బీహార్ అసెంబ్లీ ఎన్నికలు... ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయంటే?

Publish Date:Nov 11, 2025

Advertisement

బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తయ్యింది. మంగళవారం (నవంబర్ 11) రెండో విడత పోలింగ్ ముగిసింది. దీంతో ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. వివిధ సంస్థలు వెలువరించిన ఎగ్జిట్ పోల్స్ లో బీహార్ లో తదుపరి ప్రభుత్వం ఏర్పాటు చేయబోయేది ఎన్డీయే కూటమే అని పేర్కొన్నాయి. అయితే ఒక సంస్థ మాత్రం రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టనున్నది మహాగట్ బంధనే అని పేర్కొంది. మాసివ్ మెజారిటీతో కాకపోయినా అధికారం చేపట్డేందుకు అవసరమైన మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ నేతృత్వంలోని మహాగట్ బంధన్ గెలుచుకుంటుందని అంచనా వేసింది.. 
ఇక పోలింగ్ శాతం చూస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా బీహార్ ఓటర్లు ఈ సారి తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పెద్ద సంఖ్యలో వెల్లువెత్తారు. రెండో దశలో సాయంత్రం ఐదు గంటల వరకూ 67.14శాతం ఓటింగ్ నమోదైంది. తొలి విడతలో 64.46 శాతం ఓటింగ్ నమోదైంది. రెండు విడతలూ కలిపి బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం   66.11శాతం పోలింగ్ నమోదైంది. బీహార్ రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదైన అత్యధిక పోలింగ్ ఇదే కావడం గమనార్హం. రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారనడానికి సంకేతంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో అధికారం ఏర్పాటు చేయడానికి ఏ కూటమికైనా కావలసిన మ్యాజిక్ ఫిగర్ 122.

ఇలా ఉండగా యాక్సిస్ మై ఇండియా, సీవోటర్, ఐపిఎస్ఓఎస్, జన్ కిబాత్, టుడేస్ చాణక్య సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ను వివిధ  చానళ్లు, వెబ్ సైట్లు, సోషల్ మీడియా ద్వారా వెలువరించాయి.  పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీహార్ లో మరో సారి ఎన్డీయే అధికారం చేపడుతుంది. రాష్ట్రంలోని 243 స్థానాలకు గానూ ఎన్డీయే కూటమి 133 నుంచి 159 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉంది.   మహాఘట్ బంధన్ కూటమి 75 నుంచి 101 స్థానాలకు పరిమితమౌతుంది.  ఇతరులకు 2 నుంచి 13 స్థానాలు దక్కు అవకాశం ఉంది. 

ఇక చాణక్య సర్వే మేరకు ఎన్డీయే కూటమి 140 నుంచి 147 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉండగా, కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి 86 నుంచి 92 స్థానాలలో గెలుపొందే అవకాశం ఉంది. ఇతరులు 2 నుంచి 4 స్థానాలలో విజయం సాధిస్తారు. ఇక బీకాన్ సర్వే ప్రకారం ఎన్డీయే కూటమి 139 నుంచి 144 స్థానాలలోనూ, మహాఘట్ బంధన్ 95 నుంచి 101 స్థానాలలోనూ విజయం సాధించే అవకాశం ఉంది. ఇతరులకు 7 నుంచి 10 స్థానాలు లభించే అవకాశం ఉంది. 

అయితే సత్తాబజార్ వెలువరించిన సర్వే ప్రకారం కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘట్ బంధన్ 125 నుంచి 130 స్థానాలలో విజయం సాధించి అధికారం చేపడుతుంది. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి 93 నుంచి 99 స్థానాలకే పరిమితమౌతుంది. ఇతరులు ఒక్క స్థానంలో కూడా గెలిచే అవకాశం లేదు. మొత్తం మీద ఎగ్జిట్ పోల్స్ వెలువరించిన సంస్థలలో అత్యధిక సంస్థలు ఎన్డీయే కూటమే రాష్ట్రంలో మరోసారి అధికార పగ్గాలు చేపడుతుందని అంచనా వేయగా, ఒక్క సంస్థ మాత్రం కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘట్ బంధన్ బీహార్ లో అధికారంలోకి వస్తుందని పేర్కొంది. 

By
en-us Political News

  
ఈ నెల 11న మొదటి విడత పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో తొలి విడతలో జరిగే పంచయతీల ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రంతో ముగియనుంది.
బొత్స పక్కా రాజకీయ వారసత్వం మీద దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా, వైసీపీ శాసన మండలి పక్షనేతగా వ్యవహరిస్తున్న బొత్స మారుతున్న రాజకీయ, పరిణామాల దృష్ట్యా ప్రత్యామ్నాయాలవైపు దృష్టి సారిస్తున్నార‌న్న ప్రచారం సాగుతోంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.
వేశంతో కంటే ఎంతో ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రెండేళ్లయిన ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణ‌లో తీన్మార్ మ‌ల్ల‌న్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్‌ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భార‌త్ పర్యటనకు వ‌చ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంట‌ర్వ్యూలో కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విషయాలు తెలిపారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.