ఏపీలో రాజకీయ హత్యలు.. నేతల‌ ఆందోళన..

Publish Date:Feb 26, 2022

Advertisement

సిపిఐ సీనియర్ నాయకుడు కే. నారాయణ ఆంధ్ర ప్రదేశ్’లో రోజు రోజుకు దిగజారి పోతున్న శాంతి భద్రతల పరిస్థితి పట్ల ఆందోళన వ్యక్త పరిచారు.రాష్ట్రంలో మరిన్ని రాజకీయ హత్యలు జరిగే అవకాశం ఉందని సంచలన ప్రకటన చేశారు. ముఖ్యంగా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాబాయి, మాజీ మంత్రి, మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచరణంలో వెలుగు చూస్తున్న అంశాలు ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయని, రాష్ట్రంలో మరిన్ని రాజకీయ హత్యలు జరిగే ప్రమాదం ఉందని అన్నారు. వివేకా హత్యకేసు దర్యాప్తు చేస్తున్న... సీబీఐ అధికారుల మీదే రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెడుతోందని ఆరోపించారు. ఈ పరిస్థితిని చూస్తే, ప్రభుత్వం ఎవరినో రక్షించే ప్రయత్నం చేస్తోందని పిస్తోందని నారాయణ అన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏం జరిగిందో అందరికీ అంతా అర్థమైపోయిందని ఈ విషయంలో జగన్ రెడ్డి  కుటుంబం నైతిక బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం నారాయణ స్పష్టం చేశారు. కుటుంబ రాజకీయ కలహాలు నేపధ్యంగా సాగుతున్న రాజకీయ హత్యలు ఇంతటితో ఆగవని.. భవిష్యత్‌లో కూడా రాజకీయ ప్రయోజనాల కోసం హత్యలు జరుగుతాయని నారాయణ అన్నారు. వీటిని నివారించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ హత్యలు జరగకుండ కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. అదలా ఉంటే నిజంగానే సిపిఐ నారాయణ అనుమానిస్తునట్లుగానే వివేకా హత్య కేసు విచారణలో వెలుగు చూస్తున్న విషయాలు పలు అనుమానాలకు తావిచ్చేలా ఉన్నాయని,రాజకీయ నాయకులు, విశ్లేషకులే కాదు, సామాన్య పజలు కూడా ఆందోళన వ్యక్త పరుస్తున్నారు,

నిజానికి ఇదొకటే కాదు, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, హింసా రాజకీయాలకు పాల్పడుతోందనే ఆరోపణలున్నాయి. జగన్మోహన రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రజావేదికను కూల్చి వేశారు, ఇక అది మొదలు, తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు , నాయకులపై దాడులు, పట్టపగలు నడి రోడ్డు హత్యలు, మాన భంగాలు వంటినేరాలు పెరిగిపోతూనే ఉన్నాయనేది కాదనలేని నిజం.  జగన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు పది మండికి పైగా టీడీపీ నాయకులు హత్యకు  గురయ్యారని స్వయంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పలుమార్లు ఆరోపించారు. ఇక నాయకుల అరెస్టులు, పార్టీ కార్యాలయాల పై దాడుల విషయం అయితే చెప్పనే అక్కర లేదు.అందుకే, ఒక్క నారాయణే కాదు, పలువురు రాజకీయ నాయకులు, సామాన్య ప్రజలు కూడా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరుకుంటున్నారు.

By
en-us Political News

  
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
విజయవాడలో ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఆన్‌లైన్ పరిచయం.. చాటింగ్‌తో స్నేహం.. వీడియో కాల్స్‌తో నమ్మకం.. ఆ తర్వాత ఇంటికి ఆహ్వానం. అంతా సజావుగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఆ పరిచయాల వెనుక ఉన్నది స్నేహం కాదు
హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్‌ 2026లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.!
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది.
ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి సుపారీ.. షాకింగ్ ట్విస్ట్.!
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి స్వస్థలానికి వచ్చిన ఓ యువతికి మృత్యువు అనూహ్య రీతిలో ఎదురైంది.
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
తీపి పదార్థమనుకుని నోట్లో పెట్టుకున్నాడు.. చివరకు విగతజీవిగా మారాడు!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.