జగన్ కు ఈవీఎంల టెన్షన్! బీహార్ పరిణామాలతో పరేషాన్ 

Publish Date:Nov 11, 2020

Advertisement

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్డిట్ పోల్స్ అంచనాలు తప్పయ్యాయి. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ  ఎన్డీఏ విజయం సాధించింది. ఆ కూటమి బోటాబోటీ మెజార్టీతో అతికష్టం మీద గట్టెక్కింది. సర్కార్ ఏర్పాటుకు మేజిక్ ఫిగర్ 122 కాగా.. ఎన్డీఏ కూటమికి మూడంటే మూడే సీట్లు అదనంగా వచ్చాయి. బీజేపీకి 73 సీట్లు రాగా, నితీస్ సారథ్యంలోని జేడీయూ 43 సీట్లపై పరిమితమైంది. ఆర్జేడీ 75 స్థానాలు గెలిచి సింగిల్ లార్జెట్ పార్టీగా అవతరించినా.. కూటమి పార్టీలకు అశించిన సీట్లు రాకపోవడంతో కొద్ది దూరంలో అధికార పీఠానికి దూరమైంది యూపీఏ కూటమి. 

 

బీహార్‌ లో ఎగ్జిట్‌ పోల్స్ అంచనాలకు భిన్నంగా ఫలితాలు రావడంతో ఈవీఎంల పనితీరుపై ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసిందని, కౌంటింగ్ లోనూ మేనేజ్ చేసిందని ఆర్జేడీ కూటమి పక్షాలు ఆరోపిస్తున్నాయి. పోలింగ్ రోజున ప్రజల మైండ్ స్పష్టంగా కనిపించిందని, అందుకు భిన్నంగా ఫలితాలు వచ్చాయని వారు చెబుతున్నారు. ఎన్డీఏ కూటమిలోనూ జేడీయూ ఎక్కువ సీట్లు కోల్పోగా.. బీజేపీ మాత్రం తాము పోటీ చేసిన స్థానాల్లో 70 శాతానికి పైగా గెలిచింది. 115 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 75 సీట్లలో గెలుపొందింది. ఇదే ఇప్పుడు విపక్షాల అనుమానాలకు కారణమవుతోంది. జేడీయూ మెజార్టీ సీట్లలో ఓడిపోయి బీజేపీ గెలవడం చర్చగా మారింది. బీహార్‌లోని 40 లోక్‌సభ స్థానాలకు 2019లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 39 స్థానాలు గెలిచింది. అప్పుడు కూడా  ఈవీఎంల ట్యాంపరింగ్‌ జరిగిందంటూ పెద్ద ఎత్తున  ఆరోపణలు వచ్చాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై కూడా తనకు విశ్వాసం లేదని, ఈవీఎంలన్నీ మోడీ ఓటింగ్‌ మెషిన్లే అంటూ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు రాహుల్‌ గాంధీ కూడా ప్రచారంలో విమర్శిస్తూ వచ్చారు. 

 

ఈవీఎంల ట్యాంపరింగ్ సాధ్యమేనని సాంకేతిక నిపుణులు ఇది వరకే సాక్ష్యాధారాలతో నిరూపించారు.  ఒక్కసారే పలు యంత్రాలను ట్యాంపరింగ్‌ చేయడం కుదరదని, అయితే వేర్వేరుగా ఏ ఈవీఎంనైనా ట్యాంపరింగ్‌ చేయవచ్చని వారు వివరించారు. ఫలితాలను తారుమారు చేయాలంటే అన్ని ఈవీఎంలను ట్యాంపర్‌ చేయాల్సిన అవసరం లేదని, అవసరమైన నియోజక వర్గాల్లో, అవసరమైన చోట కొన్ని ఈవీఎంల చొప్పున ట్యాంపరింగ్‌ చేయడం ద్వారా ఆశించిన ఫలితాలు సాధించవచ్చని కూడా ఎన్నికల విశ్లేషకులు వివరించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కూడా చాలా ఆలస్యంగా జరగడం.. ఈవీఎంల ఓట్లను లెక్కించటానికి గంటలకొద్ది సమయం తీసుకోవడంతో ఇప్పుడు అక్రమాలు జరిగాయనే ఆరోపణలకు కారణమవుతున్నాయి. 

 

బీహార్ ఎన్నికల సందర్భంగా జరిగిన పరిణామాలతో ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ కలవరపడుతున్న తెలుస్తోంది. ఈవీఎంల ట్యాంపరింగ్ ద్వారా వచ్చే అసెంబ్లీ  ఎన్నికల్లో ఏపీలో బీజేపీ పాగా వేస్తుందేమోనన్న ఆందోళన సీఎం జగన్ లో ఉందని చెబుతున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ ద్వారానే వైసీపీ గెలిచిందనే ఆరోపణలున్నాయి. వైసీపీకి ఏకంగా 151 సీట్లు రావడం అప్పుడు అందరిని అశ్చర్యపరిచింది. వైసీపీ నేతలు కూడా ఇన్ని సీట్లు వస్తాయని ఊహించలేదంటారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి వైసీపీకి బీజేపీ సహకరించిందని, అందుకే వైసీపీ ఏకపక్షంగా ఫలితాలు వచ్చాయనే ఆరోపణలు కూడా కొన్ని వర్గాల నుంచి వినిపించాయి. వైసీపీకి వచ్చిన మెజార్టీలు కూడా ఈ ఆరోపణలకు బలాన్నిచ్చాయి. 
 

2019 ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి నుంచి బయటికి వచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు. కాంగ్రెస్ తో కలిసి బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రచారం చేశారు. ఏపీకి అన్యాయం చేశారంటూ ప్రధాని మోడీ, అమిత్ షాను ఘాటుగా విమర్శించారు. దీంతో కాంగ్రెస్ సపోర్ట్ చేస్తూ తమను టార్గెట్ చేసిన చంద్రబాబును బీజేపీ పెద్దలు టార్గెట్ చేశారని చెబుతారు. అందులో భాగంగానే చంద్రబాబును ఓడించేందుకు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారనే ఆరోపణలు ఇప్పటికి ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. వైసీపీ గెలిచినా తమ చేతుల్లోనే ఉంటుందనే భావనలోనే బీజేపీ అలా చేసిందంటున్నారు. బీజేపీ అనుకుంటున్నట్లే ఇప్పుడు వైసీపీ వ్యవహారం ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చెప్పుచేతుల్లోనే వైసీపీ ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది.   

 

ఇప్పుడు దక్షిణాదిపై బీజేపీ స్పెషల్ ఫోకస్ చేసింది. ఇప్పటికే కర్ణాటకలో అధికారంలో ఉండటంతో తెలంగాణ, అంధ్రప్రదేశ్, తమిళనాడును టార్గెట్ చేస్తోంది. తెలంగాణలో ఇప్పటికే టీఆర్ఎస్ కు బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా మారింది బీజేపీ. దుబ్బాక  ఉప ఎన్నికలో విజయంతో బీజేపీకి మరింత బూస్ట్ ఇచ్చింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే అధికారమే లక్ష్యంగా తెలంగాణలో బీజేపీ వ్యూహాలు రచిస్తోంది.ఏపీలోనూ అధికారం కోసం కమలనాధులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. అధికారం కోసం బీజేపీ ఏమైనా చేస్తుందని, ఈవీఎంల ట్యాంపరింగ్ కూడా చేయవచ్చని వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారట. 2019 ఎన్నికల్లో తమ గెలుపునకు సహకరించాయనే ఆరోపణలు ఉన్న ఈవీఎంలే...  2023 ఎన్నికల్లో తమ కొంప ముంచుతాయోమనన్న టెన్షన్ వారిలో కనిపిస్తుందని చెబుతున్నారు. బీజేపీ సీరియస్ గా దృష్టి సారిస్తే ఏపీలోనూ బీహార్ వ్యూహాలను అమలు చేయవచ్చని వారు భయపడుతున్నారు. మొత్తంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల పరిణామాలతో ఫ్యాన్ పార్టీ నేతలు లోలోపల పరేషాన్ అవుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
 

By
en-us Political News

  
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.