Publish Date:Aug 10, 2025
జై జవాన్.. జై కిసాన్.. జైహింద్.. నినాదాలకే పరిమితమా? కర్షకులకు, శ్రామికులకు సరైన ఆదాయం లేక విలవలలాడుతున్న జన భారతం. వివరాల్లోకి వెడితే.. ఆరు దశాబ్దాల కిందట భారతావని వరుస కరువు కాటకాలతో ఆకలి కేకలతో అల్లాడి, తల్లడిల్లిపోయింది. విదేశాల నుంచి ధాన్యం వస్తే తప్ప మన పొయ్యిలోని పిల్లి లేవని దుస్థితి. నాడు ఓడ వస్తేనే నోట్లోకి ముద్ద వెళ్లేది అనే నానుడి దేశ ప్రతిష్ఠకు మచ్చలా మారింది.
అలాంటి దుర్భర, దీనావస్థ నుంచి అనతి కాలంలోనే ఆహార ధాన్యాల దిగుబడిలో స్వావలంబన సాధించగలిగే స్థాయికి భారత దేశం చేరుకోగలిగింది. హరిత విప్లవం పితామహుడు, ఎంఎస్ స్వామినాథ్ ఆధ్వర్యంలో విశ్వవిఖ్యాత శాస్త్రవేత్త నార్మన్ బోర్లాంగ్ సహకారంతో 1960లో మొదలైన హరిత విప్లవం భారత జాతి తలరాతను మార్చివేసింది. ఆధునిక దిగుబడి ఇచ్చే వంగడాల వినియోగం, నీటి వనరుల సమర్థ వాడకం, చీడపీడ నివారణల పద్ధతులకు ప్రాధాన్యత ఇవ్వడంతో హరిత విప్లవం ప్రారంభమైన ఐదేళ్లలోనే దేశీయంగా గోధుమ ఉత్పత్తి దాదాపు రెట్టింపైంది. రెండున్నర దశాబ్దాలలో వరి ఉత్పాదకతలో మూడు రెట్లు వృద్ధి నమోదైంది. హరిత విప్లవం దరిమలా జన భారతానికి ఆహారభద్రత లభించినప్పటికీ.. సాగుదారుల ఆదాయాలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్నాయి. రైతు సంక్షేమానికి ఎంఎస్ స్వామినాథన్ చేసిన సిఫారసులు బుట్లదాఖలయ్యాయి. సిఫారసులు ఆచరణలోకి తీసుకురావడంపై ప్రభుత్వాలు దృష్టి సారించినప్పుడే సాగురంగ రుషి అయిన ఎంఎస్ స్వామినాథన్ కు ఘనమైన నివాళి.
అన్నదాతలు, మట్టిమనుషులకి వ్యవసాయం అంటేనే వ్యయం చేయడం, సాయం అడగడం పరిపాటి అయిపోయింది. నేటి రైతు దుస్థితికి ప్రభుత్వ విధానాలు కారణమైతే.. ప్రకృతి వికృతి రూపం కారణం. రైతే దేశానికి వెన్నెముక అంటారు. సకలచరాచర జీవకోటికి అన్నంపెట్టే అన్నదాత.. ఆర్తనాదాలు లేని గ్రామాలే లేవంటే అతిశయోక్తి కాదు. కారణాలు అనేకం. రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. సరైన మార్కెటింగ్ సౌకర్యాలు లేవు. పండించిన పంటలను నిల్వ చేసుకునే శీతల గిడ్డంగులు లేవు. రైతులకు సకాలంలో ఎరువులు, క్రిమి సంహారక మందులపై సబ్సిడీ అందుబాటులో ఉండటం లేదు. క్రిమి సంహారక మందుల ధరలు ఏటాటా అడ్డూ అదుపూ లేకుండా పెస్టిసైడ్స్ కంపెనీలు పెంచుకుంటూ పోతుంటే..కేంద్ర, రాష్ట్ర వ్యవసాయ మంత్రులు లంచాలవతారులై రైతు వెన్ను విరుస్తున్నారు. నకిలీ పెస్టిసైడ్స్, విత్తనాలు విచ్చలవిడిగా అమ్ముతున్నారు. అమ్మేవారిపైన కఠిన చర్యలు ప్రభుత్వాలు తీసుకోవడం లేదు. రైతు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లభించినప్పుడే వ్యవసాయం ఫలసాయం అవుతుంది..
వ్యవసాయ విశ్వవిద్యాలయాలలో అధిక దిగుబడి ఇచ్చే కొత్త వంగడాలు సృష్టించడంలో మన శాస్త్రవేత్తలు వెనుకబడి ఉన్నారు. వ్యవసాయ ఉత్పత్తులు నేరుగా ప్రభుత్వమే సేకరించి రైతులకు తక్షణమే ప్రభుత్వ మద్దతు ధరతో చెల్లించే ప్రక్రియ లేనే లేదు. మధ్య దళారీ వ్యవస్థ వల్ల అటు రైతు, ఇటు వినియోగదారుడు నష్టపోతున్నారు. ఈ మధ్య కాలంలో రాయలసీమలో తోతాపురి మామిడి రైతుల దుస్థితి చూశాము. అదే విధంగా పక్కనే ఉన్న మెట్రోపాలిటిన్ నగరాలైన చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ మొదలైన నగరాలలో తోతాపురి మామిడి కిలో 60 రూపాయల నుంచి 80 రూపాయల వరకూ అమ్మడం జరిగింది. కనీసం రైతులకు కేజీకి ఎనిమిది రూపాయలు కూడా గిట్టుబాటు కాలేదు. దీనికి కారణం ఎవరు? మన పాలకుల విధి విధానాలే. ఇలాగా అన్ని పంటల దుస్థితి ఇలాగే దాపురించింది. ప్రభుత్వాలు మేలుకోకపోతే దేశంలో భవిష్యత్ లో వ్యవసాయం చేసే వారే కరువౌతారు. తస్మాత్ జాగ్రత్త.!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/farmers-distruss-with-governmen-policies-25-203933.html
రండవాణేలోని కల్మాడీ హౌస్‌లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్‌ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.
ఇంత కాలం కల్వకుంట్ల కవిత తన విమర్శలను హరీష్ రావు, సంతోష్, జగదీశ్వరరెడ్డి వంటి నాయకులకే పరిమితం చేసిన కవిత ఇప్పుడు బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు, సవాళ్లు సంధిస్తున్నారు.
తాజా చిట్ చాట్ లో ఆమె తన తండ్రి కేసీఆర్ నే నేరుగా నిలదీశారు. కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొడితే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇక ఖతమేనన్నారు. అయినా ఎటువంటి తప్పూ చేయకపోతే కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదని నిలదీశారు.
గత కొంత కాలంగా తన స్వంత కుమారుడు, కుమార్తెల మధ్య పంచాయతీని పరిష్కరించే విషయంలో విఫలమైన ఆయన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య జలపంచాయతీలు, కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. రానున్న రోజులలో బీఆర్ఎస్ కనుమరుగైపోవడం ఖాయమని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి గాలి జనార్ధన్ రెడ్డిపై రెండు రౌండ్లు కాల్పులు జరపగా, ప్రతిగా గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించాడు.
Publish Date:Dec 31, 2025
తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.