి, ఉద్యోగులకు జీతాలు అందని స్థితి ఉంటే, ముఖ్యమంత్రి తక్షణమే తనపదవికి రాజీనామాచేయడంమంచిది. నిజానికి ఇదొక్క అశోక్ బాబు మాట కాదు. రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు మొదలు, రాజ్యంగ నిపుణుల వరకు అందరూ అదే మాట అంటున్నారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వక పోవడం, ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో సర్కార్ చేతులు పెట్టడం, రిటైరైన ఉద్యోగులకు బెనిఫిట్స్ విషయంలో జరుగుతున్న జాప్యం, ఒకటి అని కాదు,  ఇలా ఒక్క ప్రభుత్వ  ఉద్యోగులకు సంబందించిన ఆర్థిక వ్యవహారాల్లో జరుగతున్న అవకతవకలను మాత్రమే పరిగణలోకి తీసుకున్నా, ముఖ్యమంత్రి  రాజీనామా చేయడం ఉత్తమం అంటున్నారు. 

జనవరి జీతాలు ఫిబ్రవరి నెల్లోకూడా ఇవ్వలేమని, ఇప్పటికే ఆర్థికశాఖ అధికారులు చెబుతున్నారు. అప్పులు పుడితేనే ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ఇస్తోంది. రాష్ట్రంలో ఫైనాన్షియల్ ఎమర్జన్సీ వచ్చింది అనడానికి ఇదే నిదర్శనం. చెద పట్టిన గుమ్మంలా రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి తయారైంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమీక్షించి, వెంటనే ఒక నిర్ణయానికి రావాలి. 7వేలకోట్ల డీఏలు ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాలి ఉంది. గతం లో పీఆర్సీ సందర్భంలో ఉద్యోగులకు రూ.2,500 కోట్లు ఇవ్వాల్సి ఉందని, మార్చి 2022 నాటికి ఇస్తామని ప్రభుత్వమే చెప్పింది. ఇప్పటికీ ఆ బకాయిలు ఇవ్వలేదు. జీపీఎఫ్ అడ్వాన్స్ లు కూడా ఇవ్వని ప్రభుత్వం, వాటినికూడా వాడుకుంది. రాష్ట్రప్రభుత్వం రూ.480 కోట్లు వాడుకుందని కేంద్రమే చెప్పింది, ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఫైనాన్షియల్ ఎమర్జన్సీ డిక్లేర్ చేయాలని అంటున్నారు.

By
en-us Political News

  
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం వివరాలు. రూ. 5 లక్షల ఉచిత బీమా కవరేజ్, అర్హతలు, వయస్సు పరిమితి మరియు దరఖాస్తు విధానం గురించిన పూర్తి సమాచారం.
విజయవాడలో ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఆన్‌లైన్ పరిచయం.. చాటింగ్‌తో స్నేహం.. వీడియో కాల్స్‌తో నమ్మకం.. ఆ తర్వాత ఇంటికి ఆహ్వానం. అంతా సజావుగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఆ పరిచయాల వెనుక ఉన్నది స్నేహం కాదు
హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్‌ 2026లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.!
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది.
ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి సుపారీ.. షాకింగ్ ట్విస్ట్.!
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి స్వస్థలానికి వచ్చిన ఓ యువతికి మృత్యువు అనూహ్య రీతిలో ఎదురైంది.
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.