కవిత కోసమేనా.. అమిత్ షా వద్దకు మాజీ గవర్నర్ నరసింహన్ ను పంపి కేసీఆర్ భంగపాటు?

Publish Date:Oct 28, 2022

Advertisement

నలుగురు తెలంగాణ ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ కు, ఇటీవలి కేసీఆర్ పది రోజుల హస్తిన పర్యటనకు లింకు ఉందా? ఈ రెండింటి వెనుకా ఉన్నది ఢిల్లీ లిక్కర్ స్కామేనా? ఆ స్కామ్ నుంచి తన బిడ్డ కవితను బయటపడేయాలన్న కేసీఆర్ ప్రయత్నాలు విఫలం కావడమే కొనుగోలు డ్రామాకు కారణమా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. కేసీఆర్ ఇటీవల హఠాత్తుగా చెప్పాపెట్టకుండా హస్తిన వెళ్లి అక్కడ పది రోజుల బస చేసి అక్కడ చేసిందేమిటన్న విషయంపై సస్పెన్స్ విడిపోయింది.

ఆయన హస్తిన పర్యటన తిమ్మిని బిమ్మిని చేసైనా సరే ఢిల్లీ లిక్కర్ స్కాం నుంచి తన బిడ్డ కవితను బయటపడేయడానికే అన్నది ఇప్పుడు తేటతెల్లమౌతోంది. తన బిడ్డను లిక్కర్ స్కాం నుంచి బయటపడేయడానికి ఆయన చేయని ప్రయత్నం లేదని బయటపడింది. సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు కేసీఆర్ యూపీ వెళ్లారు. కూడా తన కుమార్తె కవిత, మరో సమీప బంధువు, ఎంపీ సంతోష్ కూడా ఉన్నారు. సాధారణంగా చావు పరామర్శకు వెళ్లినా, అంత్యక్రియలకు వెళ్లిన.. అక్కడ నుంచి నేరుగా తిరిగి ఇంటికి రావడమన్నది సంప్రదాయం.. అటువంటిది సెంటిమెంట్లపై విపరీతమైన నమ్మకం ఉన్న కేసీఆర్ ములాయం అంత్యక్రియలకు హాజరై తిరిగి హైదరాబాద్ కు రాకుండా నేరుగా హస్తినకు వెళ్లి అక్కడే పది రోజులు బస చేయడంపై అప్పట్లోనే పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి.

సరే అక్కడ పది రోజులు బస చేసిన ఆయన అక్కడ అన్ని రోజులు ఏం చేశారన్నది ఇన్ని రోజులూ ఒక రహస్యంగానే మిగిలిపోయింది. అయితే ఇప్పుడప్పుడే అక్కడ ఆయన అన్ని రోజులు బస చేసి చేసిందేమిటన్నది బయటకు వస్తున్నది. ఆయన హస్తిన పర్యటన మొత్తం తన బిడ్డ కవితను ఢిల్లీ లిక్కర్ స్కాం నుంచి బయటపడేయడానికే అన్నది తేటతెల్లమైపోయింది. ఈ విషయమై ఆయన ఆర్ఎస్ఎస్ అగ్ర నేతలతో టచ్ లోకి వెళ్లి మరీ ప్రయత్నించారనీ, అలాగే బీజేపీ పెద్దలతో భేటీకి కూడా ప్రయత్నించారనీ హస్తినలో కేంద్ర ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండే వర్గాల నుంచి అందిన సమాచారం.  అలాగే పలు జాతీయ పార్టీల నాయకులతోనూ టచ్ లోకి వెళ్లి మద్దతు కోరినట్లు చెబుతున్నారు.

అయితే ఎవరూ కూడా ఈ విషయంలో కేసీఆర్ కు ఎవరి నుంచీ ఎటువంటి మద్దతూ లభించలేదని అంటున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలవడానికి కేసీఆర్ చేసిన ప్రయత్నం కూడా ఫలించలేదనీ, కేసీఆర్ కు అప్పాయింట్ మెంట్ ఇచ్చేందుకు కూడా అమిత్ షా ఇష్టపడలేదని అంటున్నారు. దీంతో దిక్కు తోచని కేసీఆర్  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి గవర్నర్.. ఆ తరువాత రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ తో తనకున్న పరిచయాలను ఉపయోగించుకుని ఆయనను హస్తినకు పిలిపించుకుని సహకారం అందించారు. ఉభయ రాష్ట్రాల గవర్నర్ గా అప్పట్లో నరసింహన్ కేసీఆర్ కు అనుకూలంగా వ్యవహరించారని అంటుంటారు.

అలాగే కేసీఆర్ కూడా నరసింహన్ కు అత్యధిక ప్రాధాన్యత  ఇచ్చే వారని చెబుతారు. ఆ పరచయాన్ని ఉపయోగించుకుని కేసీఆర్ నరసింహన్ ను తన తరఫున అమిత్ షాను కలిసి కవిత విషయంలో మద్దతు కోరాల్సిందిగా అడిగారని ఢిల్లీ వర్గాల భోగట్టా. మొహమాటానికైనా నరసింహన్ అందుకు అంగీకరించారనీ, కేంద్ర ఇంటెలిజెన్స్   బ్యూరో ప్రధాన అధికారిగా పని చేసిన నరసింహన్ కు కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో అధికారులతో తనకున్న పరిచయాల ద్వారా అమిత్ షా అప్పాయింట్ మెంట్ తీసుకుని ఆయనను కలిశారనీ, కేసీఆర్ విషయం ఆయనకు చెప్పారనీ అంటున్నారు.

అయితే నరసింహన్ ప్రతిపాదన వినగానే అమిత్ షా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారనీ,  ఆల్ మోస్ట్ గెటౌట్ అంటూ అవమానించారనీ కూడా ఆ వర్గాలు తెలిపాయి. ఇదే విషయాన్ని నరసింహన్ కేసీఆర్ కు చెప్పడంతో కేసీఆర్ కూడా ఆగ్రహంతో రగిలిపోయారని అంటున్నారు. ఈ పరిణామాల పర్యవశానమే.. ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామాకు కారణమైందని పరిశీలకులు అంటున్నారు. ఎలాగైనా బీజేపీని ఇరుకున పెట్టాలనీ, అమిత్ షాకు టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా గుణ పాఠం చెప్పాలన్న ఉద్దేశంతోనే ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామాకు తెరతీశారని అంటున్నారు. అయితే ఫామ్ హౌస్ నుంచి చేసిన ఫోన్ అమిత్ షా లిఫ్ట్ చేయకపోవడంతోనే ఈ డ్రామా రక్తికట్టలేదని పరిశీలకులు అంటున్నారు. 

By
en-us Political News

  
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.