పెద్దిరెడ్డి బుక్కైపోయినట్లేగా?

Publish Date:Jul 29, 2024

Advertisement

మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ఫైల్స్ దహనం కేసు విచారణలో వెలుగులోకి వస్తున్న విషయాలన్నీ పెద్దిరెడ్డి ప్రమేయాన్నే సూచిస్తున్నాయి.  మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందన్న అనుమానాలు సంఘటన జరిగిన నాటి నుంచీ బలంగా వ్యక్తం అయ్యాయి. దీంతో అగ్నిప్రమాదం, ఫైళ్ల దగ్ధం సంఘటనను సీరియస్ గా తీసుకున్న చంద్రబాబు సర్కార్ విచారణకు ఆదేశించింది.

దీంతో పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. వారి విచారణలో  భాగంగా ఈ ఫైళ్ల దగ్ధం వెనుక మాజీ మంత్రి పెద్దిరెడ్డి  రామచంద్రారెడ్డి ప్రమేయం ఉందన్న అనుమానాలు బలంగా వ్యక్తమౌతున్నాయి. ఈ కేసు విచారణలో భాగంగా ఇప్పటికే పెద్ద రెడ్డి అనుచరులు, వ్యక్తిగత సిబ్బందిని పోలసులుసు అరెస్టు చేశారు.  అరెస్టయిన వారిలో పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు , వైసీపీ నేత మాధవ్ రెడ్డి  కూడా ఉన్నారు. అలాగే  పెద్దిరెడ్డి పీఏ శశికాంత్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.  అంతకు ముందు శశికాంత్ ఇంటిలో సోదాలు చేపట్టిన పోలీసులు కీలక పత్రాలతో పాటు 2 ల్యాప్ ట్యాప్ లను స్వాధీనం చేసుకున్నారు.  

మరోవైపు పెద్దిరెడ్డి మంత్రిగా పని చేసినప్పుడు అధికారిక పీఏగా పని చేసిన తుకారాం  అరెస్ట్ భయంతో  పరారిలో ఉన్నారు. అయితే తిరుపతిలోని ఆయన నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. అలాగే పెద్దిరెడ్డి సన్నిహితుల ఇళ్ళలోనూ సోదాలు నిర్వహించారు. వైసీపీ హయాంలో పెద్దిరెడ్డి అండతో ఆయన కోటరీ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లుగా తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది. ఒక్కొక్కటిగా భూకబ్జాల బాగోతం బయటకు వస్తుండటంతో పాటు మదనపల్లె పైల్స్ దహనం ఫైర్ యాక్సిడెంట్ కాదని తేలడంతో పెద్దిరెడ్డి చిక్కుల్లో పడ్డట్టేనని చెబుతున్నారు. అధికారం అండతో ఇష్టారీతిగా అక్రమాలు, ఆక్రమణలకు పాల్పడిన పెద్దరెడ్డి పాపం బద్దలైనట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
ఫ్రీ బస్సులో భార్య.. నవ్వులు పూయిస్తున్న భర్త ఆవేదన. !
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, ప్రముఖ నటి రష్మిక మందన్నలకు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై వారి అధికారిక బృందం కఠిన చర్యలకు ఉపక్రమించింది.
ఆంధ్రప్రదేశ్‌కు తుపాను ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
భాగ్యనగర ప్రయాణ ముఖచిత్రం మారనుందా? నగరంలో మెట్రో రైలు సేవలను శివారు ప్రాంతాలకు విస్తరించడంతో పాటు విమానాశ్రయానికి మెట్రో కనెక్టివిటీని కల్పించే దిశ
తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపిన వంద కోట్ల రూపాయల ప్రైవేట్ పాఠశాలల అనుమతుల కుంభకోణంలో డీఎంకే సీనియర్ నేత
హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు మేక శవంతో డెత్ డ్రామా.!
దేశ రాజధాని దిల్లీలో ఎన్నికల సంఘం పనితీరును నిరసిస్తూ కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
నా చావుకే రూ.40 కోట్ల విలువనా? లేక నేను బతికి ఉండాలా అనేది ప్రభుత్వమే నిర్ణయించుకోవాలి! అంటూ జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జె. అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు
ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనానికి బానిసైన ఓ యువకుడు తన విలాసవంతమైన జీవితం కోసం ఏకంగా కిడ్నాప్ నాటకానికి తెరలేపాడు.
ఉద్యోగాల ఆశ చూపించి విదేశీ మహిళలను భారత్‌కు రప్పించడం.. ఆపై వారితో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహించడంతో మాదాపూర్‌లో వెలుగుచూసిన ఈ వ్యవహారం కలకలం రేపుతోంది.
సీఎం రేవంత్‌తో దేవేంద్ర ఫడ్నవీస్ భేటీ.. 152 మీటర్ల ఎత్తుపై ముందడుగు.!
ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో రోజూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి
ప్రస్తుత సాంకేతిక విప్లవంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం అన్ని రంగాలపై పడుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.