40ఏళ్ల లోపే మనుషుల్ని క్యాన్సర్ రోగులుగా మార్చే అలవాట్లు ఇవి.. మీకు ఉన్నాయేమో చెక్ చేస్కోండి..!

Publish Date:Jan 22, 2026

Advertisement


క్యాన్సర్ ప్రపంచాన్ని కబళిస్తున్న జబ్బు. పూర్తీగా చెయ్యి దాటిన దశలో బయటపడటం అనే కారణం వల్ల క్యాన్సర్ అంటే ఇక మరణమే అనే అభిప్రాయం ఏర్పడింది.  క్యాన్సర్ కు వైద్యం ఉన్నా అది చాలా ఖర్చుతో కూడుకున్నది కావడంతో చాలా నరకం అనుభవించాల్సి వస్తుంది.  సింపుల్ గా చెప్పాలంటే.. క్యాన్సర్ ఒక మనిషి  శరీరాన్ని లోపలే విచ్చిన్నం చేయడమే కాకుండా.. ఒక కుటుంబాన్ని ఆర్థికంగా కూడా చితికిపోయేలా చేస్తుంది. నేటికాలంలో క్యాన్సర్ నిపుణులు కొన్ని ఆందోళనకరమైన మార్పులు గమనిస్తున్నారు. క్యాన్సర్ అంటే పెద్దవారిలో బయటపడేది అనుకునేవారు. కానీ నేటికాలంలో యువతలో కూడా క్యాన్సర్ బయటపడటం ఆందోళనగా మారుతోంది. కొంతమంది 20 లేదా 30 ఏళ్ల లోపు క్యాన్సర్ రోగులుగా మారుతున్నారు. రొమ్ము క్యాన్సర్ నుండి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వరకు అన్ని రకాల క్యాన్సర్‌లలో ఈ మార్పు కనిపిస్తోంది. శరీరాన్ని చాలా సైలెంట్ గా క్యాన్సర్ బారిన పడేలా చేసే 7 అలవాట్లు ఉన్నాయి. ఈ 7లో కూడా 3 పనులు చేసిన తర్వాత ప్రజలు చాలా గ్రేట్ గా ఫీలవుతూ ఉంటారు. అవేంటో అవి శరీరాన్ని క్యాన్సర్ బారిన పడేలా ఎందుకు చేస్తాయో.. తెలుసుకుంటే..  


ప్రజలు మూడు పనుల విషయంలో చాలా గ్రేట్ ఫీలవుతారు.  పైగా వాటిని మార్చుకోవాలని కూడా అనుకోరు.  కానీ క్రమంగా అవి కణాలను,  హార్మోన్ల పనితీరును దెబ్బతీస్తాయి.

ఉదాహరణకు..

గంటల తరబడి కూర్చోవడం వల్ల  తాము చాలా పని చేస్తున్నామని, చాలా భాద్యతగా ఉంటున్నామని అనుకుంటారు. ఇది విజయానికి  మంచిదే కానీ ఇది ఆరోగ్యపరంగా చాలా నష్టాలు కలిగిస్తుందని అంటున్నారు.

అదేవిధంగా.. నిద్రించడానికి తగినంత సమయం లేకపోవడం వల్ల  తగినంత నిద్రపోని వారు అనేకమంది ఉన్నారు. కొంతమంది ఎక్కువగా మద్యం సేవించిన తర్వాత తమ సామర్థ్యం బాగా పెరిగిందని తమను తాము గొప్పగా చెప్పుకుంటారు.

ఆహారం..

నేటికాలంలో ఆహారపు అలవాట్లు చాలా అనారోగ్యకరంగా తయారయ్యాయి. ప్యాక్ చేసిన స్నాక్స్, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు,  తక్కువ ఫైబర్ భోజనం ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇది ప్రేగులలోని బ్యాక్టీరియా సంఖ్యను ప్రభావితం చేస్తుంది. ఇది పెద్దప్రేగు,  గ్యాస్ట్రిక్ క్యాన్సర్‌కు దారితీస్తుంది. యాంటీబయాటిక్ ఎక్కువ వాడటం కూడా ఈ ప్రమాదాన్ని పెంచుతుంది.

పొల్యూషన్..

పర్యావరణ,  కాలుష్య కారకాలు క్యాన్సర్‌కు ప్రధాన కారణం. చుట్టూ ఉన్న కలుషితమైన గాలి,  ఇంటి లోపల,  వెలుపల గాలిని ప్రమాదకరంగా మారుస్తోంది. PM2.5,  వాయు కాలుష్యం నుండి వచ్చే టాక్సిన్స్ శరీరంలోకి ప్రవేశించి వాపుకు కారణమవుతాయి. రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తాయి.  DNA ను దెబ్బతీస్తాయి. ఇది ధూమపానం చేయని వారిలో కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు కారణమవుతుంది.

జన్యువులు..

చిన్న వయసులోనే క్యాన్సర్ వచ్చే వ్యక్తులు జన్యు కారణాల వల్ల ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్ ఉండటం వలన BRCA వంటి  సమస్యలు  సంభవించవచ్చు. అనారోగ్యకరమైన వాతావరణంలో జీవించడం దీని ప్రమాదం పెరుగుతుంది.

పరీక్షలు..

యువతలో చాలామంది తమకు ఎదురయ్యే  ఆరోగ్య సమస్యలను లైట్ తీసుకుంటారు. మాది చిన్న వయసు మాకేం జబ్బులు వస్తాయి అని అనుకుంటారు. ఈ వయసులో క్యాన్సర్ ఎలా వస్తుందనే ఆలోచన యువతలో ఉంటుంది. దీనివల్ల ఈ ప్రాణాంతక వ్యాధిని గుర్తించడం ఆలస్యం అవుతుంది.  చికిత్స కష్టమవుతుంది.  దీర్ఘకాలిక నొప్పి, ఆకస్మికంగా బరువు తగ్గడం, మలద్వారం నుండి రక్తస్రావం, ఎప్పుడూ  దగ్గు రావడం,  రొమ్ములో ముద్దగా ఉండటం,  మూత్ర విసర్జన అలవాట్లలో మార్పు లేదా నోటిలో పూతలు ఎక్కువ కాలం ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.

                        *రూపశ్రీ.

By
en-us Political News

  
నేటి వేగవంతమైన ప్రపంచంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం ఒక విలాసం కాదు, అది ఒక అవసరం. మీ ఫిట్‌నెస్ ప్రయాణాన్ని సరైన దిశలో నడిపించడానికి ఈ క్రింది సమగ్ర సమాచారం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
చాలామందికి బాదం పప్పు గురించి తెలిసి ఉంటుంది. కానీ బాదం బంక అనే పేరు బహుశా చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది.  కానీ బాదం బంక ఆరోగ్యానికి చాలామంచిదని చెబుతారు.  బాదం బంకను నీటిలో నానబెట్టుకుని తింటుంటారు.
నేటికాలంలో కిడ్నీలో రాళ్లు ఏర్పడటం చాలా సాధారణం అయిపోయింది.   ఏ వయసు వారికైనా ఈ సమస్య కనిపిస్తూ ఉంటుంది. ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం వల్ల పిల్లలు,  యువకులలో కిడ్నీలో రాళ్ల సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి...
తలనొప్పి చాలా కామన్ గా అందరికీ వచ్చే సమస్య.  ఆఫీసు ఒత్తిళ్లు, దినచర్య క్రమంగా ఉండకపోవడం,   భోజనం ఆలస్యం కావడం,  సరిపడని ఆహారం తినడం వంటివి  తలనొప్పి కలిగిస్తూ ఉంటాయి. కానీ ప్రతి తలనొప్పి...
మునక్కాడల గురించి అందరికీ తెలిసే ఉంటుంది.  మునక్కాడలను వివిధ వంటకాల తయారీలో వాడుతూ ఉంటారు. అయితే మునగాకు గురించి చాలామందికి తెలియదు...
భారతీయులు ఆహార ప్రియులు.  భారతీయుల భోజనంలో చాలా రకాలు పదార్థాలు ఉంటాయి.  ముఖ్యంగా చాలామంది తమ భోజనంలో కొంచెం అన్నం  చపాతీ,  రెండు లేదా మూడు రకాల కూరలు.. ఇలా ఉండేలా చూసుకుంటారు...
ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు. అయితే శరీరంలో అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తేనే  ఆరోగ్యం బాగుంటుంది...
వంటింట్లో సుగంధ ద్రవ్యాలు చాలా ఉంటాయి.  ఇవి అటు వంటలను ఘుమఘుమలాడించడమే కాకుండా.. ఇటు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.  చాలామంది రక్తంలో చక్కెర నియంత్రణకు,  ఇన్సులిన్ నిరోధకతకు పిసిఏస్ లేదా జీవక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం...
శీతాకాలంలో మార్కెట్ లో పచ్చి బఠానీలు అందుబాటులోకి వస్తాయి.  భారతీయ కూరలు,  మసాలా రైస్, వెజిటబుల్ రైస్, కూరగాయలు అన్నీ కలిపి వండే కూరలు, గ్రేవీలు, సూపుల  నుండి స్నాక్స్ వరకు బఠానీలు ప్రతి వంటకం..
నేటి వేగవంతమైన జీవితంలో, మనం చిన్న చిన్న అలవాట్ల విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు . కామన్ గా  ఆఫీసులో, ఇంట్లో లేదా బయటకు వెళ్లినప్పుడు నిలబడి నీరు తాగుతుంటారు.   దీని వల్ల ఏం జురుగుతుందనే..
డయాబెటిస్ చాలామందిని కుదిపేస్తున్న సమస్య.  ఒకప్పుడు 60ఏళ్ళు దాటిన వృద్దులలో డయాబెటిస్ కనిపించేది. కానీ నేటి కాలంలో మాత్రం 30 ఏళ్లు కూడా నిండకనే డయాబెటిస్ బారిన పడుతున్నారు.  మరీ దారుణం ఏమిటంటే....
ఆహారం శరీరానికి చాలా ముఖ్యమైనది.  శరీరానికి అన్ని పోషకాలు లభించాలంటే ఆయా పోషకాలు సమృద్దిగా ఉన్న ఆహారాలు తినాలని చెబుతారు పెద్దలు, వైద్యులు.  అయితే కొన్ని రకాల ఆహారాలు ఎంత తిన్నా వాటిలోని పోషకాలు..
ఆహారం ప్రతి జీవికి శక్తివనరు.  ప్రాణం లేని వాహనాలు కూడా వాటికి ఇంధనం  ఉంటేనే పని చేస్తాయి. అలాంటి ప్రాణం ఉన్న జీవులకు ఆహారం చాలా ముఖ్యమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ప్రాణం ఉన్న జీవులలో ఈ ప్రపంచంలో మనిషి చాలా ప్రత్యేకం.  అయితే మనిషి సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలంటే సమతుల ఆహారం తీసుకోవాలి...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.