జూన్ 2న ఈటల రాజీనామా! కేంద్ర మంత్రివర్గంలో చోటు?

Publish Date:May 30, 2021

Advertisement

కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ భవిష్యత్ కార్యాచరణపై క్లారిటీ వచ్చేసింది. కొన్ని రోజులుగా జరుగుతున్నట్లే ఆయన కమలం గూటికి చేరబోతున్నారు. కేంద్ర సర్కార్ పెద్దలను కలిసేందుకు ఢిల్లీకి వెళ్లిన ఈటల రాజేందర్.. సోమవారం ఉదయం11 గంటలకు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం కానున్నారు. సోమవారం ఉదయం ఢిల్లీకి బీజేపీ నేత బండి సంజయ్‌ వెళ్లనున్నారు. ఈటలను నడ్డా దగ్గరకు బండి సంజయ్ తీసుకెళ్లనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కూడా ఈటల కలిసే అవకాశం ఉంది. ఈటల వెంట మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి ఢిల్లీ వెళ్లారు. బీజేపీ పెద్దలతో చర్చల తర్వాత ఆయన తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.

తనను కేబినెట్ నుంచి తొలగించడంపై రగిలిపోతున్న రాజేందర్.. కేసీఆర్ పై రివేంజ్ తీర్చుకోవాలనే కసిలో ఉన్నారు. బీసీ ఎజెండాతో ఆయన కొత్త పార్టీ పెడతారనే ప్రచారం జరిగింది. బీసీ సంఘాలకు కూడా ఆయనకు మద్దతుగా నిలిచాయి. తన అనుచరులతో వరుస సమావేశాలు నిర్వహించిన ఈటల కూడా అదే సంకేతమిచ్చారు. సోషల్ మీడియాలోనూ కొత్త ప్రోఫైల్ పెట్టి కాక రాజేశారు. అయితే తర్వాత సీన్ మారింది. కొత్త పార్టీని పక్కనపెట్టిన ఈటల.. బీజేపీతో టచ్ లోకి వెళ్లారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ , కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డితో చర్చలు జరిపారు. ఈటల బీజేపీలో చేరేలా డీకే అరుణ, వివేక్ వెంకటస్వామి ఒప్పించారని తెలుస్తోంది. బీజేపీ జాతీయ నేత భూపేందర్ యాదవ్ హైదరాబాద్ వచ్చి ఈటలతో మాట్లాడారని కూడా ప్రచారం జరిగింది. బీజేపీ హైకమాండ్ నుంచి వచ్చిన ఆఫర్లపై తన మద్దతు దారులతో చర్చించిన రాజేందర్.. కషాయ కండువా కప్పుకోవాలని డిసైడ్ అయ్యారని అంటున్నారు. 

బీజేపీలో చేరిన అనంతరం.. ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని తెలుస్తోంది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజీనామా ప్రకటిస్తారని సమాచారం.  ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత జరగబోయే హుజురాబాద్ ఉపఎన్నికల్లో ఈటల రాజేందర్ పోటీచేయబోడని ప్రచారం జరుగుతోంది. ఉప ఎన్నికలో ఈటల జమున పోటీ చేస్తారని చెబుతున్నారు. ఇప్పటికే ఆ దిశగా ఆమె కసరత్తు ప్రారంభించారని తెలుస్తోంది. ఈటల రాజేందర్ ను రాజ్యసభకు పంపిస్తామని బీజేపీ హైకమాండ్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మన రాష్ట్రం నుంచి అవకాశం లేనప్పటికి.. బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటక నుంచి ఈటలను పెద్దల సభకు పంపిస్తారని సమాచారం. తర్వాత  కేంద్రమంత్రి పదవి ఈటలకు ఇవ్వనుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేంద్రమంత్రి హోదాలో తెలంగాణ ముఖ్యమంత్రితో తలపడేందుకు ఈటల రాజేందర్ సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. 

రెండు రోజుల క్రితం శామీర్‌పేట్‌లోని ఈటల నివాసంలో మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, తెలంగాణ జనసమితి అధినేత ప్రొ. కోదండరామ్ ఆయనతో భేటీ అయ్యారు. ఈటల బీజేపీలో చేరతారని ప్రచారం జరగుతున్న నేపథ్యంలో వీరు ఆయన్ను కలిశారు. బీజేపీలో చేరవద్దని, కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఐక్య వేదికను ఏర్పాటు చేద్దామని సూచించారట. అయితే తనపై వరుసగా కేసులు నమోదవుతుండటంతో.. వాటిని ఎదుర్కొనేందుకు కేంద్ర సర్కార్ అండగా అవసరం ఉంటుందని ఈటల భావించారని అభిప్రాయపడుతున్నారు. 

ఇక భూకబ్జా వివాదంలో ఇంతకాలం ఈటల రాజేందర్కు కు  మద్దతుగా మాట్లాడిన కాంగ్రెస్ నేతలు.. ఇకపై వైఖరి మార్చుకునే అవకాశం ఉంది. ఈటల బీజేపీలో చేరితే ఆయనను టార్గెట్ చేసే అవకాశం ఉంది. మరోవైపు బీజేపీలో చేరాలన్న ఈటల నిర్ణయంపై బీసీ సంఘాల నుంచి వ్యతిరేకత వస్తోంది. బీసీల ఆత్మగౌరవమని మాట్లాడిన ఈటల.. బీసీ వాయిస్ తో సొంత పార్టీ పెడతారని భావించామని.. కాని ఆయన తమను మోసం చేశారని కొందరు బీసీ నేతలు చెబుతున్నారు. ఆత్మగౌరవం కాదు ఆస్తుల పరిరక్షణ కోసమే ఈటల రాజేందర్ బీజేపీలో చేరుతున్నారని మరికొందరు నేతలు ఆరోపిస్తున్నారు. 

By
en-us Political News

  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆయన భారీ కాన్వాయ్‌తో అక్కడికి రావడంపై స్థానిక ప్రజలు, తెలుగుదేశం వర్గీయులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా  అంకాలమ్మ గూడూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది. 
ఇదే వేదికపై నుంచి   544.11 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన రేవంత్ రెడ్డి,  ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కూడా   ప్రారంభించారు.
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.