అమరావతిని ముంచే కుట్ర? జగన్ సర్కార్ పై రైతుల ఆగ్రహం 

Publish Date:Oct 16, 2020

Advertisement

వరదలతోనూ ఏపీలో రాజకీయం చేస్తున్నారా? సొంత ప్రయోజనాల కోసం ప్రజల ప్రాణాలను ఫణంగా పెడుతున్నారా? అమరావతిని ముంచేందుకు ప్లాన్ చేశారా? ఆంధ్రప్రదేశ్ లో కొన్ని వర్గాల నుంచి ఇప్పుడు ఇవే అనుమానాలు వస్తున్నాయి. అమరావతిని రాజధానిగా అంగీకరించని జగన్ సర్కార్.. ఆ ప్రాంతాన్ని ముంపుగా చూపించే ప్రయత్నం చేస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. రాజధాని గ్రామాల్లోకి వరద రావాలనే ఉద్దేశ్యంతోనే.. అక్కడి వాగుల పూడిక తీత చేపట్టలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. డ్యాముల నుంచి సకాలంలో నీటిని వదలకుండా, ఎత్తిపోతల మోటార్లు వేయకుండా కావాలనే కుట్రలు చేస్తున్నారని చెబుతున్నారు. వందేళ్లలో రాని ముంపు అమరావతికి వస్తే అందుకు  జగన్ ప్రభుత్వమే కారణమంటున్నారు రాజధాని రైతులు,

 

వైసీపీ నేతల తీరు కూడా రాజధాని రైతుల అనుమానాలకు బలమిచ్చేలా ఉన్నాయి. వరదలతో అమరావతి మునిగిపోయిందని, రోడ్ల మీద చేపలు పట్టుకోవచ్చు అన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. కరకట్ట మీద ఉన్న చంద్రబాబు ఇల్లు కూడా మునిగిపోతుందని హడావిడి చేశారు. ఏపీ హైకోర్టును వరద ముంచెత్తిందని కొందరు పోస్టులు పెట్టారు. అయితే సోషల్ మీడియా ప్రచారం జరిగినట్లు అమరావతి  ఎక్కడా నీట మునగలేదు. హైకోర్టు దరిదాపుల్లోకి కూడా వరద రాలేదు. కరకట్టపై ఉన్న చంద్రబాబు ఇల్లు కూడా భద్రంగానే ఉంది. పరువు పోగొట్టుకున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ఇతర ప్రాంతాలతో పోలిస్తే అమరావతికి పెద్దగా వరద ముంపు లేదు. అమరావతిలో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ వైసీపీ నేతలే ఫేక్ ఫోటోలు పెట్టి ప్రచారం చేశారు. వైసీపీ కార్యకర్తలు చేస్తున్న ప్రచారాన్ని పట్టుకుని కొందరు వైసీపీ ముఖ్య నేతలు కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి పరువు పొగొట్టుకున్నారు. 

 

తమ కుట్రలో భాగంగానే వైసీపీ నేతలు, కార్యకర్తలు ముందుకు పోతున్నారని రాజధాని ప్రాంత రైతులు, ప్రజలు ఆరోపిస్తున్నారు. అమరావతి ప్రాంతం వరదలో మునిగేలా జగన్ ప్రభుత్వ చర్యలు ఉండగా.. అసత్య  ప్రచారాలతో బద్నాం చేేసే పనిలో వైసీపీ కేడర్ ఉందని చెబుతున్నారు. అమరావతి ముంపునకు గురవుతుందని ప్రభుత్వం చేస్తోన్న విష ప్రచారాన్ని ఇకనైనా మానుకోవాలని రైతులు సూచిస్తున్నారు. దమ్ముంటే అమరావతి రాజధానిపై బహిరంగ చర్చకు వస్తారా? అని రైతులు ప్రశ్నిస్తున్నారు. మహా నగరాలు మునుగుతున్నా అమరావతి సేఫ్ గా ఉందని చెప్పారు. విపత్తులో ప్రజలను రక్షించాల్సిన ప్రభుత్వానికి ముంచడమే ఎజెండాగా మారిందని మండిపడుతున్నారు. 

 

జగన్ సర్కార్ తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయి. సకాలంలో నీటిని కిందకు విడుదల చేయకుండా అమరావతిని ముంచడమే ధ్యేయం అన్నట్లుగా వ్యవహరించారని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. జలాశయాల నీటి నిర్వహణలోనూ కక్ష సాధింపు యోచనలకు పూనుకోవడం అమానుషమన్నారు చంద్రబాబు.మొత్తానికి రాజకీయ ప్రయోజనాల కోసం అమరావతి నీటిలో మునిగేలా కుట్రలు చేస్తున్నారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి పనులకు పూనుకోవడం మంచిది కాదనే అభిప్రాయం అన్ని వర్గాల నుంచి వస్తోంది. ప్రకృతితో పరిహాసం చేస్తే.. జరగబోయే పరిణామాలు తీవ్రంగా ఉంటాయనే నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇకనైనా అలాంటి ప్రయత్నాలు మానుకోవాలని సూచిస్తున్నారు.

By
en-us Political News

  
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.