పేర్ని నాని ఇక అరెస్టేనా?

Publish Date:Jun 12, 2025

Advertisement

మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు పేర్ని నానికి నకిలీ పట్టాల వ్యవహారంలో ఉచ్చు గట్టిగా బిగిసిందా? అంటూ ఔనన్న సమాధానమే వస్తున్నది.  ఇప్పటికే వైసీసీ సీనియర్లు, కీలక నేతలు అన్న ఒక్కొక్కరూ జైలు దారి పడుతున్నారు. వల్లభనేని వంశీ, మాజీ మంత్రి కాకాణి, కొమ్మినేని.. రాజ్ కేశిరెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, గోవిందప్ప.. ఇలా జగన్ కు సన్నిహితులంతా ఒకరి తరువాత ఒకరుగా జైలు బాటపడుతున్నారు. ఈ అరెస్టులన్నీ కక్ష సాధింపులో భాగమేనని వైసీపీ ఎంతగా ప్రచారం చేసుకుంటున్నా ఫలితం కనిపించడం లేదు. అధికారంలో ఉండగా నిబంధనలకు తిలోదకాలిచ్చి, ఇష్టారీతిగా చేసిన అక్రమాలు, అవినీతి కారణంగానే ఈ అరెస్టులు అన్న క్లారిటీ ఇప్పటికే ప్రజలలో కనిపిస్తున్నది. ఇక వైసీపీ మౌత్ పీస్ లాంటి ఓ చానల్  
 ఇటీవల నిర్వహించిన చర్చా వేదికలో జర్నలిస్ట్ కృష్ణం రాజు చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా చల్లారలేదు. ఈ వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు, వాటికి వంతపాడినట్లుగా వ్యవహరించిన సదరు చానల్ ఇన్ పుట్ ఎడిటర్ కొమ్మినేని అరెస్టయ్యారు. వీరి వ్యాఖ్యలకు నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలను ఉద్దేశించి వైసీపీ సీనియర్ నేత, పార్టీ కోఆర్డినేటర్ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. ఆయన కూడా నేడో రేపో కటకటాలు లెక్కించక తప్పదని న్యాయనిపుణులు అంటున్నారు. 

సరిగ్గా ఈ తరుణంలో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కూడా మరో కేసు విషయంలో పీకల్లోతు కూరుకుపోయినట్లు కనిపిస్తోంది.   ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం ప్రాంతంలో గత ఎన్నికలకు ముందు వైసీపీ నాయకులు నకిలీ పట్టాలు పంపిణీ చేసిన కేసులో పేర్నినాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టు ఉన్నట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణ కువచ్చారు. ఆ కేసులో పేర్ని నాని అరెస్టయ్యే అవకాశాలు ఉన్నాయని గట్టిగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే  పేర్ని నాని, పేర్ని కిట్టు ముందస్తు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్ ను హైకోర్టు గురువారం (జూన్ 12) విచారిస్తుంది. అయితే కోర్టు ముందస్తు బెయిలు మంజూరు కాకుంటే? అన్న భయం పేర్ని నానిని వెంటాడుతోంది.

ఆ భయంతోనే హడావుడిగా  నాని పార్టీ నాయకులు, శ్రేణులు, తన అనుచరులతో గురువారం (జూన్ 12) అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన పోలీసులపై, తెలుగుదేశం కూటమి నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సందర్భం లేకుండా గతంలో రేషన్ బియ్యం అక్రమాల విషయంలో తన భార్యను పోలీసు స్టేషన్ కు పిలిపించి విచారించిన సందర్భాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు తెలుగుదేశం కూటమి టైం నడుస్తోంది.. మన టైం వస్తుంది ఇంతకు ఇంతా తిరిగి ఇస్తాం అంటూ వార్నింగులకు దిగారు. అంతే తప్ప అత్యవసర సమావేశం లక్ష్యం, వ్యూహంపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈ నేపథ్యంలోనే కోర్టు తీర్పు విషయంలో ఆయన టెన్షన్ పడుతున్నారని పరశీలకులు విశ్లేషించడానికి కారణంగా చెప్పవచ్చు.  

By
en-us Political News

  
అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది, దీని ఫలితాన్ని అనేక నిర్మాణాత్మక మరియు రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం తన చోటుకు ఎసరు వస్తున్నదా అన్న అనుమానంతో.. ఆ కాపు నేత తానేనని చాటుకోవడానికి తన వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారంటున్నారు. నేను సైతం అంటూ ఆయన రంగంలోకి దిగినట్లు వైసీపీ వర్గీయులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఇందుకు తార్కానాలు కూడా చూపుతున్నారు.
ఉభయ సభలలో ఆమోదం పొందిన ఆ బిల్లు ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరింది. ఇక ఆమె సంతకం పెట్టడానూ ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఆమె నేడో, రేపో ఈ బిల్లుపై సంతకం చేయడం ఖాయమని అంటున్నారు.
తమిళనాడులో 2026 ఎన్నికలు హోరాహోరీగా సాగే పోరుగా రూపుదిద్దుకుంటున్నాయి, ఇందులో స్పష్టమైన విజేత ఎవరూ లేరు. స్వల్ప ఓట్ల మార్పులు సీట్ల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపవచ్చు.
రాజకీయం అంటే కేవలం అధికారంలో ఉండటం మాత్రమే కాదని, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ముందుకు సాగాలని వైసీపీకి హితవు పలుకుతున్నట్లుగా మాట్లాడుతూనే.. ఆ పార్టీకి కర్తవ్యబోధ చేశారు.
బిజెపికి 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్‌తో పునాదులు పడ్డాయి. అక్క‌డి నుంచి ఈ పార్టీ అంచ‌లంచ‌లుగా ఎదిగి నేడీ స్థితికి చేరుకుంది. గ‌తంలో వాజ్ పేయి ఈ పార్టీకి అధికార వాస‌న రుచి చూప‌డంతో.. ఇప్పుడు వ‌రుస‌గా మూడు ప‌ర్యాయాల పాటు అధికారం చేజిక్కించుకుని.. ప్ర‌స్తుతం అప్ర‌తిహాత జైత్ర యాత్ర చేస్తోంది.
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఎండలు మండిపోతాయి. వడగాలుల ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది.
రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారాయి.
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్.. ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
మూడు రాజధానుల అంశం గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించి.. మళ్ళీ అదే తరహా ప్రత్యామ్నాయ వాదనలు వినిపించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. పార్టీ కేడర్ సైతం మావిగన్ ఏంటి అదేదో పంటకు పట్టే తెగుల్లా ఉందని నెత్తీ నోరూ బాదుకుంటోంది.
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.