ఐఏఎస్‌లకు వాత పెడితే... సిబ్బంది లైన్‌లోకి వచ్చారు !

Publish Date:Mar 17, 2020

Advertisement


 

పొద్దు పొద్దునే హైదరాబాద్ లక్ డీ కా పూల్ టెలిఫోన్ భవన్ దగ్గర ప్రతి సోమవారం కనిపించేహడావుడి ఈ సారెందుకో కనిపించలేదు. ఐదు రోజుల పని దినాల పుణ్యమా అని, చాలా మంది ఆంధ్ర ప్రదేశ్ సచివాలయ సిబ్బంది, అధికారులు ....హైదరాబాద్ లోని తమ ఇళ్లలో రెండు రోజులు సేద దీరి, సోమవారం పొద్దుట అమరావతి బస్సెక్కి విజయవాడ కు చేరుకోవటం రివాజు గామారింది. గడిచిన ఐదేళ్ళలో ఇది వారికొక రెగ్యులర్ ప్రాక్టీస్ గా నిలిచింది. అయితే, ఐదు రోజుల పనిదినాలను దుర్వినియోగం చేస్తూ జవాబుదారీతనం లేకుండా వ్యవహరిస్తున్న ఐఏఎస్ అధికారుల తీరుపై సీఎం జగన్ మోహన్ రెడ్డి కిందటి వారం సీరియస్ అవటం తో, ఇప్పుడు హైదరాబాద్ లో కాపురాణాలంటూ..అమరావతి లో ఉద్యోగాలు చేసుకుంటున్న సిబ్బంది, అధికారులు కూడా అప్రమత్తమయ్యారు.

 

 

పని  దినాల్లో కూడా సచివాలయంలో కనిపించకపోతే ఎలా అంటూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఐ ఏ ఎస్ లకు వేసిన  అక్షింతల ప్రభావం, ఇప్పుడు సిబ్బంది, అధికారుల మీద కూడా పడింది.. ఇకపై అలా కుదరదని, వారాంతాలతో పాటు పని దినాల్లోనూ అమరావతి విడిచి వెళ్లాలంటే అనుమతి తీసుకోవాల్సిందేనని ఐ ఏ ఎస్ లు, తమ్ దగ్గర పనిచేసే అధికారులను, సిబ్బందికి  తేల్చిచెప్పేశారు.

 

ముందస్తు అనుమతి లేకుండా హైదరాబాద్, ఢిల్లీ పర్యటనలకు వెళితే చర్యలు తప్పవని సి.ఎం. జగన్ మోహన్ రెడ్డి ఐ ఏ ఎస్ లకు చెప్పడంతో, ఆ ఆదేశాలను వారు తమ కింది స్థాయి అధికారులకు, సిబ్బందికి కూడా పాస్ ఆన్ చేశారు. తమ అనుమతి లేకుండా , శుక్రవారం మధ్యాహ్నం నుంచే వెళ్ళిపోయి, సోమవారం మధ్యాహ్నానికి అమరావతి కి చేరుకునే స్కీములకు ఇక స్వస్తి పలకండని సిబ్బందికి ఐ ఏ ఎస్ లు ఆదేశాలు జారీ చేశారు. ఐదు రోజుల పనిదినాలను సైతం సీరియస్ గా తీసుకోకుండా అమరావతి విడిచి వెళ్లిపోతున్న ఐఏఎస్ అధికారులపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేయడం  ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశంగా మారడంతో, వారు కూడా అందుకు తగ్గట్టుగా తమ పద్ధతులను మార్చుకున్నారు. . అయితే ఇందుకు ఓ కారణం జగన్ రోజూ సచివాలయనికి రాకపోవడమనే వాదన కూడా వినిపిస్తోంది. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రోజూ సచివాలయానికి వచ్చేవారు. దీంతో అధికారులు, సిబ్బందిలోనూ ఆ భయం ఉండేది. కానీ జగన్ మాత్రం అమరావతిపై అయిష్టతో, లేక సొంతిట్లో నుంచి రివ్యూలు చేసుకోవచ్చన్న ఆలోచనతో తెలియదు కానీ సచివాలయానికి వచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కీలక సమావేశాలన్నీ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచే కానిచ్చేస్తున్నారు. దీంతో ఐఏఎస్ అధికారులతో పాటు సచివాలయంలోని ఉద్యోగులకూ ఇదే అలుసుగా మారిపోయింది.

 

 

అదే సమయంలో సీఎం జగన్ రాకపోవడంతో ఆయన కేబినెట్ లోని మంత్రులు కూడా సచివాలయానికి రావడం మానేశారు. దీంతో ఏ ఒక్క ఉద్యోగికీ ప్రభుత్వంపై ఎలాంటి భయాలు ఉండటం లేదని సచివాలయంలో పరిస్దితి చూస్తే అర్దమవుతుంది. అయితే తాజాగా పలుమార్లు మంత్రులను ప్రతీ బుధవారం కచ్చితంగా సచివాలయానికి రావాలని చెప్పిన జగన్... తాజాగా ఐఏఎస్ అధికారులకూ క్లాస్ పీకడాన్ని బట్టి చూస్తే వీరి గైర్హాజరీతో ప్రభుత్వ పాలనపై పడుతున్న ప్రభావం ఏమిటో అర్దమవుతోంది.

By
en-us Political News

  
ఒక్క తెలంగాణ అని కాదు, ఏ రాష్ట్రంలోనైనా ఒంటరిగానే బరిలోకి దిగుతామని చెప్పారు. ఆ దిశగా ముందు.. తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికలలో ఒంటరి పోరుకు సిద్ధమౌతున్నట్లు చెప్పారు.
ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్‌లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు.
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టేయడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో వివాదం తలెత్తింది. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్‌నాథ్ షిండేకు కనీసం ఆహ్వానంఅందలేదు.
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది.
ఈ గ్లోబల్ ఎక్స్‌పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది
ప్రస్తుత జాతీయ రాజకీయాల పరిస్థితులు, పార్టీ భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకుని చింతకాయల విజయ్ రాజ్యసభకు పంపడమే సముచితమని ఆయన నిర్ణయించారు. ప్రస్తుతం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తరుణంలో పార్లమెంట్‌లో పార్టీ గళాన్ని బలంగా వినిపించగల యువ, విద్యావంతులైన నాయకత్వం అవసరమని చంద్రబాబు భావించినట్లు కనిపిస్తోంది.
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.