మోదీ, అమిత్ షా వ్యూహాలు.. ప్రాంతీయ పార్టీల ఉనికి ప్రశ్నార్థకమేనా?

Publish Date:Jun 22, 2026

Advertisement

తెలుగువన్ ఎక్స్ క్లూజివ్

దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల మనుగడ, జాతీయ స్థాయిలో మోదీ-అమిత్ షా ద్వయం అనుసరిస్తున్న వ్యూహాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇటీవల జరిగిన పలు పరిణామాల నేపథ్యంలో, బలమైన ప్రాంతీయ శక్తులు సైతం కేంద్ర పెద్దల చాణక్యానికి తలవంచక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమ బెంగాల్ నుంచి తెలంగాణ వరకు ప్రాంతీయ అధినేతల అహంకారం, వ్యూహాత్మక తప్పిదాలు వారి పతనానికి ఏ విధంగా దారితీస్తున్నాయో  తెలుగువన్ వాస్తవ వేదికలో జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ విశ్లేషించారు. 

రాజకీయాల్లో ఎప్పుడైనా పోరాటం ఉండాలని, ఎక్కడైతే రాజీ పడతారో అక్కడే పతనం ప్రారంభమవుతుందని  జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ అన్నారు.  తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ తో కలిసి తెలుగువన్ వాస్తవవేదికలో మాట్లాడిన ఆయన  మోదీ, అమిత్ షా రాజకీయ చాణక్యాన్ని తట్టుకోవడంలో ప్రాంతీయ పార్టీలు పూర్తిగా విఫలమవుతున్నాయని, వ్యూహాత్మక ఒంటరితనం లేదా అంతర్గత బలహీనతలు ఆయా పార్టీలను దెబ్బతీస్తున్నాయని విశ్లేషించారు.

పశ్చిమ బెంగాల్ ఉదాహరణను తీసుకుంటే..  మమతా బెనర్జీ బలమైన నాయకురాలైనప్పటికీ, ఇండియా బ్లాక్‌లో ఉంటూనే కాంగ్రెస్, సీపీఎంతో సరైన రీతిలో కలవలేకపోవడం ఓట్ల చీలికకు దారితీసిందని డోలేంద్ర ప్రసాద్ అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షాల మధ్య ఐక్యత లేకపోవడాన్ని బీజేపీ తమకు అనుకూలంగా మార్చుకోవడంలో సఫలీకృతమైందన్నారు. మమతా బెనర్జీ, చంద్రబాబు, జగన్ ,  కేసీఆర్.. ఎవరైనా సరే ప్రాంతీయ పార్టీల అధిపతుల్లో ఉండే అహంకారమే ఒక్కోసారి వారి సొంత రాజకీయ ప్రయోజనాలను దెబ్బతీస్తుందన్నారు.

మరోవైపు తెలంగాణ రాజకీయాలపై స్పందిస్తూ..  బీఆర్ఎస్ తీవ్రమైన నైతిక పతనాన్ని ఎదుర్కొంటోందని విమర్శించారు. గతంలో వచ్చిన టెలిఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు, నాయకుల ప్రవర్తన ఆ పార్టీ ప్రతిష్టను దిగజార్చాయని డోలేంద్ర ప్రసాద్ చెప్పారు. అదే సమయంలో బీజేపీ సైతం స్థానికంగా అంతర్గత వివాదాలు, నైతిక సమస్యల వల్ల ప్రజల్లో పట్టు కోల్పోయే ప్రమాదంలో పడిందని, దీనివల్ల రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా లాభం చేకూరే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు.

ఇక జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన వివిధ ఉద్యమాలు, కొత్త శక్తుల ఆవిర్భావంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రదర్శించిన లౌక్యం అద్భుతమని కొనియాడారు. విపక్షాలు లేదా నిరసనకారులు కేంద్ర ప్రభుత్వంపై ఉద్రిక్తతలు సృష్టించి మైలేజ్ పొందాలని చూసిన ప్రతిసారీ, అమిత్ షా   వ్యూహాత్మకంగా వ్యవహరించి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా అడ్డుకున్నారని గుర్తుచేశారు. అరెస్టులు చేసి అనవసరంగా హీరోలను చేయడం కంటే, చట్టపరమైన వెసులుబాటు కల్పించి వారి వ్యూహాలనే నీరుగార్చడంలో కేంద్రం సఫలమైందని స్పష్టం చేశారు.

రాబోయే రెండేళ్ల కాలం భారత రాజకీయాల్లో అత్యంత కీలకమని, ప్రాంతీయ పార్టీలు తమ ఉనికిని చాటుకోవాలంటే అహంకారాన్ని వీడి ప్రజాక్షేత్రంలో గట్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కేంద్రంలో మోదీ, అమిత్ షా ద్వయం వేస్తున్న ఎత్తులను చిత్తు చేయకపోతే ప్రాంతీయ శక్తుల మనుగడ మరింత క్లిష్టంగా మారే ప్రమాదం ఉందని డోలేంద్ర ప్రసాద్ అన్నారు. 

By
en-us Political News

  
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు  ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.  కవితను పోలీసులు  పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్‌ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌, అజారుద్దీన్‌.. బీఆర్‌ఎస్‌ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు సవాల్‌ విసిరారు.
జగన్ ప్రసంగాలు, మీడియా సమావేశాలు... ట్రోలింగ్‌కు, మీమ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. నెటిజనులు, తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు జగన్ ప్రెస్ మీట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారంటే ఇసుమంతైనా అతిశయోక్తి కాని పరిస్థితి ఉంది.
గతంలో ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే కేవలం రాజకీయ పలుకుబడి, కమిషన్లు మాత్రమే ప్రాధాన్యత సంతరించుకునేవనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ విధానాన్ని మార్చి విజయ్ ఇప్పుడు ప్రతిభ, పారదర్శకత ఆధారంగానే టెండర్లు లభించే కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.
ఇటువంటి ఉత్కంఠభరిత రాజకీయ వాతావరణంలో.. ఇద్దరు బద్ద రాజకీయ ప్రత్యర్థులు అకస్మాత్తుగా ఒ ముఖాముఖి ఎదురైతే.. అసలా ఊహే ఎవరికీ రాదు అన్నట్లుగా ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితి ఉంది. కానీ అనూహ్యంగా రఘురామకృష్ఫం రాజు, అంబటి రాంబాబు ఓ వివాహ వేడుకలో ఎదురు పడ్డారు.
రాజధాని వంటి అత్యంత కీలకమైన, సున్నితమైన విషయంలో జగన్ పదే పదే తన స్టాండ్ మార్చుకోవడం పరిశీలకులను సైతం విస్మయానికి గురి చేస్తున్నది. స్థిరత్వం లేని జగన్ తీరు వెనుక ఎవరి సలహాలు ఉన్నాయన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
పాత చరితను పునరావృతం చేస్తున్న డిప్యూటీ స్పీకర్!
తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలో టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిగిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.