పదవీ..పరువూ పోయి దిగాలు! తెలుగుదేశంవైపు అవంతి చూపు

Publish Date:May 8, 2022

Advertisement

‘అయ్యయో మంత్రి పదవీ పోయెనే.. ఉన్నది కాస్తా ఊడింది.. పరువంతా గంగలొ కలిసిందీ.. టికెట్ వస్తుందో రాదో తెలియదే’ అని పాడుకోవాల్సిన స్థితి ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ తాజా మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అలియాస్ అవంతి శ్రీనివాసరావు పరిస్థితి. గురువుకు నామం పెట్టాడు.. వైసీపీ జెండా పట్టాడు.. అమాత్యుడయ్యాడు.. అయినా తన నియోజకవర్గానికి చేసిందేమీ లేక చేతులెత్తేశాడనే విమర్శలు ఆయనపై వస్తున్నాయి. భీమిలి నియోజకవర్గంలో అవంతిని గెలిపించిన జనమే ఇప్పుడు ఆయన అంటే కారాలు మిరియాలు నూరుతున్నారంటున్నారు. అవంతి శ్రీనివాసరావుపై విశాఖ జిల్లాలో ప్రత్యేకించి భీమిలిలో చెప్పలేనంత వ్యతిరేకత వస్తోందట. దాంతో ఏపీ సీఎంగా అవంతి మంత్రి పదవిని ఊడబెరికేశారు. వైసీపీ అధినేతగా వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ కూడా ఇచ్చే పరిస్థితి ఉండబోదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తనకు ఇక వైసీపీలో నూకలు చెల్లిపోయినట్లు సమాచారం వస్తున్న నేపథ్యంలో తన రాజకీయ గురువు గంటా శ్రీనివాసరావు ద్వారా మళ్లీ టీడీపీలో చేరేందుకు యత్నాలు చేస్తున్నారనే ఊహాగానాలు వస్తున్నాయి.

మూడేళ్లు ఏపీ కేబినెట్లో ఉన్నప్పటికీ విశాఖ జిల్లాకు గానీ, సొంత నియోజకవర్గం భీమిలికి గానీ అవంతి చేసిందేమీ లేదనే ఆరోపణలు ఉన్నాయి. మంత్రి పదవిలో ఉన్నప్పుడు అవంతి రూటే సెపరేటు అన్నట్లు వ్యవహరించేవారంటారు. మహిళలను ఉద్దేశించి మాట్లాడినా.. విపక్ష నేతలపై విరుచుకుపడినా అవంతి స్థాయి, స్థానం వేరు అంటారు. గురువు గంటా శ్రీనివాసరావుకు నామం పెట్టి వైసీపీలో చేరారు. అమాత్య పదవిని అనుభవించారు.

విశాఖ జిల్లాలో అప్పుడు ఏకైక మంత్రిగా తన హవా కొనసాగించాలని అవంతి ప్రయత్నించారు. మంత్రిగా శాఖాపరమైన వ్యవహారాల కన్నా రాజకీయంగా దూకుడుగా ఉండేందుకే అవంతి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. టీడీపీ నేతలపై విరుచుకుపడడం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను విమర్శించడం, టీడీపీ అధినేత చంద్రబాబుకు కౌంటర్లు వేశారు. అక్కడితో ఆగకుండా మిత్రుడు, రాజకీయంగా ప్రత్యర్థి అయిన గంటా శ్రీనివాసరావుపై వ్యక్తిగత విమర్శలకు అవంతి దిగడం జిల్లా ప్రజలకు అంతగా రుచించలేదంటారు. మామూలుగానే గంటా శ్రీనివాసరావుకు జిల్లాలో మంచి పట్టు ఉందంటారు. అలాంటి గంటాపై అవంతి విమర్శలు చేయడం జిల్లా ప్రజలకు నచ్చలేదంటారు. అవంతికి విశాఖ జిల్లాలో విజయసాయిరెడ్డి ఎలాంటి ప్రాధాన్యత లేకుండా చేశారు. దాంతో కేవలం భీమిలికే ఆయన పరిమితం కావాల్సి వచ్చింది.

మంత్రిగా ఉన్నప్పుడు అవంతిపైన భూ ఆక్రమణల విమర్శలు వెల్లువెత్తాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అవంతిపై ఇవే ఆరోపణలు చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. దాంతో పవన్ కళ్యాణ్ ను అవంతి ఛాలెంజ్ చేయడమే కాకుండా సమాధానం చెప్పుకునేదాకా వెళ్లింది. పవన్ ప్యాకేజీ స్టార్ అనే దాకా బరితెగించడంతో జనసైనికుల నుంచి, పవన్ అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారాయన. అవంతి ఇలాఖా భీమిలి పరిధిలోనే భూ వివాదాలు ఎక్కువగా రావడం కూడా ఆయన ప్రతిష్ట మసకబారేలా చేశాయంటారు. ఇలా ఎన్నెన్నో ఆరోపణల నేపథ్యంలో అవంతికి ఈ సారి జగన్ టికెట్ ఇచ్చే పరిస్థితి లేదనే చర్చ వైసీపీ రాజకీయ వర్గాల్లోనే జరుగుతుండడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో పవన్ పార్టీలోకి వెళ్దామంటే అవంతికి దారి కనిపించడం లేదట. వైసీపీ తిరస్కరిస్తే.. టీడీపీలోకి అయినా వెళ్లాలని అవంతి ఇప్పుడు స్వాభిమానం పక్కన పెట్టి గంటా శ్రీనివాసరావు ద్వారా రాయబారం నడపాలని యోచిస్తున్నారట.

విశాఖ ఉక్కు ఉద్యమంలో అవంతి సరిగా స్పందించలేదనే విమర్శలు ఉన్నాయి. భూ ఆక్రమణల ఆరోపణలు అవంతిని అల్లరిపెడుతున్నాయి. ‘పిచ్చివేషాలు వేయకుండా ఇంటికి రా, నా మాట విను, అన్ని రకాలుగా బాగానే ఉంటది. అరగంటలో పంపించేస్తా.. చెప్పిన మాట విను. నా కోసం అరగంట సమయం కూడా కేటాయించలేవా? ఏం చేస్తున్నావ్? రాకపోతే నీ ఇష్టం.. వస్తే మంచి భవిష్యత్తు బాగుంటుంది’ అని ఓ మహిళతో మంత్రి అవంతి మాట్లాడినట్లు ఉన్న ఆడియో టేపు ఆయనకు ఏమైనా పరువు మిగిలి ఉందంటే దాన్ని భీమునిపట్నం బీచ్ లో కలిపేసిందంటారు. విశాఖ రైల్వే జోను విషయంలో అవంతి ఎంపీగా ఉన్నప్పుడు ‘జోనూ లేదు.. తొక్కా లేదు’ అని చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడాయన రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయొచ్చంటున్నారు. 

చిరంజీవి పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి, ఎమ్మెల్యే అయిన అవంతి చిరంజీవితో పాటే కాంగ్రెస్ లో కొనసాగి, ఆనక టీడీపీలో చేరి ఎంపీ అయి, ఆ తర్వాత వైసీపీ తీర్థం పుచ్చుకుని మంత్రి పదవి అందుకుని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను విమర్శించే స్థాయికి వెళ్లారు. అందుకే కాబోలు జనసేన నేత, పవన్ కళ్యాణ్ అన్న నాగబాబు ‘పశువులు కూడా ఏ గడ్డి పడితే ఆ గడ్డి తినవు’ అని చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయంటారు. మొత్తానికి అవంతి వేస్తున్న కుప్పిగంతులు ఆయన రాజకీయ ప్రస్థానాన్ని ఎటు తీసుకెళతాయో అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

By
en-us Political News

  
ఈసీ తీరుపై నమ్మకం లేదని చెబుతున్న పార్టీ, ఇప్పుడు సీఈసీపై అభిసంశన తీర్మానానికి మద్దతుగా నిలబడకుంటే.. ఆ పార్టీ నైతికతే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఒక వేళ వైసీపీ ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తే ఇక ముందు, ఎన్నికల అక్రమాలపై మాట్లాడేందుకు వైసీపీకి అర్హతే ఉండదు. ఇంత వరకూ తెలుగుదేశం కూటమి విజయంపై వారు చేసిన విమర్శలన్నీ దూదిపింజెల్లా ఎగిరిపోతాయి.
బీఆర్ఎస్ హయాంలో ఇదే ఫామ్‌హౌస్ వేదికగా జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు ఉదంతం అప్పట్లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పట్లో రోహిత్ రెడ్డి ఫిర్యాదుతోనే పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించి, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో ఈ కేసు జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది.
దేవ్ జీ అరెస్ట్ ఎలా జరిగింది? అరెస్టు తరువాత ఆయన లొంగుబాటు ప్రకటన చేసి జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్లు ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? లొంగిపోలేదు అంటూనే.. ప్రస్తుత పరిస్థితుల్లో అజ్ణాతంగా ఉండి ఉద్యమాన్ని కొనసాగించడం కష్టసాధ్యమని ఎందుకు చెబుతున్నారు?
త్రిష త్వరలోనే సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి రావడం కన్ఫర్మ్ అన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే ఇందుకు సంబంధించి త్రిష నుంచి ఎటువంటి క్లారిటీ అయితే ఇప్పటి వరకూ రాలేదు. ప్రస్తుతం త్రిష పలు సినిమాలలో నటిస్తున్నారు. వాటిలో మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా కూడా ఉంది.
మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా పవన్ కల్యాణ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనీ, షూటింగ్ లంటూ అధిక సమయం హైదరాబాద్ లోనే ఉంటున్నారని రోజా అన్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి సినిమాలలో యాక్టింగ్ కి పరిమితమైనట్లుగా పవన్ కల్యాణ్ తీరు ఉందని రోజా అన్నారు. కీలకమైన మంత్రివర్గ సమావేశానికి డుమ్మా కొట్టడం సరికాదన్న రోజా దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధానసౌధలో కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే.. పాతిక మంది ఎమ్మెల్యేలు ఓ ప్రైవేట్ హోటల్‌లో ఈ భేటీ జరగడం సంచలనం సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదిక 16వ సంచికలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
రాష్ట్రంలో బీఆర్ఎస్‌ రెండుసార్లు, కాంగ్రెస్‌ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న షర్మిల, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారన్నారు. జగన్ హయాంలో కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు.
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.