సంక్షేమం పేర దోపిడీ.. బ్రదర్ అనిల్ వ్యాఖ్యల సారాంశమిదేనా?

Publish Date:Dec 16, 2022

Advertisement

ఏపీ ప్రజలు ఈ రాష్ట్రంలో ఎందుకు పుట్టామా అని బాధపడుతున్నారా?.. జగన్ పాలనలో నానా కష్టాలూపడుతున్నారా? సంక్షేమం పేరుతో రూపాయి ఇచ్చి వంద రూపాయలు లాగేసుకుంటున్న తీరుతో జనం విసిగిపోయారా? అంటే ఔననే అంటున్నారు ముఖ్యమంత్రి జగన్ కు స్వయానా బావ  అయిన బ్రదర్ అనీల్ కుమార్. బ్రదర్ అనీల్ కుమార్ జగన్ సోదరి షర్మిల భర్త. క్రిస్మస్ ముందస్తు వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన ఏపీకి వచ్చారు.

ఈ సందర్బంగా విశాఖపట్నంలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్కడా జగన్పేరు ఎత్తకుండానే బ్రదర్ అనీల్ కుమార్ ఏపీ సీఎం, తనకు స్వయానా బావ మరిది అయిన జగన్ పై విమర్శలు గుప్పించారు. విపక్షం తెలుగుదేశం ఇంత కాలంగా ఏ విషయంలో అయితే జగన్ పై విమర్శలు గుప్పిస్తోందో అరిగ్గా అవే లైన్స్ లో బ్రదర్ అనీల్ కుమార్ మాట్లాడటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. క్రిస్మస్ ముందస్తు వేడుకకు సంబంధించిన ఆ కార్యక్రమంలో బ్రదర్ అనీల్ చేసిన ప్రసంగం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకోవడం విశేషం.

అయితే బ్రదర్ అనీల్ ప్రసంగం వెనుక ఇటీవల తన భార్య షర్మిలను తెలంగాణ ప్రభుత్వం అరెస్టు చేయడం, వాహనంలో ఉండగానే టోవింగ్ చేసి పీఎస్ కు తరలించడం పై ఏపీ సీఎం, షర్మిల సోదరుడు జగన్ స్పందించకపోవడమే కారణమై ఉంటుందా అన్న చర్చ రాజకీయ వర్గాలలో జోరందుకుంది. 
షర్మిల ఏపీని పట్టించుకోకుండా తెలంగాణలో తన సొంత పార్టీ వ్యవహారాలలో తలమునకలై ఉన్న సంగతి విదితమే. అయితే గత చాలా కాలంగా జగన్, షర్మిల మధ్య పొసగడం లేదన్న వార్తలు వినవస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే షర్మిల వైఎస్ వివేకా హత్య కేసులో హస్తిన వెళ్లి వాంగ్మూలం ఇచ్చి రావడం. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందంటూ.. సీబీఐకి ఫిర్యాదు చేయడం.. ఆ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో జగన్ కు ఇరుకున పెట్టే విధంగా చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ గమనిస్తే అన్నా చెళ్లెళ్ల మధ్య సంబంధాలు బాగా చెడ్డాయనీ అర్ధమౌతుంది. ఆ నేపథ్యంలోనే తెలంగాణలో షర్మిల అరెస్టుపై జగన్ స్పందించలేదని అంటున్నారు. అయితే బ్రదర్ అనీల్ కుమార్ విశాఖలో జగన్ సర్కార్ పై పరోక్షంగా చేసిన విమర్శలు గమనిస్తే.. నిప్పుకు కప్పిన నివురు కరిగిపోతున్నదా అనిపించక మానదు.

తన ప్రసంగంలో ఆయన స్వార్థం కోసం ప్రభుత్వాలు ఇచ్చే పథకాలపై ఆధారపడవద్దని ఆయన ఏపీ జనాలకు హితవు చెప్పారు. అంతే కాదు.. ఏపీలో పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎందుకు పుట్టామా అని ప్రజలు బాధపడేలా ఉందన్నారు. ఏపీలో పాలన దారుణంగా ఉందనీ, జనం జీవనం దుర్భరంగా మారిపోయిందనీ అనిల్ అన్నారు. స్వయానా తనకు బావ అయిన బ్రదర్ అనీల్ కుమార్ ఏపీ గడ్డపై చేసిన  ఈ వ్యాఖ్యలు జగన్ కు ఇబ్బందికరం అన్న విషయంలో సందేహం అవసరం లేదు. షర్మిల, జగన్ ల మధ్య ఉన్న విభేదాలు, వివాదాల కారణంగానే బ్రదర్ అనిల్ ఈ వ్యాఖ్యలు చేశారనిపరిశీలకులు అంటున్నారు.

అయితే జగన్ టార్గెట్ గా బ్రదర్ అనీల్ కుమార్ వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటి సారి కాదు. గతంలో కూడా ఆయన సొంతంగా ఏపీలో పార్టీ పెట్టేందుకు కొన్ని ప్రయత్నాలు సాగించారు. ఆ సందర్బంగా పలు ప్రసంగాలలో రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి రావాలని చెప్పారు. అయితే ఏపీలో బ్రదర్ అనిల్ పార్టీ విషయం ఆ తరువాత ఎప్పుడూ తెరమీదకు రాలేదు అది వేరే విషయం. మొత్తంగా ఏపీ సర్కార్ పై బ్రదర్ అనీల్ వ్యాఖ్యలు రాజకీయ హీట్ ను పెంచేయడం మాత్రం ఖాయం. సొంత బావమరిది పాలనపై బ్రదర్ అనిల్ చేసిన వ్యాఖ్యలు విపక్షాలకు ఆయుధాలుగా మారతాయి. క్రిస్మస్ ముందస్తు సన్నాహాల కోసం బ్రదర్ అనిల్ రాష్ట్రంలో ఎక్కడక్కడ అయితే పర్యటిస్తారో అక్కడల్లా వైసీపీకి గడ్డు పరిస్థితులు ఏర్పడటం ఖాయమన్న అభిప్రాయం రాజకీయ వర్గాలలో వ్యక్తం అవుతోంది. మొత్తం మీద ఏపీలో పాలన, పరిస్థితులు, సంక్షేమ పథకాలు వంటి అంశాలపై బ్రదర్ అనిల్ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. 

By
en-us Political News

  
తెలంగాణ ప్రయోజనాలే తమకు పరమావధన్న ఆయన పార్లమెంటులో ఈ ప్రతిపాదనపై చర్చ,  ఓటింగ్ జరిగినప్పుడు తమ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తారని వెల్లడించారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు ఆమోదం పొందితే దేశ రాజకీయాలలో కాంగ్రెస్ ప్రతిష్ఠ బాగా మసకబారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. ఇది 2029 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై నిస్సందేహంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
తొలి విడత పంచాయతీ ఎన్నికలలో  వైసీపీ మద్దతుదారులు కనీసం పాతిక శాతం  స్థానాలను కూడా గెలుచుకోలేకపోయారు. అదే సమయంలో తెలుగదేశం కూటమి మద్దతు ఉన్నఅభ్యర్థులు తిరుగులేని విజయాలతో ప్రభంజనం సృష్టించారు. 
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బిల్లు ఉద్దేశాలను, ప్రక్రియను  తప్పుబడుతుండగా, ఇండియా కూటమిలోని పలు ప్రాంతీయ పార్టీలో,  సీట్ల వాటా రక్షణ, సవరణల ఆధారంగా తమ వైఖరిని మార్చుకుంటున్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
డీలిమిటేషన్ తో పాటు, మహిళా రిజర్వేషన్ల అమలును తీసుకురావడమే ఈ సమావేశాల నిర్వహన ప్రధాన లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ చెబుతున్నప్పటికీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ హడావుడి సమావేశాల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం బీజేపీకి రాజకీయ లబ్ధి చూకూర్చడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఏ   రాష్ట్రంలోనూ  సీట్ల వాటా తగ్గదు, ప్రస్తుత నిష్పత్తిని కాపాడుతూనే అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా స్థానాలు పెరుగుతాయి.  అంతేకాకుండా, 2051 సీట్ల విషయంలో మార్పులు లేకుండా స్తంభనను అమలు చేయడం ద్వారా భవిష్యత్ జనాభా గణాంకాల ఆధారంగా రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తి మారకుండా నియంత్రించామని కేంద్రం చెబుతోంది. 
లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్యను 50 శాతం పెంచడం వల్ల ఏ రాష్ట్రానికీ నష్టం జరగదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
మాదకద్రవ్యాల మహమ్మారి నుంచి యువతను కాపాడేందుకు చేపట్టిన నషా ముక్త్ భారత్ యాత్రకు ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
తమిళనాడులో సంచలనం సృష్టించిన మహిళా ఐఏఎస్ అధికారిణి వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
మదురై సమీపంలోని తిరుపరంకుండ్రం కొండపై ఉన్న దీపస్తంభం వద్ద శనివారం దీపం వెలిగించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
పార్లమెంట్ సమావేశాలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.