Publish Date:Jul 25, 2025
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన అసెంబ్లీ నియోజకవర్గం కుప్పంలో 250 బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు తెలిపారు. శుక్రవారం సచివాలయంలో జీరో పావర్టీ పీ4పై సమీక్షలో భాగంగా అధికారులు, ప్రజా ప్రతినిధులతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Publish Date:Jul 25, 2025
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. కేసు పునర్విచారణ చేయాలని రాజమండ్రి కోర్టు తీర్పు ఇచ్చింది.
Publish Date:Jul 25, 2025
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీకి దూరం పెరిగిందని, ఆయన ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళినా, అధినాయకుడి అప్పాయింట్మెంట్ దొరకడం లేదని, అదొక అందని ద్రాక్షగా మిగిలిందనే ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది. అందులో ఎంత నిజం వుంది.
Publish Date:Jul 25, 2025
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచాలన్నా పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. 2026లో జరిగే జనాభా లెక్కల తర్వాతే డీలిమిటేషన్ ఉంటుందన్న సర్వోన్నత న్యాయస్థానం చట్టంలో ఇది స్పష్టంగా ఉందని వెల్లడించారు.
Publish Date:Jul 25, 2025
బరువు తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా యూట్యూబ్‌లో చూసి ఆహార నియమాలు పాటించిన పదిహేడేళ్ల యువకుడు శక్తిశ్వరన్ మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన తమిళనాడులోని కొలాచెల్ ప్రాంతంలో చోటు చేసుకుంది.
Publish Date:Jul 25, 2025
శాంతి గోదావరి వరద ఉధృతితో మహోగ్రరూపం దాల్చింది. తెలుగు రాష్ట్రాలలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వానల కారణంగా గోదావరికి వరద నీరు పోటెత్తుతోంది.
Publish Date:Jul 25, 2025
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పర్యాటక రంగ ప్రగతిని ఇస్తున్న అత్యధిక ప్రాముఖ్యతకు గుర్తింపు దక్కింది. ఏపీ పర్యాటక శాఖకు అత్యంత ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది.
Publish Date:Jul 25, 2025
బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిన నేపథ్యంలో కోస్తాంధ్రలో ఆదివారం వరకు భారీ వర్షాల అంచన నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత సూచించారు.
Publish Date:Jul 25, 2025
ఐఏఎస్ శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలిందే . గతంలో ఇదే తెలంగాణ హైకోర్టు ఇదే ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి ప్రమేయం లేదని పేర్కొంటూ, ఆ కేసునుంచి తప్పించాలని సీబీఐ, ఈడీలను ఆదేశించింది.
Publish Date:Jul 25, 2025
వరుస పరాజయాలు మూటగట్టుకున్న గులాబీ పార్టీలో నెలకొన్న వివాదాలు, ఆధిపత్యపోరు ఆ పార్టీ ఉనికికే ప్రశ్నార్ధకంగా మారుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కారు పార్టీని తిరిగి రేసులోకి తీసుకురావాల్సిన పార్టీ ముఖ్యనేతలు, అందులోనూ కల్వకుంట్ల వారసులు వ్యవహరిస్తున్న తీరు బీఆర్ఎస్ వర్గాకు అసలు మింగుడుపడటం లేదంట.
Publish Date:Jul 25, 2025
ఉపరాష్ట్రపతి పదవికి ధన్ ఖడ్ రాజీనామా కు న్యాయమూర్తి వర్మ ఉదంతమే ప్రధాన కారణమని దాదాపుగా నిర్ధారణ అయ్యిందని పరిశీలకులు అంటున్నారు. ప్రతిపక్ష నాయకుల సంతకాలతో వర్మ అభిసంసన తీర్మానం ఆమోదించమే ధన్ ఖడ్ నిష్క్రమణ కు కారణమైంది. అంతకు ముందే బీజేపీ పెద్దలతో ఆయనకున్న విభేదాలకు ఇది క్లైమాక్స్ గా భావించాల్సి ఉంటుందంటున్నారు.
Publish Date:Jul 25, 2025
కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోకగజపతిర రాజు శుక్రవారం (జులై 25) గోవాకు బయలుదేరి వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన గోవాకు బయలు దేరారు. గోవా గవర్నర్ గా నియమితులైన ఆయన శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Publish Date:Jul 25, 2025
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయ విశ్వాసాలతో, ఆయన పరిపాలనా విధానాలతో ఎవరైనా విభేదించవచ్చుకానీ, భాతర రాజకీయాల్లో ఆయన స్థానాన్ని మాత్రం ఎవరూ కాదన లేరు.