బీఆర్ఎస్.. కిందపడ్డా పైచేయి మాదేనంటే ఎలా?

Publish Date:Feb 16, 2026

Advertisement

బీఆర్ఎస్ కింద పడ్డా పై ‘చేయి’ మాదేనంటోంది. ‘హస్త’ వాసి బాగాలేదంటోంది. కాంగ్రెస్ పార్టీపై ప్రజలలో వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో తెలియడానికి మునిసిపోల్స్ ఫలితాలే నిదర్శనమని బల్లగుద్ది మరీ చెబుతోంది. పురపోరులో ఈ స్థాయిలో పరాజయాన్ని మూటగట్టుకుని కూడా ఓటింగ్ శాతం చూడండి.. గత లోక్ సభ ఎన్నికలతో పోలిస్తే బీఆర్ఎస్ కు వచ్చిన ఓట్ల శాతం పెరిగిందనీ, కాంగ్రెస్ కు తగ్గిందనీ చెబుతూ సొంత భుజాలను చరిచేసుకుంటోంది. అయితే.. బీఆర్ఎస్ ఓట్ల శాతం భాష్యంపై జనంలో పెద్దగా స్పందన రావడం లేదు. పైపెచ్చు పార్టీ శ్రేణుల్లోనూ ఈ తరహా వ్యాఖ్యల పట్ల ఒకింత వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. సాధారణంగా ఒక పరాజయం తరువాత ఏ పార్టీ అయినా, లోపాలను సవరించుకోవడంపై దృష్టి పెడుతుంది. అలాంటిది వరుస పెట్టి పరాజయాలు ఎదురౌతున్నా బీఆర్ఎస్ అగ్రనాయకత్వం అంతర్మథనం వైపు దృష్టి సారించడం లేదు. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై వారి ఆదరణ పొందడానికి అవసరమైన కార్యాచరణ ప్రకటించలేదు.  

2023  అసెంబ్లీ ఎన్నిక‌ల లగాయతు.. బీఆర్ఎస్ పరిస్థితి రోజురోజుకూతీసికట్టు అన్నచందంగా కనిపిస్తోంది.  2023లో పార్టీ పరాజయం తరువాత.. ఆ పార్టీ టికెట్ పై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీకి దూరమయ్యారు. శాసన సభ్యత్వం రద్దు కాకుండా కాపాడుకోవడానికో, అనర్హత వేటు భయంతోనో.. కారణమేమైతేనేం.. సాంకేతికంగా తాము బీఆర్ఎస్ లోనే ఉన్నామనిన చెబుతున్నప్పటికీ ఆ ఎమ్మెల్యేలు పార్టీకి విధేయంగా లేరన్నది తేటతెల్లమైపోయింది. ఇక కీల‌క‌మైన కేకే వంటి నాయకులు సైతం బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేశారు. ఈ పరిస్థితుల్లో  పార్టీని క్షేత్రస్థాయి నుంచీ బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాల్సిన కేసీఆర్.. పార్ట్ టైం పార్టీ కార్యక్రమాలకే పరిమితమై.. ఫామ్ హౌస్ దాటి అడుగుబయటపెట్టేది లేదని చాటుతున్నారు. ఇక కార్య నిర్వాహక అధ్యక్షుడిగా పార్టీని ముందుండి నడిపించాల్సిన కేటీఆర్ సామాజిక మాధ్యమం వేదికగా అధికారపార్టీపై విమర్శల పేరుతో దూషణలకు పరిమితమౌతున్నారు.

పంచాయతీ పోరులో పరాజయం తరువాత మునిసిపోల్స్ లో జెండా పాతడం ఖాయమని ఘనంనగా ప్రకటించారు కేటీఆర్. అయితే ఫలితాలలో ఎన్నికలు జరిగిన 115 మునిసిపాలిటల్లో బీఆర్ఎస్ గెలుచుకున్నవి కేవలం 16 మునిసిపాలిటీలే. ఇక బీఆర్ఎస్ పార్టీ ఒక్కటంటే ఒక్క వార్డులో కూడా గెలుపొందని మునిసిపాలిటీలు 13కు పైగా ఉన్నాయి.  ఎన్నిక‌ల్లో గెలుపు-ఓట‌ములు స‌హ‌జ‌మే. కానీ.. తన అంచనాలలోని సంఖ్యకు కనీసం దరిదాపులకు కూడా రాకుండా మునిసిపల్ పోరు ఫలితాలు ఉన్నా.. ఎక్కడ తేడా కొడుతోందన్న ఆత్మ విమర్శ చేసుకునేందుకు మాత్రం కేసీఆర్, కేటీఆర్ అండ్ కో రెడీగా లేరు. పంచాయతి, పుర పోరు  కాదు.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో మాత్రం మా విజయం ఖాయం అంటూ కేటీఆర్ చాటడం చూస్తుంటే.. కింద పడిన ప్రతిసారీ పైచేయి మాదేనని చాటేందుకు చేస్తున్న ప్రయత్నంగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇదే తరహాలో కేటీఆర్ గమనం ఉంటే భవిష్యత్ లో మరిన్ని ఘోర పరాభవాలకు బీఆర్ఎస్ సిద్ధపడాల్సిందే అంటున్నారు పరిశీలకులు.

By
en-us Political News

  
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వందేమాతరం అంశం చర్చనీయాంశంగా మారింది.
2024 ఎన్నికల సమయానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న జనసేన పార్టీ తెలుగుదేశం, బీజేపీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల రంగంలోకి దిగింది. ఆ ఎన్నికలలో నాగబాబు అనకాపల్లి లోక్ సభ స్థానం నుంచి రంగంలోకి దిగుతారని పెద్ద ఎత్తున ప్రచారం అయ్యింది. అయితే పొత్తు ధర్మంలో భాగంగా నాగబాబుకు ఆ ఎన్నికలలో పోటీ చేసే అవకాశమే దక్కలేదు.
తమిళనాడులో బీజేపీ, హీరో విజయ్ సారథ్యంలోని టీవీకేల పొత్తు విషయంలో మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
దేశంలోని నాలుగు రాష్ట్రాలతో పాటు ఒక కేంద్రపాలిత ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది
ఈసీ తీరుపై నమ్మకం లేదని చెబుతున్న పార్టీ, ఇప్పుడు సీఈసీపై అభిసంశన తీర్మానానికి మద్దతుగా నిలబడకుంటే.. ఆ పార్టీ నైతికతే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఒక వేళ వైసీపీ ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తే ఇక ముందు, ఎన్నికల అక్రమాలపై మాట్లాడేందుకు వైసీపీకి అర్హతే ఉండదు. ఇంత వరకూ తెలుగుదేశం కూటమి విజయంపై వారు చేసిన విమర్శలన్నీ దూదిపింజెల్లా ఎగిరిపోతాయి.
బీఆర్ఎస్ హయాంలో ఇదే ఫామ్‌హౌస్ వేదికగా జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు ఉదంతం అప్పట్లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పట్లో రోహిత్ రెడ్డి ఫిర్యాదుతోనే పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించి, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో ఈ కేసు జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది.
దేవ్ జీ అరెస్ట్ ఎలా జరిగింది? అరెస్టు తరువాత ఆయన లొంగుబాటు ప్రకటన చేసి జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్లు ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? లొంగిపోలేదు అంటూనే.. ప్రస్తుత పరిస్థితుల్లో అజ్ణాతంగా ఉండి ఉద్యమాన్ని కొనసాగించడం కష్టసాధ్యమని ఎందుకు చెబుతున్నారు?
త్రిష త్వరలోనే సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి రావడం కన్ఫర్మ్ అన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే ఇందుకు సంబంధించి త్రిష నుంచి ఎటువంటి క్లారిటీ అయితే ఇప్పటి వరకూ రాలేదు. ప్రస్తుతం త్రిష పలు సినిమాలలో నటిస్తున్నారు. వాటిలో మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా కూడా ఉంది.
మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా పవన్ కల్యాణ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనీ, షూటింగ్ లంటూ అధిక సమయం హైదరాబాద్ లోనే ఉంటున్నారని రోజా అన్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి సినిమాలలో యాక్టింగ్ కి పరిమితమైనట్లుగా పవన్ కల్యాణ్ తీరు ఉందని రోజా అన్నారు. కీలకమైన మంత్రివర్గ సమావేశానికి డుమ్మా కొట్టడం సరికాదన్న రోజా దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధానసౌధలో కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే.. పాతిక మంది ఎమ్మెల్యేలు ఓ ప్రైవేట్ హోటల్‌లో ఈ భేటీ జరగడం సంచలనం సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదిక 16వ సంచికలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
జనసేన పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఈసారి దూరం జరిగింది.
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.