తెలంగాణలో 35 మంది జూనియర్ లెక్చరర్లు ఊస్ట్: మరో 320 మంది స్కృూటినీ.. ఎందుకో తెలుసా?

Publish Date:Oct 6, 2026

Advertisement

తెలంగాణలో నకిలీ విద్యార్హతల సర్టిఫికెట్ల వ్యవహారం మరో సారి కలకలం రేపింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న 35 మంది జూనియర్ లెక్చరర్లను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఇంటర్ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగాల క్రమబద్ధీకరణ సమయంలో సమర్పించిన పీజీ, బీటెక్ తదితర విద్యార్హతల ధ్రువపత్రాలు సంబంధిత విశ్వవిద్యాలయాలు జారీ చేసినవి కావనీ, అవి నకిలీ సర్టిఫికెట్లనీ నిర్ధారణ కావడంతో  వాటి ద్వారా ఉద్యోగాలు సంపాదించిన 35 మంది లెక్చర్లను ఊస్ట్ చేస్తూ తెలంగాణ ఇంటర్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 

తెలంగాణలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చాలాకాలంగా కాంట్రాక్టు పద్ధతిలో జూనియర్ లెక్చరర్ల నియామకాలు కొనసాగుతున్నాయి. 2023లో పెద్ద సంఖ్యలో కాంట్రాక్టు లెక్చరర్లను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. ఈ ప్రక్రియలో కొందరు లెక్చరర్లు సమర్పించిన విద్యార్హతల ధ్రువపత్రాలపై అనుమానాలు వ్యక్తమవడంతో వాటిని సంబంధిత యూనివర్సిటీలకు పంపించి అధికారులు క్రాస్ వెరిఫై చేశారు.  

రెగ్యులరైజేషన్ పొందిన సుమారు 360 మంది జూనియర్ లెక్చరర్ల సర్టిఫికెట్లను అధికారులు పునఃపరిశీలించారు. ఆయా యూనివర్సిటీల నుంచి క్లారిఫికేషన్ కోరారు. ఈ పరిశీలనలో 37 మంది సమర్పించిన సర్టిఫికెట్లపై యూనివర్సిటీలు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు అధికారులు గుర్తించారు. అనంతరం సంబంధిత లెక్చరర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

షోకాజ్ నోటీసులకు సంబంధిత లెక్చరర్లు వివరణలు ఇచ్చినప్పటికీ.. యూనివర్సిటీలు తమ రికార్డుల్లో ఆ ధ్రువపత్రాలను జారీ చేయలేదని స్పష్టం చేయడంతో   37 మందిలో 35 మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

తాజాగా ఉద్యోగాలు కోల్పోయిన వారిలో ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, సివిక్స్, కామర్స్, హిందీ వంటి వివిధ సబ్జెక్టులు బోధించే జూనియర్ లెక్చరర్లు ఉన్నట్లు సమాచారం. ఇలా ఉండగా ఇప్పుడు ఊస్ట్ అయిన 35 మందే కాక మరో 320 మంది జూనియర్ లెక్చర్లు ఇచ్చిన సర్టిఫికట్లపై కూడా అనుమానాలు ఉన్నాయి. వారు సమర్పించిన సర్టిఫికెట్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.  ఈ 320 మందిలో  కొందరు ఇతర రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాల నుంచి పొందినట్లు పేర్కొన్న సర్టిఫికెట్లను సమర్పించినట్లు సమాచారం. ఆయా వర్సిటీలకు ధ్రువపత్రాలను పంపించి వాటి ప్రామాణికతను అధికారులు నిర్ధారిస్తున్నారు. 

నకిలీ సర్టిఫికెట్లను గుర్తించి గతంలో కూడా కొందరు జూనియర్ లెక్చరర్లపై అధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. తాజా 35 మంది తొలగింపుతో ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. మరోవైపు, నకిలీ సర్టిఫికెట్లను గతంలోనే ఎందుకు గుర్తించలేకపోయారనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఇంటర్ విద్యా జేఏసీ ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. 


[Fake Certificates  35 Junior Lecturers Removed,  Telangana Education Department, Department of Intermediate Education, Junior Lecturers Telangana, Fake Certificates, Telangana Jobs, Lecturer Regularisation, Telugu One]

By
en-us Political News

  
పలు ప్రాంతాలలో ఇప్పటికే  రోజూవారీ సరఫరా  నిలిపివేశారు. రోజు విడిచి రోజు మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నారు. ముందు ముందు ఇది రెండు రోజులు, మూడు రోజులు. వారం రోజులకు కూడా పెరిగే అవకాశం ఉందని జలమండలి అధికారులే ఆఫ్ ది రికార్డ్ చెడుతున్నారు.
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న జాతీయ స్థాయి నిరసన ర్యాలీకి తెలంగాణ నుంచి పార్టీ శ్రేణులను తరలించేందుకు ప్రత్యేక రైళ్లు కేటాయించకపోవడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో ప్రయాణికురాలు తోసివేయడంతో గాయపడిన టీజీఎస్‌ఆర్టీసీ కండక్టర్ ప్రవళికకు ప్రభుత్వం అండగా ఉంటుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు.
సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) కోసం ప్రభుత్వానికి దరఖాస్తు సమర్పించారు. ఈ నిర్ణయం రాష్ట్ర పాలనా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  తదుపరి సీఎస్ రేసులో  ఉన్న జయేష్ రంజన్ వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకోవడం సంచలనంగా మారింది. 
మరీ ముఖ్యంగా హైదరాబాద్ పై చలిపులి పంచా విసిరింది.  ఉదయం పూట ఎండ తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటున్నా, రాత్రి వేళల్లో,  తెల్లవారుజామున చలి తీవ్రత భారీగా ఉంటోంది.  
కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మకల్ సల్ఫీ నగర్‌లో చోటుచేసుకున్న ఒక అంతులేని విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది
నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు మందగించడం, పెండింగ్ బిల్లులు విడుదల కాకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేసిన  జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తీవ్ర నిరవధిక దీక్ష హెచ్చరిక చేశారు.
అశ్వాపురం మండలం మిట్టగూడెం గ్రామం వద్ద  ఆ మహిళా ప్రయాణీకురాలు   కండక్టర్‌ను బలంగా తోసివేసింది. ఈ ఊహించని పరిణామానికి కండక్టర్ అదుపుతప్పి నడుస్తున్న బస్సులోంచి రోడ్డుపై పడిపోయారు. ఈ ఘటనలో బస్సు వెనుక చక్రాలు ఆమె  కాళ్లపై నుంచి దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డారు.  
హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో భారీ పేలుడు కలకలం రేపింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో వేగంగా మార్పులు వస్తున్నాయి.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళ నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే కరువు పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు వ్యూహాలకు పదును పెట్టింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.