కేసీఆర్ జీ... రైతుల ఆత్మహత్యలు ఆపండి!

Publish Date:Jul 7, 2014

Advertisement



ప్రస్తుతం తెలంగాణలో రైతుల సంక్షేమాన్ని కోరుకునే ప్రతి ఒక్కరూ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒక్కటే కోరుతున్నారు... అదే.. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఆపండని! అసలే తెలంగాణ ప్రజలు.. ముఖ్యంగా యువకులు, రైతులు చాలా సున్నిత హృదయం కలవారు. మొన్నటి వరకూ తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతోమంది యువకులు ఆత్మబలిదానాలు చేసుకున్నారు. ఇప్పుడు తెలంగాణ వచ్చేసింది. అభివృద్ధి ఫలాలు అందరికీ అందుతాయి, ఇక రాష్ట్రంలో ఆత్మహత్యలనేవే వుండవని అందరూ ఆశించారు. అయితే ఇప్పుడు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మొన్నటి వరకూ యువకులు.. ఇప్పుడు రైతులు. ఈ ఆత్మహత్యల పర్వం తెలంగాణ తల్లికి కడుపు కోతను మిగులుస్తోంది. ఎంతో ఆత్మ గౌరవంతో స్వపరిపాలనను సాధించుకున్న ఈ సమయంలో కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ వుండటం అత్యంత విచారకరమైన విషయం. ఎన్నికల సందర్భంగా రైతు రుణాలు మాఫీ చేస్తామని రైతులకు కేసీఆర్ ఇచ్చిన హామీ తెలంగాణ రైతుల్లో ఆనందాన్ని కలిగించింది. కేసీఆర్ మాటని నమ్మిన తెలంగాణ రైతులు కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీకి అధికారాన్ని అప్పగించారు. కేసీఆర్ ప్రభుత్వం రుణాల మాఫీకి సంబంధించిన అన్ని అంశాలనూ పరిశీలిస్తున్న సమయంలోనే రైతులు వరుసగా ఆత్మహత్యలు చేసుకుంటూ వుంటడం తెలంగాణ రైతుల సున్నిత మనస్తత్వానికిమరోసారి అద్దం పడుతోంది. రైతు రుణాల మాఫీ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం వెనకడుగు వేస్తోందన్న అపోహకి గురైన ఇద్దరు రైతులు కేసీఆర్ అధికారం చేపట్టిన తొలినాళ్ళలోనే ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో ముగ్గురు అన్నదాతలు, నల్లగొండ జిల్లాలో ఒక అన్నదాత ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నలుగురు రైతులూ అప్పుల బాధతోనే ఆత్మహత్య చేసుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తానని చెబుతూ వున్నప్పటికీ రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడటం అత్యంత విచారకరమైన అంశం. అయితే రుణ మాఫీ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం మాట తప్పుతున్న దారిలో వెళ్తున్నందువల్లే తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని విమర్శకులు అంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో రైతుల ఆత్మహత్యలను ఆపాల్సిన బాధ్యత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద వుంది. రైతు రుణాల మాఫీ విషయంలో రైతులలో ఏర్పడిందని భావిస్తున్న అపనమ్మకాన్ని తొలగించాల్సిన బాధ్యత కూడా ఆయన మీదే వుంది. రుణాల మాఫీకి సంబంధించి తెలంగాణ రైతుల్లో అపోహలు తొలగించేలా చేయడం టీఆర్ఎస్ ప్రభుత్వం ముందు వున్న తక్షణ కర్తవ్యం. ఇప్పటికే రైతు రుణ మాఫీ విషయంలో మనసులు కష్టపెట్టుకున్న ఆరుగురు తెలంగాణ రైతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇకముందు మరొక్కరు ఆత్మహత్య చేసుకున్నా అది కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యంగానే భావించాల్సి వస్తుంది. ఈ పరిస్థితి రాకుండా కేసీఆర్ తగిన చర్యలు తీసుకుంటారని పలువురు ఆశిస్తున్నారు.

By
en-us Political News

  
ఉద్యమ నేత కుమార్తె అన్న ఇమేజ్‌కు తగ్గట్లుగానే తెలంగాణ పాలిటిక్స్‌లో ఆమె ఫైటర్‌లా తన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.