ఎపిలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ...59 మందితో రెండో జాబితా  విడుదల 

Publish Date:Nov 9, 2024

Advertisement

ఎపిలో  కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీ వేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఒక దఫా జాబితా వచ్చిన సంగతి తెలిసిందే. రెండో జాబితాను 59  మందితో ఎపి ప్రభుత్వం విడుదల చేసింది. వీరిలో ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు కూడా ఉన్నారు.  ఆయనకు కేబినేట్ ర్యాంకు  దక్కింది. 

1. అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ( మైనార్టీ ) కేబినెట్ ర్యాంక్ - మహమ్మద్ షరీఫ్ ( నర్సాపురం-టీడీపీ )
2. అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ( స్టూడెంట్స్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ ) కేబినెట్ ర్యాంక్ - చాగంటి కోటేశ్వర్ రావు)
3. ఏపీ శెట్టి బలిజ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ - కూడిపూడి సత్తిబాబు ( రాజమండ్రి - టీడీపీ)
4. ఏపీ గవర వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ - మాల సురేంద్ర ( అనకాపల్లి - టీడీపీ )
5. ఏపీ కళింగ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ - రోనంకి కృష్ణం నాయుడు ( నరసన్నపేట - టీడీపీ )
6. ఏపీ కొప్పుల వెలమ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్- పీవీజీ కుమార్ ( మాడుగుల - టీడీపీ)
7. ఏపీ కురుబ - కురుమ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ - దేవేంద్రప్ప ( ఆదోని - టీడీపీ)
8. ఏపీ నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ - ఆర్ సదాశివ ( తిరుపతి - టీడీపీ )
9. ఏపీ రజక వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ - సావిత్రి ( అడ్వొకేట్ - బీజేపీ )
10. ఏపీ తూర్పు కాపు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ - పాలవలస యశస్వి ( శ్రీకాకుళం - జనసేన )
11. ఏపీ వాల్మీకి - బోయ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ - కపట్రాల సుశీలమ్మ ( బోజమ్మ ) ( ఆలూరు - టీడీపీ )
12. ఏపీ వన్యకుల క్షత్రియ ( వనేరెడ్డి, వన్నికాపు, పల్లి కాపు, పల్లి రెడ్డి) కోపరేటివ్ ఫైనాన్స్ కొర్పొరేషన్ లిమిటెడ్ - సి ఆర్ రాజన్ ( చంద్రగిరి -టీడీపీ)
13. ఏపీ యాదవ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ - నరసింహ యాదవ్ ( తిరుపతి - టీడీపీ )
14. ఏపీ అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ - చిలకలపూడి పాపారావు ( రేపల్లె - జనసేన)
15. ఏపీ గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ - వీరంకి వెంకట గురుమూర్తి ( పామర్రు - టీడీపీ )
16. ఏపీ కోపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ - గండి బాబ్జి ( పెందుర్తి - టీడీపీ)
17. ఏపీ శిల్పారామం ఆర్ట్స్, క్రాఫ్ట్స్ అండ్ కల్చరల్ సొసైటీ విజయవాడ - మంజులా రెడ్డి రెంటిచింతల - ( మాచర్ల - టీడీపీ)
18. ఏపీ స్టేట్ బయో - డైవర్సిటీ బోర్డు - నీలాయపాలెం విజయకుమార్ (తిరుపతి - టీడీపీ )
19. ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ - జీవి రెడ్డి ( మార్కాపురం - టీడీపీ )
20 . ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ - మన్నవ మోహన్ కృష్ణ ( గుంటూరు వెస్ట్ టీడీపీ )
21. ఏపీ కల్చరల్ కమిషన్ - తేజ్జస్వి పొడపాటి ( ఒంగోలు - టీడీపీ)
22. ఏపీ ఎన్విరాన్మెంట్ మ్యానేజ్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ - పొలంరెడ్డి దినేష్ రెడ్డి ( కోవూరు - టీడీపీ)
23. ఏపీ ఫారెస్ట్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ - సుజయ్ కృష్ణ రంగారావు ( బొబ్బిలి - టీడీపీ)
24. ఏపీ గ్రంధాలయ పరిషద్ - గోనుగుంట్ల కోటేశ్వర రావు ( నరసరావుపేట - టీడీపీ)
25. ఏపీ ఇండస్ట్రియల్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ - డేగల ప్రభాకర్ ( గుంటూరు ఈస్ట్ - టీడీపీ )
26. ఏపీ ఖాదీ అండ్ ఇండస్ట్రీస్ బోర్డు ( కేకే చౌదరి - కోడూరు - టీడీపీ )
27. ఏపీ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ - చిల్లపల్లి శ్రీనివాస రావు ( జనసేన )
28. ఏపీ రోడ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ - ప్రగడ నాగేశ్వర రావు ( యలమంచిలి - టీడీపీ)
29. ఏపీ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ - మరెడ్డి శ్రీనివాస రెడ్డి ( ఒంగోలు - టీడీపీ)
30. ఏపీ స్టేట్ ఆక్వా కల్చర్ డవెలప్మెంట్ అధారిటీ - ఆనం వెంకట రమణా రెడ్డి ( నెల్లూరు రూరల్ - టీడీపీ)
31. ఏపీ స్టేట్ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ - రఘురామ రాజు గొట్టిముక్కల ( విజయవాడ సెంట్రల్ - టీడీపీ)
32. ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫికేషన్ అధారిటీ - సావల దేవదత్ (తిరువూరు - టీడీపీ )
33. ఏపీ స్టేట్ వేర్ హోసింగ్ కార్పొరేషన్ - రావి వెంకటేశ్వర రావు ( గుడివాడ - టీడీపీ)
34. ఏపీ ఉమెన్స్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ - కావాలి గ్రీష్మ ( రాజాం - టీడీపీ)
35. ఏపీఎస్ఆర్టిసి రీజనల్ బోర్డు ఛైర్మెన్ ( దోన్ను దొర - టీడీపీ ( విజయనగరం జోన్ ) , రెడ్డి అప్పల నాయుడు - జనసేన( విజయవాడ జోన్ ), సురేష్ రెడ్డి - బీజేపీ( నెల్లూరు జోన్ ) , పోలా నాగరాజు - టీడీపీ ( కడప జోన్ )
36. ఏపీ హ్యాండ్ లూమ్ కోపరేటివ్ సొసైటీ - సజ్జా హేమలతా ( చీరాల - టీడీపీ )
37 . ఏపీ నాటక అకాడమీ - గుమ్మడి గోపాల కృష్ణ ( పామర్రు - టీడీపీ )
38. ఎన్టీఆర్ వైద్య సేవ - సీతారామ సుధాకర్ ( విశాఖపట్నం సౌత్ - టీడీపీ )
39. స్వచ్ఛ్ ఆంధ్రప్రదేశ్ మిషన్ - కొమ్మారెడ్డి పట్టాభి రామ్ ( విజయవాడ వెస్ట్ - టీడీపీ )
40 . అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ - స్వామినాయుడు ఆలాడ ( అమలాపురం - టీడీపీ )
41. అనంతపూర్ - హిందూపూర్ అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ - టిసి . వరుణ్ - అనంతపూర్ - జనసేన )
42. అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ - రూపానంద రెడ్డి ( కోడూరు - టీడీపీ )
43. బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ - సలగల రాజశేఖర్ బాబు ( బాపట్ల - టీడీపీ )
44. బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ - తెంటు లక్ష్మి నాయుడు ( బొబ్బిలి - టీడీపీ)
45. చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ - కే. హేమలత ( చిత్తూరు - టీడీపీ )
46. కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ - తుమ్మల రామస్వామి ( కాకినాడ - జనసేన)
47. కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ - సోమిశెట్టి వెంకటేశ్వర్లు ( కర్నూలు - టీడీపీ)
48. మచిలీపట్టణం అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ - మట్టా ప్రసాద్ ( మచిలీపట్నం - బీజేపీ)
49. నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ - కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ( నెల్లూరు రూరల్ - టీడీపీ)
50. రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ - బోడ్డు వెంకటరమణ చౌదరి ( రాజానగరం - టిడిపి )
51. శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ - కోరికన రవికుమార్ ( శ్రీకాకుళం - జనసేన )
52. విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవెలప్మెంట్ అధారిటీ - ప్రణవ్ గోపాల్ ( విశాఖపట్నం ఈస్ట్ )
53. ఏపీ స్టేట్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ - ముస్తాక్ అహ్మద్ ( నంద్యాల టీడీపీ )
54. ఏపీ ఆర్య వైశ్య వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ - డి. రాకేష్ ( విజయవాడ వెస్ట్ - టీడీపీ)
55 . ఏపీ క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ - వి. సూర్యనారాయణ రాజు ( కనకరాజు సూరి ) ( భీమవరం - జనసేన )
56. ఏపీ స్టేట్ కాపు వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ - కొత్తపల్లి సుబ్బారాయుడు ( నరసాపురం - జనసేన)
57. ఏపీ మాదిగ వెల్ఫేర్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ - ఉండవల్లి శ్రీదేవి ( తాడికొండ - టీడీపీ 
58. ఏపీ మాల వెల్ఫేర్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ - డాక్టర్ పెదపూడి విజయ్ కుమార్ ( ఒంగోలు - జనసేన )
59. ఏపీ గిరిజన కోపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ - కిడారి శ్రావణ్ ( అరకు వ్యాలీ - టీడీపీ )

By
en-us Political News

  
ఏపీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. జాతీయ స్థాయి నీట్ లీకేజీ వ్యవహారంలోకి ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల అంశాన్ని జోడించి లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసిపి నాయకత్వం విమర్శిస్తూ, నీట్ తో పాటు డీఎస్సీ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.
దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి.
రాజకీయం గురించి కాదు. పార్టీ గురించి కాదు.ఒక నాయకుడి గురించి కూడా కాదు....ఒక తరం గురించి. విజృంభించిన లాఠీల్లో రక్తం చిందించిన ఈ తరం గురించి.
గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, దూషణలతో చెలరేగిన వల్లభనేని వంశీ తాజా లేఖలో మాత్రం చంద్రబాబుకు గౌరవం ఇస్తూ అయ్యా చంద్రబాబుగారూ అని మర్యాదగా సంభోధించారు. అంతే కాకుండా చంద్రబాబు చొరవను, రైతుల పట్ల ఆయనకు ఉన్న అక్కరనూ ప్రశంసలతో ముంచెత్తారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిబంధనలకు తిలోదకాలిచ్చి.. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీ ఇప్పుడు కేసుల చిక్కుల్లో నిండా ఇరుక్కుంది. అధికారంలో ఉండగా చట్టాలకు మనం అతీతులం అన్నట్లుగా వ్యవహరించిన వైసీపీ నేతలకు ఒక్కరొక్కరుగా పోలీసు కేసులను, సీఐడీ విచారణలను ఎదుర్కొంటూ, అరెస్టులు, బెయిళ్లు అంటూ న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి పరిస్థితిలో ఉన్నారు.
ఆయన రాజీనామాకు యువత పట్టుబడుతోంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న యువత డిమాండ్ ను పట్టించుకోవడం లేదు. నీట్ పై తొలి సారిగా స్పందించి, సోషల్ మీడియా వేదికగా న్యాయం చేస్తాననీ, లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షిస్తామనీ, అందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామనీ చెప్పిన మోడీ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీమానా చేయాలన్న యువత డిమాండ్ ను ఇసుమంతైనా పరిగణనలోకి తీసుకోలేదు.
గత ప్రభుత్వ హయాంలో ముంబైకి చెందిన నటిని, ఆమె కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడంపై విచారణ వేగం పుంజుకుందన్న ఆయన.. గతంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి సరిగ్గా రెండు నెలల ముందు ముంబైలో ఉన్న కాదంబరి జత్వానీని, ఆమె తల్లిదండ్రులను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి.. ఫోర్జరీ భూలావాదేవీల కేసు సాకుగా చూపి దాదాపు 40 రోజుల పాటు జైలులో ఉంచారన్నారు.
గత ఎన్నికల్లో మంగళగిరి స్థానం నుంచి నారా లోకేష్ సాధించిన చారిత్రాత్మక విజయం ఆయనకు రాజకీయంగా పెద్ద మైలేజీని ఇచ్చింది. గతంలో ఓటమిని చవిచూసిన చోటే ఐదేళ్ల పాటు నిరంతరం ప్రజల్లో ఉంటూ, సమగ్ర ప్రచారంతో విజయం సాధించడం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక కీలక మలుపుగా మారింది.
ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీ పట్ల దురుసుగా వ్యవహరించి గాయపరచడాన్ని ఖండిచిన ఆయన రక్త గాయమైనా రాహుల్ గాంధీ వెనక్కు తగ్గకుండా పోరాట పటిమ చూపారని కొనియాడిన రేవంత్ రె్డి.. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే ప్రాథమిక హక్కులపై కేంద్రం ప్రత్యక్ష దాడికి పాల్పడిందని విమర్శించారు.
తోపులాటలో రాహుల్ గాంధీ గాయపడ్డారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ముక్కు నుంచి రక్తం కారింది. పోలీసులు ఆయనను బలవంతంగా నిలువరిస్తున్న సమయంలో ఆయన ముక్కుకు గాయమై రక్తం కారుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి. దీనిపై సర్వ్రతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
మద్యం కుంభకోణంలో ఈడీ విచారణ.. ప్రధాన లబ్ధిదారుడికి చేరువ అవుతోందనీ, ఈ నేపథ్యంలోనే జగన్ పేరు ప్రచారంలోకి వచ్చిందని అంటున్నారు. మద్యం కుంభకోణం కేసులో ఈడీ తనకు నోటీసులు పంపే అవకాశం ఉందన్న సమాచారంతోనే మోడీ, అమిత్ షాల అప్పాయింట్ మెంట్ కోసం జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాపు సామాజికవర్గ నేత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పార్టీ లైన్ ను ఇసుమంతైనా ఖాతరు చేయకుండా కాపు ఐక్యత జెండాను భుజానకెత్తుకోవడం పార్టీలో కలకలం రేపింది. ఒక వైపు వైసీపీ అధినేత జగన్.. అంబటి రాంబాబును పార్టీలో కాపు సామాజికవర్గ ఐకాన్ గా ప్రమోట్ చేస్తుంటే.. తోట త్రిమూర్తులు ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలను వేదిక చేసుకుని పార్టీలతీతంగా కాపు నేతలందరూ ఐక్యం కావాలని పిలుపునివ్వడం పార్టీలో కలకలం రేపింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.