శ్రీ చరణి ప్రభంజనం...ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్

Publish Date:Jun 26, 2026

Advertisement

 

అంతర్జాతీయ వేదికపై  సత్తాచాటిన కడప బిడ్డ...

భారత మహిళా క్రికెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన  ఒక యువ సంచలనం సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన 21 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ నల్లపురెడ్డి శ్రీ చరణి అంతర్జాతీయ క్రికెట్ వేదికపై సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రతిష్టాత్మక ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్‌లో అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతున్న ఆమె, ఒకే ప్రపంచకప్ ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారతీయ బౌలర్‌గా రికార్డులకెక్కింది. అంతేకాకుండా, అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లోకి అడుగుపెట్టిన కేవలం ఏడాది కాలంలోనే ఐసీసీ తాజా బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుని, 753 రేటింగ్ పాయింట్లతో ప్రపంచ నంబర్ వన్ బౌలర్‌గా అవతరించి సంచలనం సృష్టించింది.

​ప్రస్తుత టీ20 ప్రపంచకప్ సీజన్‌లో శ్రీ చరణి నిలకడైన ప్రదర్శనతో ప్రత్యర్థి బ్యాటర్లను వణికించింది. ఈ ఎడిషన్‌లో ఆమె ఇప్పటివరకు 12 వికెట్లు పడగొట్టి, ఒకే టీ20 వరల్డ్ కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారతీయ బౌలర్‌గా అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. గతంలో 2020 వరల్డ్ కప్‌లో పూనమ్ యాదవ్ 10 వికెట్లు తీసి అగ్రస్థానంలో ఉండగా, ఆ రికార్డును శ్రీ చరణి అధిగమించింది. ఇక 2010లో 9 వికెట్లతో డయానా డేవిడ్ నెలకొల్పిన రికార్డు ఇప్పుడు మూడో స్థానానికి పడిపోయింది. ఈ రకంగా అత్యంత తక్కువ కాలంలోనే సీనియర్ల రికార్డులను బద్దలు కొడుతూ శ్రీ చరణి భారత జట్టులో అత్యంత నమ్మకమైన బౌలర్‌గా అవతరించింది.

​కడప జిల్లా, వీరపునాయునిపల్లె మండలం, ఎర్రమల్లె గ్రామానికి చెందిన సామాన్య కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన శ్రీ చరణి క్రీడా ప్రయాణం ఎంతో మంది యువతకు స్ఫూర్తిదాయకం. ఆమె తండ్రి చంద్రశేఖర్ రెడ్డి రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌లో  ఒక సాధారణ ఉద్యోగి. శ్రీ చరణి మొదట్లో పాఠశాల దశలో ఖోఖో, లాంగ్ జంప్, బ్యాడ్మింటన్ క్రీడల్లో రాణించింది. అయితే, ఆమెలోని క్రికెట్ ప్రతిభను గుర్తించిన మేనమామ కిషోర్ కుమార్ రెడ్డి ప్రోత్సహించడంతో క్రికెట్ వైపు అడుగులు వేసింది. మొదట ఫాస్ట్ బౌలర్‌గా శిక్షణ తీసుకున్నప్పటికీ, కోచ్ ఇచ్చిన విలువైన సలహాతో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్‌కు మారి తిరుగులేని సత్తా చాటింది. 

కడప జిల్లా నుంచి భారత మహిళా జట్టుకు ఎంపికైన తొలి మహిళా క్రికెటర్‌గా ఆమె ఇదివరకే రికార్డు సృష్టించింది. ​2025లో ఇంగ్లాండ్‌పై టీ20ల్లో అరంగేట్రం చేసిన శ్రీ చరణి, తన మొదటి మ్యాచ్‌లోనే 4 వికెట్లు తీసి శ్రవంతి నాయుడు తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత బౌలర్‌గా నిలిచింది. డబ్ల్యూపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఎల్లీ పెర్రీ వంటి వరల్డ్ క్లాస్ బ్యాటర్‌ను క్లీన్ బౌల్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. గత ఏడాది జరిగిన 2025 వన్డే ప్రపంచకప్ విజయవంతమైన భారత జట్టులోనూ 14 వికెట్లతో కీలక పాత్ర పోషించిన చరణి, ఇప్పుడు టీ20 ఫార్మాట్‌లోనూ ప్రపంచ నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుని గ్లోబల్ స్టార్‌గా ఎదిగింది. కడప మట్టిలో పుట్టిన ఈ స్పిన్ మాంత్రికురాలు అంతర్జాతీయ వేదికపై దేశ కీర్తి పతాకాన్ని ఎగురవేయడం పట్ల ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్  తో పాటు కడప జిల్లా ప్రజలు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
 

By
en-us Political News

  
వైఎస్సార్ కడప జిల్లా లింగాల మండలం లోపట్నూతల గ్రామంలో నాలుగేళ్ల చిన్నారి నిత్విక అనుమానాస్పద మృతి
విజయవాడలో జరిగిన సాయికృష్ణ కస్టడీ మరణం కేసులో జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) తీవ్ర ఆగ్రహం
తుంగభద్ర డ్యామ్ ఆధునీకరణ మరియు పునర్నిర్మాణ పనుల పూర్తి సందర్భంగా కర్ణాటకలో నిర్వహించిన సభ
దశాబ్దాలుగా దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మధ్య మరియు పొరుగున ఉన్న కర్ణాకటతో నదీ జలాల పంపకాల వ్యవహారం
హైదరాబాద్‌లోని సనత్‌ నగర్‌లో ఉన్న కల్ట్ ఫిట్ జిమ్‌లో మహిళలకు లైంగిక వేధింపులు జరిగిన ఘటన తీవ్ర సంచలనం రేపింది.
రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రజా ప్రభుత్వం టీచర్లను లీడర్లు భావిస్తోంది, కష్టపడి మంచి ఫలితాలు సాధించే ఉపాధ్యాయులకు ప్రత్యేక గుర్తింపు
రాష్ట్రంలో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ వినియోగంపై ప్రజల్లో మరింత‌గా అవగాహన
సంచలన కేసుగా మారిన పుణే కేతన్ అగర్వాల్ హత్య కేసులో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
దేశవ్యాప్తంగా వేలాది మంది పెట్టుబడిదారులను భారీ రాబడుల పేరుతో ఆకర్షించి మోసానికి పాల్పడిన హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
సోషల్ మీడియా వేదికగా కిలోల కొద్దీ బంగారు ఆభరణాలు ధరిస్తూ, హల్ చల్ చేసిన హైదరాబాద్‌ గోల్డ్ మ్యాన్ సూర్య భాయ్ అసలు రంగు ఎట్టకేలకు బయటపడింది.
తెలంగాణ ప్రభుత్వం కీలక ఐఏఎస్ అధికారుల బదిలీలు, నియామకాలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది.
విజయవాడ నగరంలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసు దర్యాప్తు రోజుకో మలుపు
తెలంగాణ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా (చీఫ్ సెక్రటరీ) సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు నియమితులయ్యారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.