ప్రముఖ నటి, మాజీ ఎంపీ రమ్య(దివ్య స్పందన) కన్నుమూశారని ప్రచారం జరుగుతోంది. 40 ఏళ్ళ రమ్య గుండెపోటుతో బుధవారం ( సెప్టెంబర్ 6) తుదిశ్వాస విడిచినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అవుతోంది. అయితే ఈ వార్తల్లో నిజం లేదని ఆమె సన్నిహితలు చెబుతున్నారు. ఈ ఫేక్ ప్రచారం ఎవరి పని అని అభిమానులు ఆరా తీస్తున్నారు. రమ్య తెలుగు, తమిళం, కన్నడ సినిమాల్లో నటించారు. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన 'అభిమన్యు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. 'సూర్య సన్నాఫ్ కృష్ణన్'లో ప్రియగా తన నటనతో కట్టిపడేసారు. రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. ఎంపీగా పనిచేశారు. రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రిటీల విషయాలలో ఫెక్ న్యూస్ తలనొప్పులు సాధారణంగా వైరల్ అవుతుంటాయి. సినీ సెలబ్రిటీల విషయంలో అయితే ఫలానా వ్యక్తితో డేటింగ్ లో ఉన్నారు, ఫలానా వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ రకరకాల గాసిప్స్ వినిపిస్తుంటాయి. రాజకీయ ప్రముఖుల విషయంలో ఫలానా పార్టీలోకి మారుతున్నారు. మరో పార్టీతో మంతనాలు జరుపుతున్నారు వంటి వార్తలు సర్క్యులేట్ అవుతుంటాయి. అంతవరకు ఓకే గానీ.. మరీ బతికున్న వ్యక్తులను చంపేస్తూ కొందరు సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను సృష్టిస్తుంటారు. తాజాగా ప్రముఖ నటి , మాజీ ఎంపీ రమ్య(దివ్య స్పందన) విషయంలోనూ అటువంటి ప్రచారమే జరిగింది. ఆమె గుండెపోటుతో మరణించారంటూ ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇలా పోస్ట్ అయ్యిందో లేదో అలా ఆ వార్త నిమిషాల్లో వైరల్ గా మారింది. కొన్ని వెబ్ సైట్లు, ఛానల్స్ సైతం ఆ వార్తను ప్రచారం చేశాయి. దీంతో పరామర్శలు స్టార్ట్ అయ్యాయి. రమ్య(దివ్య)కి, ఆమె సన్నిహితులకు పలువురు ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. అప్పటిదాకా ఈ ఫేక్ న్యూస్ గురించి తెలియక.. ఎక్కడో జెనీవాలో గాఢనిద్రలో ఉన్న రమ్య.. ఒక్కసారిగా ఈ న్యూస్ గురించి తెలిసి షాక్ అయ్యారట. నేను బ్రతికే ఉన్నాను, ఎవరో ఏదో ట్వీట్ చేస్తే దానిని గుడ్డిగా ప్రసారం చేస్తారా అని రమ్య తనను సంప్రదించిన మీడియా వర్గాలు, సన్నిహితుల వద్ద అసహనం వ్యక్తం చేశారట.
ఇటీవల కన్నడ నటుడు విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన గుండెపోటుతో మరణించారు. ఆ వార్తనే కాస్త ఆలస్యంగా 'స్పందన'కు బదులుగా పొరపాటున 'దివ్య స్పందన' అని రాసి పోస్ట్ చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఏది ఏమైనా బతికున్న వ్యక్తులను చనిపోయారంటూ ప్రచారం చేయడం ఏమాత్రం సమంజసం కాదు. అలాంటి వార్తల వల్ల కుటుంబసభ్యులు, స్నేహితులు, బంధువులు కంగారు పడతారు. సెన్సిటివ్ గా ఉండే వ్యక్తులకు, అనారోగ్య సమస్యలు ఉన్న వారికి.. అలాంటి వార్తల వల్ల ప్రమాదం జరిగే అవకాశముంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని నెటిజన్లు హితవు పలుకుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/fake-news-on-former-mp-actor-ramya-25-161258.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.