పార్లమెంటు భవన్ కు చేరుకున్న విత్తమంత్రి
Publish Date:Jan 31, 2025
Advertisement
కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ఈరోజు వరుసగా ఎనిమిదోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశట్టేందుకు పార్లమెంట్ భవన్ కు చేరుకున్నారు. చక్కగా ఎంబ్రాయిడరీ చేసిన బంగారు అంచు ఉన్న క్రీమ్ కలర్ హ్యాండ్లూమ్ సిల్క్ చీర ధరించారు. ఆమె ఈ ఉదయం నుంచీ పలువురు అధికారులతో వరుస భేటీలు నిర్వహించారు. ఆమె చేతిలో బంగారు వర్ణంలో ఉన్న జాతీయ చిహ్నంతో కూడిన ఎర్ర కవర్ ఉంది. ఆందులోనే బడ్జెట్ పొందుపరిచిన టాబ్ ఉంది. ఆ టాబ్ ద్వారానే నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశ పెట్టనున్నారు. అంతకు ముందు ఆమె రాష్ట్రపతి భవన్ లో రాష్టపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. ఈ భేటీలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి కూడా ఉన్నారు. ముర్ముతో భేటీ అనంతరం ఆమె పార్లమెంటు భవన్ కు చేరుకున్నారు. అక్కడ కేబినెట్ బడ్జెట్ ను ఆమోదించిన అనంతరం నిర్మలా సీతారామన్ దానిని లోక్ సభలో ప్రవేశ పెడతారు.
http://www.teluguone.com/news/content/finance-minister-nirmala-sitaraman-reached-parliament-25-192164.html





