ఇద్దరు ముఖ్య నేతలపై నిఘా! జగన్ కు తిరుగుబాటు భయమా?  

Publish Date:Dec 3, 2020

Advertisement

రాజకీయాల్లో నమ్మకానికి చోటు ఉండదంటారు. పదవుల కోసం నాయకులు ఎంతకైనా తెగిస్తారు.. తమ అధినేతలనే ఎదురిస్తారు.. అవసరమైతే  దిగజారిపోతారు.  తమకు ఎప్పుడు సమయం దొరుకుంతుందా అన్నట్లుగా ఎదురు చూస్తుంటారు నేతలు. ఏ చిన్న అవకాశం వచ్చినా తిరుగుబాటుకు కూడా వెనుకాడరు.  గతంలోనూ ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. అందుకే రాజకీయ నేతలు పూర్తిగా ఎవరిని నమ్మరని చెబుతారు.  ముఖ్య నేతలైతే తమ వెంట ఉండేవారిపైనా నిఘా పెడుతుంటారు. వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తుంటారు. ఇలాంటి పరిస్థితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో  కనిపిస్తోంది. వైసీపీలో కీలక నేతలుగా ఉన్న ఓ కుటుంబంపై ఇప్పుడు.. ఆ పార్టీ పెద్దల్లో అనుమాన బీజం మొదలైందని చెబుతున్నారు. ఆ కారణంగానే నేతలను  పక్కన పెడుతున్నారనే చర్చ జరుగుతోంది.  

 

ఆ తండ్రి కొడుకులు ప్రస్తుతం ఏపీకి సంబంధించి కీలక పదవుల్లో ఉన్నారు. సీఎం వైఎస్‍ జగన్‍ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. ఆ తండ్రి కొడుకులపై  జగన్‍రెడ్డి గతంలో ఎంతో నమ్మకం చూపించేవారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు,  అధికారంలోకి వచ్చాక  కూడా ఆ ఇద్దరికి  అత్యంత విలువ ఇచ్చేవారు. కాని ఇప్పుడు మాత్రం సీన్ మారిందంటున్నారు.  ఆ తండ్రి కొడుకులపై సిఎం జగన్‍ రెడ్డికి అనుమానాలు వచ్చాయంటున్నారు. మీడియాతో పాటు సోషల్‍ మీడియాలో వస్తున్న కథనాలతో అవి మరింత బలపడ్డాయని చెబుతున్నారు. దీంతో గతంలో ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన ఆ ఇద్దరు నేతలను ఇప్పుడు జగన్ ఎక్కువగా పట్టించుకోవడం లేదనే చర్చ వైసీపీ నేతల్లో జరుగుతోంది. ఆ మంత్రి కుమారుడు  తాడేపల్లి నివాసానికి ఎప్పుడు వచ్చినా రెడ్‍ కార్పెట్‍ పరిచేవారు. ఆ ఎంపీ మాత్రమే  జగన్‍ రెడ్డిని ఏ సమయంలోనైనా కలిసే వ్యక్తిగా పేరుంది. అలాంటి నేత ఇప్పుడు అనుమానపు చూపులతో తాడేపల్లి రావడమే మానేశారని తెలుస్తోంది. 

 

వైసీపీ పెద్దలకు అనుమానం వచ్చిన ఆ ఇద్దరు నేతలు పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి. మిధున్‍ రెడ్డి. తండ్రి పెద్ది రాంచంద్రారెడ్డి జగన్ కేబినెట్ లో కీలక మంత్రిగా ఉండగా.. ఆయన తనయుడు మిథున్ రెడ్డి వైసీపీ లోక్ సభ ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు. వారిద్దరిపై జగన్ కు అనుమానం రావడానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి పదవే. ఇటీవల సీఎం జగన్ పై ఓ చర్చ జరుగుతోంది. కోర్టు తీర్పుల వలన జగన్  జైలుకు వెళ్లవచ్చని.. జగన్ జైలుకు పోతే తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అవుతారన్నది ఆ చర్చ సారాంశం. జగన్ భార్య భారతిని కానీ.. తల్లి విజయలక్ష్మీని కానీ ముఖ్యమంత్రిని అవుతారని కొందరు చెబుతున్నారు. ఇక్కడే అసలు  ట్విస్ట్ మొదలైంది. ముఖ్యమంత్రి రేసులో మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి ఉన్నారనే ప్రచారం సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. జగన్ జైలుకు పోతే  ముఖ్యమంత్రి కావాలని పెద్దిరెడ్డి ఆశ పడుతున్నారనే చర్చ జరుగుతోంది. ఆయనకు 70 నుండి 80 మంది ఎమ్మెల్యేలు మద్దతిస్తున్నారని.. అవసరమైతే ఆయన తిరుగుబాటు చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారని కొన్ని మీడియా సంస్థలు కధనాలు ప్రచురించాయి. ఒకటి రెండు టివి ఛానెళ్లు ఆ మంత్రిని ఇంటర్యూ  కూడా చేశాయి. 

 

ఇదే ఇప్పుడు ఆ తండ్రి కొడుకులకు సమస్యగా మారిందంటున్నారు. తనకు అలాంటి ఆలోచన లేదని, సిఎం జగన్‍ రెడ్డి జైలుకు వెళ్లే ప్రసక్తే లేదని పెద్దిరెడ్డి చెబుతున్నారు. ఒకవేళ  ఏదైనా జరిగితే .. సిఎంగా జగన్‍  ఎవరిని సూచిస్తే వారినే అంగీకరిస్తామే తప్ప సిఎం పోస్టు కోరుకునే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేస్తున్నారు. అయినా పెద్దిరెడ్డిపై జరుగుతున్న ప్రచారం ఆగడం లేదు.  దీంతో సీఎం జగన్ కూడా వారిని నమ్మడం లేదని చెబుతున్నారు.  మంత్రి రామచంద్రారెడ్డితో పాటు ఎంపీ మిధున్‍ రెడ్డి కదలికలపై  ముఖ్యమంత్రి నిఘా వేయించారని ప్రచారం జరుగుతోంది. ఎంపీ మిథున్ రెడ్డి మాత్రం తమపై ఎలాంటి నిఘా లేదంటున్నారు. తాము జగన్‍  వీర విధేయులమని, తమపై కావాలనే లేనిపోని అనుమానాలను కొందరు సృష్టిస్తున్నారని వాపోతున్నారు. అయితే  మంత్రి రామచంద్రారెడ్డి తిరుగుబాటు చేస్తారని జరుగుతున్న ప్రచారం వెనుక వైసీపీ నేతలే ఉన్నారనే అనుమానాలు కూడా  వస్తున్నాయి. అయితే ఆ సూత్రదారులు, పాత్రదారులు ఎవరో బయట పడటం లేదు.. మొత్తానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై జరుగుతున్న చర్చ మాత్రం ఏపీ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది.

By
en-us Political News

  
తెలంగాణ ప్రయోజనాలే తమకు పరమావధన్న ఆయన పార్లమెంటులో ఈ ప్రతిపాదనపై చర్చ,  ఓటింగ్ జరిగినప్పుడు తమ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తారని వెల్లడించారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు ఆమోదం పొందితే దేశ రాజకీయాలలో కాంగ్రెస్ ప్రతిష్ఠ బాగా మసకబారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. ఇది 2029 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై నిస్సందేహంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
తొలి విడత పంచాయతీ ఎన్నికలలో  వైసీపీ మద్దతుదారులు కనీసం పాతిక శాతం  స్థానాలను కూడా గెలుచుకోలేకపోయారు. అదే సమయంలో తెలుగదేశం కూటమి మద్దతు ఉన్నఅభ్యర్థులు తిరుగులేని విజయాలతో ప్రభంజనం సృష్టించారు. 
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బిల్లు ఉద్దేశాలను, ప్రక్రియను  తప్పుబడుతుండగా, ఇండియా కూటమిలోని పలు ప్రాంతీయ పార్టీలో,  సీట్ల వాటా రక్షణ, సవరణల ఆధారంగా తమ వైఖరిని మార్చుకుంటున్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
డీలిమిటేషన్ తో పాటు, మహిళా రిజర్వేషన్ల అమలును తీసుకురావడమే ఈ సమావేశాల నిర్వహన ప్రధాన లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ చెబుతున్నప్పటికీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ హడావుడి సమావేశాల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం బీజేపీకి రాజకీయ లబ్ధి చూకూర్చడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఏ   రాష్ట్రంలోనూ  సీట్ల వాటా తగ్గదు, ప్రస్తుత నిష్పత్తిని కాపాడుతూనే అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా స్థానాలు పెరుగుతాయి.  అంతేకాకుండా, 2051 సీట్ల విషయంలో మార్పులు లేకుండా స్తంభనను అమలు చేయడం ద్వారా భవిష్యత్ జనాభా గణాంకాల ఆధారంగా రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తి మారకుండా నియంత్రించామని కేంద్రం చెబుతోంది. 
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.