మన డబ్బులు మనకే ఇస్తున్న మోదీ ప్యాకేజ్!
Publish Date:May 14, 2020
Advertisement
ఉద్యోగులకు సంబంధించి ప్రావిడెంట్ ఫండ్‌లో వున్న మొత్తం డబ్బు ఉద్యోగులదే. అయితే ఉద్యోగస్తులు పి.ఎఫ్. డబ్బుల్ని తీసుకునేందుకు తాజాగా కల్పించిన సదుపాయన్ని కూడా కేంద్రప్రభుత్వం 20 లక్షల కోట్ల ప్యాకేజ్‌లో కలిపేసింది. టిడిఎస్. ఇది ప్రభుత్వానికి టాక్స్ పేయర్ నుంచి ముందుగా వసూలు అయ్యే డబ్బు. టాక్స్ ఎక్కువ కానీ, తక్కువ కానీ ఉన్నచో రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు సర్దుబాటు చేయవలసిన మొత్తం. దీనికి 25 శాతం డిడక్షన్ వుంటుంది. ఇంత కాలం ఇంతకాలం ప్రభుత్వం దగ్గరి నుంచి టాక్స్ పేయర్‌కి వాపస్ రావలసిన సొమ్ము చాలా వుంది. న్యాయంగా రావలసిన మొత్తం ఇవ్వక పోగా ఇచ్చిన మొత్తం కూడ సహాయం కింద చూపిస్తోంది కేంద్రప్రభుత్వం. జిఎస్‌టి పేమెంట్ వాయిదా. ఉత్పత్తి సంస్థ లు వారి ఉత్పత్తి నీ అమ్మునప్పుడు బిల్ చేస్తుంది. కానీ నిజానికి ఆ సొమ్ము రెండు లేదా మూడు నెలల తరువాత వసూలు అవుతుంది. కానీ అయా సంస్థలు బిల్ చేసిన మరుసటి నెలలోనే ఆ టాక్స్ మొత్తానికి ప్రభుత్వానికి చెల్లించాల్సి వుంటుంది. అసలు సంస్థ లు అన్ని మూత పడినప్పుడు, రావాల్సిన అసలు వస్తుందో లేదో నని వేచి చూసే వారికి ఆ టాక్స్ మొత్తమ్ ఎదో ప్రభుత్వమే సహాయం చేసినట్టు దానిని ఈ 20 లక్షల కోట్ల ప్యాకేజ్‌లో చూపించడం కరెక్ట్ కాదు. దారుణమని చెప్పాలి. టాక్స్ మొత్తాన్ని జూన్ 30 లోపల ఇంట్రెస్ట్ తో చెల్లించమని ప్రభుత్వం చెపుతున్నది పిపిఇ కిట్స్. వీటి ఉత్పత్తి వలన రోగులకు ఇక్కట్లు తగ్గాయి. కానీ local vocal అని, లేదా made in India అని చెప్పుకోవడం నామోషీ. ఎందుకంటే అంతకు ముందు వస్త్ర పరిశ్రామ కుదేలు అయిపోయింది. అక్కడి శ్రామికులకు కొంత దీనివలన ఉపాధి దొరికింది. టీడీఎస్‌ను 25 శాతం తగ్గించడం వల్ల జనాల చేతుల్లో రూ.50,000 కోట్ల వరకు ఉంటాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ మొత్తం లేదంటే పన్నుగా ప్రభుత్వం ఖాతాలోకి వెళ్లేది. నాన్ శాలరైడ్ ఆదాయంపై మూల ధనంపై పన్ను (TDS)ను 25 శాతం తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. ఈ ప్రకటన వల్ల పన్ను చెల్లింపుదారుల వద్ద ఎక్కువ నిధులు ఉండే అవకాశం ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో 3 నెలల పాటు కంపెనీలకు చెందిన ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ తామే చెల్లిస్తామని మార్చి నెలలో కేంద్ర ఆర్థికమంత్రి ప్రకటించారు. లాక్ డౌన్ కొనసాగుతుండటం, ఆర్థిక వ్యవస్థ అప్పుడే కోలుకునే పరిస్థితులు లేకపోవడంతో దీనిని మరో 3 నెలలు పొడిగిస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగులకు ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్‌ను మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. మోడీ ప్రభుత్వం మరో మూడు నెలల పాటు 72 లక్షల మంది ఉద్యోగుల ఈపీఎఫ్‌ను చెల్లిస్తుంది. రూ.15వేల లోపు వేతనం కలిగిన వారికి ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ చేస్తున్నట్లు గతంలోనే చెప్పారు. ఇప్పుడు కూడా ఇదే వర్తిస్తుంది. అంటే ఇప్పటికే మార్చి, ఏప్రిల్, మే నెలల ఈపీఎఫ్‌ను చెల్లించింది. ఇప్పుడు మరో 3 నెలల పొడిగింపు వల్ల జూన్, జూలై, ఆగస్ట్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ప్రయివేటు సెక్టార్ కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు ఈ మూడు నెలల పాటు ఈపీఎఫ్ మొత్తాన్ని 12 శాతం బదులు 10 శాతం చెల్లించే వెసులుబాటును కల్పించింది. యజమానులు ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ కేంద్ర ప్రభుత్వమే చేయడం వల్ల కంపెనీలు తమ వంతు ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు ప్రయివేటు కంపెనీ యజమానుల చేతిలో లిక్విడిటీ ఉండే అవకాశం ఉంటుంది.
http://www.teluguone.com/news/content/facts-about-corona-package-25-99140.html





