ఫిలింనగర్ ఆలయ భూమి వివాదం మళ్లీ తెరపైకి!

Publish Date:Jun 23, 2026

Advertisement

 

హైదరాబాద్‌లోని ఫిలింనగర్ అభయాంజనేయ స్వామి దేవస్థానానికి సంబంధించిన 2,750 గజాల విలువైన భూమి వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ భూమిని స్వామివారి పేరుతోనే నమోదు చేస్తామని గతంలో డీఎస్ఆర్ గ్రూప్ తరఫున సుధాకర్ రెడ్డి స్టాంప్ పేపర్‌పై లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారని పీఠాధిపతులు, మఠాధిపతులు, హిందూ సంఘాల నాయకులు గుర్తు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆ భూమిని దేవస్థానం పేరుతో కాకుండా ఎండో మెంట్స్ శాఖ పేరుతో నమోదు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. 

ఇది గతంలో ఇచ్చిన హామీకి విరుద్ధమని, ఆలయ ఆస్తి నేరుగా స్వామి వారి పేరుతోనే కొనసాగాలని వారు స్పష్టం చేశారు. ఈ అంశంపై తమ నిరసన ను తెలియజేసేందుకు పీఠాధిపతులు, మఠాధి పతులు, హిందూ సంఘాల ప్రతినిధులు జూబ్లీహిల్స్‌ లోని మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి నివాసానికి వెళ్లి వినతి పత్రం అందించేందుకు ప్రయత్నించారు. అనంతరం ఆయన నివాసం ఎదుట శాంతియుత నిరసన చేపట్టి "గుట్టపై హనుమాన్.. గుండెల్లో హనుమాన్" అంటూ నినాదాలు చేశారు. 

దేవాలయ ఆస్తిని పరిరక్షించడమే నిజమైన భక్తి అని పేర్కొంటూ, గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టి 2,750 గజాల భూమిని అభయాం జనేయ స్వామి పేరుతోనే నమోదు చేయాలని రంజిత్ రెడ్డి, సుధాకర్ రెడ్డిలను కోరారు. నిరసనకు పలు వురు భక్తులు, హిందూ సంఘాల కార్యకర్తలు కూడా మద్దతు తెలపడంతో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తగా అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షించారు. అయితే ఈ వివాదంపై మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి లేదా డీఎస్ఆర్ గ్రూప్ ప్రతినిధుల నుంచి అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది. భూమి నమోదుపై ప్రభుత్వం లేదా ఎండో మెంట్స్ శాఖ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంద న్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
 

By
en-us Political News

  
బీహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ భరత్ భూషణ్ తివారీ (28) పోలీస్ ఎన్‌కౌంటర్‌లో గాయపడి మరణించడం
హైదరాబాద్ మెట్రో రైలు అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలిసి రాజకీయ డ్రామాలకు తెరలేపారని
సైబరాబాద్ పరిధిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో రెండు ప్రముఖ రెస్టారెంట్లలో ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన సాయి కృష్ణ అదృశ్యం ఉదంతంలో ఎట్టకేలకు ఒక కీలకమైన పురోగతి లభించింది.
స్వర్ణగిరిగా... ఇక జొన్నగిరి..గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు..
ఏటీఎంలో నగదు నింపే వ్యాన్ డ్రైవర్ నగదుతో పరార్...
దుల నుండి ఇసుకను విచ్చలవిడిగా తోడేయడం వల్ల భూగర్భ జల మట్టాలు దారుణంగా పడిపోతున్నాయని డాక్టర్ రాజగోపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. నదుల్లో ఇసుక పొరలు నీటిని నిల్వ ఉంచే స్పాంజ్‌లా పనిచేస్తాయని, వాటిని పూర్తిగా తొలగిస్తే వర్షపు నీరు భూమిలోకి ఇంకకుండా వేగంగా సముద్రంలోకి కొట్టుకుపోతుందని హెచ్చరించారు.
ఏపీ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపు.. కేబినెట్ సంచలన నిర్ణయం..
చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల సమస్యలు తీవ్రరూపం దాల్చాయి.
సిలికాన్ సిటీలో ట్రిపుల్ మర్డర్ కలకలం..
మహారాష్ట్రలోని చారిత్రాత్మక లోహగఢ్‌ కోట పర్యాటక ప్రాంతంలో ఇటీవల జరిగిన ఒక యువ వ్యాపారవేత్త మరణం కేసులో ఊహించని మలుపు తిరిగింది.
లోపల చిక్కుకున్న వారిని సురక్షితంగా బయ టకు తీసుకురావడానికి అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్, పోలీసు బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సమీ పంలోని ఆస్పత్రులకు తర లించి చికిత్స అందిస్తు న్నారు.
పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ (RD) పథకంలో రోజుకు రూ.100 చొప్పున నెలసరి రూ.3000 పొదుపు చేయడం ద్వారా 6.7% వడ్డీతో ఐదేళ్లలో రూ.2.14 లక్షల కంటే ఎక్కువ మెచ్యూరిటీ మొత్తాన్ని ఎలా పొందాలో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.