ప్రతి తల్లి తన కూతురు వివాహానికి ముందే ఈ విషయాలు నేర్పించాలి..!

Publish Date:Nov 18, 2025

Advertisement

 


ఈ ప్రపంచంలో చాలా పవిత్రతను,  ప్రత్యేకతను కలిగి ఉండేది వైవాహిక బంధం.  ఇద్దరు వేర్వేరు వ్యక్తులు వివాహంతో ఒక్కటై.. జీవితాంతం కలిసి ఉండటం ఈ బంధానికి చాలా ప్రాధాన్యతను తెచ్చి పెడుతుంది.  సహజంగా పెళ్లి అంటే చాలా హడావిడి జరుగుతుంది.  నిశ్చితార్థం, షాపింగ్,  శుభలేఖలు,  ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్,  హనీమూన్ వరకు.. ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాకుండా జరగాలని కోరుకుంటారు నేటి తరం అమ్మాయిలు, అబ్బాయిలు.  అయితే ప్రీ వెడ్డింగ్ పోటో షూట్ ల గురించి చర్చలు జరిపినా, జరపకపోయినా.. ప్రతి తల్లి  పెళ్ళికి ముందు తమ కూతుళ్లకు కొన్ని విషయాలు తప్పక నేర్పించాలని అంటున్నారు రిలేషన్షిప్ నిపుణులు. వైవాహిక బంధాలు చాలా తొందరగా విచ్చిన్నం అవుతున్ననేటికాలంలో ఈ విషయాలు బందాలను నిలబెట్టే పునాదులు అవుతాయని కూడా అంటున్నారు. ఇంతకీ ఆ విషయాలు ఏంటో తెలుసుకుంటే..

బాధ్యత..

ఆడపిల్ల పెళ్లి తర్వాత ప్రతి పనిని తన బాధ్యతగా భావించడం నేర్పాలి. ఇంటిని మెయింటైన్ చేయడం  అయినా లేదా తనను తాను చూసుకోవడం అయినా, పెళ్లి తర్వాత ఆడపిల్లలు  అన్నీ చేయగలగాలి.  తన అవసరాలను తాను తీర్చుకోగలగాలి.  తన సమయాన్ని  తాను ప్లానింగ్ గా చూసుకోవాలి.  స్వావలంబన కలిగిన స్త్రీ ప్రతి పరిస్థితిలోనూ బలంగా ఉంటుంది. అంటే ఇంటి పని అయినా,  తన పనులు అయినా, ఇతర విషయాలు అయినా.. తాను చేయగలిగేవి తాను చక్కగా చేసుకుంటే.. ఇతరుల మీద ఆధారపడకుండా ఉంటే.. ప్రతి మహిళ మానసికంగా చాలా దృఢంగా ఉండగలుగుతుంది.

వంట రావాలి..

నేడు ఇళ్లలో ప్రతిదీ ఆన్‌లైన్‌లో లేదా వంట మనుషులు, పని మనుషుల  సహాయంతో జరుగిపోతుంటాయి. కానీ రుచికరమైన,  పోషకమైన ఆహారాన్ని వండటం ఒక కళ. ఆహారం  కడుపు నింపుకోవడానికి మాత్రమే కాదు, సంబంధాలను బలోపేతం చేయడానికి కూడా ఒక మార్గం అని ప్రతి తల్లి తన కూతురుకి చెప్పాలి.  తనకు నచ్చిన వంట చేసుకుని తినడమే కాకుండా కుటుంబ సభ్యులకు నచ్చిన ఆహారాన్ని వండి పెట్టడంలో కూడా మనుషుల మద్య బందాలు బలపడటానికి సహాయపడుతుంది.

మాట, సహనం..

మాట్లాడటం అనేది వివాహ జీవితానికి పునాది. ప్రతి విభేదాన్ని వాదన ద్వారా కాకుండా ఆరోగ్యకరంగా మాట్లాడటం ద్వారా పరిష్కరించుకోవాలని ప్రతి కూతురికి తల్లి నేర్పించాలి. తన  అభిప్రాయాలను వ్యక్తపరుస్తూనే ఇతరుల అభిప్రాయాలను వినడం,  గౌరవించడం నేర్చుకోవడం ముఖ్యం. అత్తమామల ఇంట్లో మాట్లాడటం,  వారు చెప్పినది ఓపికగా వినడం, అర్థం చేసుకోవడం వంటి విషయాలు సజావుగా ఉన్నప్పుడే అత్తారింట్లో ఆడపిల్ల అనుబంధం బాగుంటుంది.

ఆర్థిక అవగాహన, పొదుపు..

వివాహానికి ఆర్థిక స్వాతంత్ర్యం బలమైన స్తంభం అవుతుంది.  చిన్న పొదుపులు, బడ్జెట్ లాగా ప్లాన్ చేసుకుని ఖర్చు పెట్టడం, ఖర్చులను ప్లానింగ్ ప్రకారం ఉంచుకోవడం, ఆర్థిక విషయాలలో మంచి అవగాహన కలిగి ఉండటం వంటివి ప్రతి ఆడపిల్లను అత్తారింట్లో గౌరవంగా నిలబెడతాయి.

సెల్ఫ్ లవ్, సెల్ఫ్ రెస్పెక్ట్..

పెళ్లైపోగానే ఆడపిల్ల తన ఐడెంటిటీ కోల్పోకూడదు.  తన ప్రాధాన్యతలు, తన పట్ల తను బాధ్యతగా ఉండటం, తన కోసం తాను సమయాన్ని కేటాయించుకోవడం, సెల్ఫ్ లవ్ కలిగి ఉండటం, నిర్ణయాలు తీసుకోవడంలో బలంగా ఉండటం,   తనను ఇబ్బంది పెట్టే పనులు, విషయాలకు సున్నితంగా నో చెప్పడం వంటివి ప్రతి ఆడపిల్ల తెలుసుకోవాలి.  ఇవన్నీ పెళ్లికి ముందు తన కూతురికి నేర్పించడం ప్రతి తల్లి బాధ్యత.

                          *రూపశ్రీ.

By
en-us Political News

  
మీ జుట్టు మీ అందానికి ఒక కిరీటం వంటిది. కానీ నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, కాలుష్యం మరియు రసాయనాల వాడకం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటోంది. మీ జుట్టును ఒత్తుగా, పొడవుగా మరియు ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం...
ప్రేమించిన వారిని వదిలి వేరొకరిని పెళ్లి చేసుకుంటున్నారా? మీ జీవితం మరియు మీ భాగస్వామి భవిష్యత్తు కోసం ఈ విషయాలు తప్పక తెలుసుకోండి...
ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న అతి పెద్ద ఆరోగ్య సమస్య హార్మోన్ల అసమతుల్యత (Hormonal Imbalance). మనం ఎంత ప్రయత్నించినా బరువు తగ్గకపోవడం, ఎప్పుడూ అలసటగా అనిపించడం, మానసిక ఒత్తిడి.. ఇవన్నీ మీ హార్మోన్లు పంపే సంకేతాలు కావచ్చు...
పుట్టిన తర్వాత పిల్లలు పెద్దగా అయినా.. వారు చదువులు పూర్తయ్యి,  పెళ్ళి చేసుకుని, వారు కూడా పిల్లలను కన్నా సరే.. తల్లిదండ్రులకు మాత్రం తమ పిల్లలు ఎంతవాళ్లైనా ఇంకా చిన్న పిల్లలు గానే అనిపిస్తూ ఉంటుంది...
జీవితంలో విజయం సాధించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ విజయం కొందరే సాధిస్తారు. దీనికి కారణాలు చాలా ఉంటాయి...
భారతీయుల ఇళ్లలో చాలా వరకు కరివేపాకు మొక్క పెంచుతూ ఉంటారు. ఇంటి బయట ఏ మాత్రం కాస్త స్థలం ఉన్నా సరే.. మొదటగా కరివేపాకు మొక్కనే పెంచుతూ ఉంటారు. కరివేపాకు మొక్క ఎదుగుదలకు కూడా భారతీయ...
వేసవి కాలం వచ్చిందంటే ప్రతి ఇంట్లో కూలర్ల దుమ్ము దులిపి వాడటానికి సిద్దం చేస్తుంటారు.  అయితే చాలా మంది ఇబ్బంది పడే సమస్య కూలర్ నుండి దుర్వాసన రావడం.  కూలర్ ను శుభ్రం చేసి వాడటానికి సిద్దం చేసినా సరే..
భారతీయుల ఆహారంలో బెల్లం ప్రధాన పదార్థం. తీపి పదార్థాల తయారీ నుండి కూరలలో కూడా రుచి కోసం బెల్లం వాడుతూ ఉంటారు.  అయితే వేసవి కాలంలో బెల్లం విషయంలో పెద్ద సమస్య ఎదురవుతుంది....
ఒక్కసారి ఆలోచించండి.. ఉదయం నిద్రలేవగానే మీరు చూసే మొదటి ముఖం ఎవరిది? మీ భాగస్వామిదా లేక మీ మొబైల్ ఫోన్ స్క్రీనా? ఒకప్పుడు పక్కపక్కనే కూర్చుని మనసు విప్పి మాట్లాడుకునే వాళ్ళం..
నేటి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యలలో ‘ఫ్రోజెన్ షోల్డర్’ (Frozen Shoulder) ఒకటి. వైద్య పరిభాషలో ‘అడెసివ్ క్యాప్సులైటిస్’ అని పిలిచే ఈ సమస్య వల్ల భుజం కీలు బిగుసుకుపోయి
ప్రేమ ఒక అందమైన భావన, కానీ చాలా మందికి ఇది పదే పదే బాధ కలిగిస్తూ ఉంటుంది. ప్రేమ మొదట్లో అద్బుతంగా ఉంటుంది..
వేసవి కాలం వచ్చిందంటే చాలు..  ప్రతి ఇంట్లో చల్లదనం కోసం ఫ్యాన్లతో పాటు కూలర్ల వాడకం  పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ, కూలర్లు  తప్పనిసరి అవుతాయి.  రోజంతా కూలర్లు పనిచేస్తూనే ఉంటాయి...
వేసవి కాలం వచ్చిందంచే సాధారణ టేబుల్ ఫ్యాన్ లు,  సీలింగ్ ఫ్యాన్ లు సరిపోవు.  వీటి నుండి వచ్చే గాలి వేసవి వేడిని కంట్రోల్ చేయలేవు. పైగా వేసవి వేడి గాలిని తిప్పి, తిప్పి గది మొత్తం వేడిగా మార్చేస్తాయి...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.