కేసీఆర్ రజాకార్లను మించిండు.. హరీష్ రావు మూర్ఖుడు! రెచ్చిపోయిన ఈటల రాజేందర్
Publish Date:Sep 5, 2021
.jpg)
Advertisement
తెలంగాణ ముఖ్యమంత్రి రజకార్లను మించి అరాచకాలు చేస్తున్నారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆరోపించారు. కేసీఆర్ తీరు ఇలాగే కొనసాగితే తెలంగాణలో మళ్లీ చీకటి రోజులకు, బానిసత్వానికి దారితీసే ప్రమాదం ఉందన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ గౌడ గర్జన సభలో మాట్లాడిన రాజేందర్.. కేసీఆర్, హరీశ్ రావుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాను కన్నెర్రచేస్తే మాడి మసైపోతారంటూ హెచ్చరించారు
కేసీఆర్ అప్పుడేం మాట్లాడారు... ? ఇప్పుడేం మాట్లాడుతున్నారు? అని ప్రశ్నించారు రాజేందర్. ఒకప్పుడు కేసీఆర్ మాట్లాడితే.. తెలంగాణ జాతి పులకించేపోయేది.. ఇప్పుడు ఆయన మాట్లాడితే టీవీలు బంద్ చేస్తున్నారు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నారు. పోలీసులను ప్రయోగించడం, డబ్బుల సంచులు తేవడం ఆపేసి.. తనకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో కేసీఆర్ ఆలోచించాలన్నారు ఈటల. ఇక్కడ అడ్డాపెట్టి హరీష్ రావు అనేక ఇబ్బందులు పెడుతున్నాడని మండిపడ్డారు. 20 ఏళ్ళు కలిపి పనిచేస్తే నీవు ఇక్కడ చేస్తున్నదేమిటి? యావత్ తెలంగాణ నిన్ను అసహ్యించుకుంటు థూ అంటున్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు రాజేందర్. ఇది మార్చుకుంటావా లేదా? నీ పరువు కాపాడుకుంటవా లేదా? ఆలోచించుకో హరీష్ అంటూ కామెంట్ చేశారు.
కమలాపూర్ ఎంపీపీగా ఉన్న తడకరాణికి రోజు టీఆర్ఎస్ నాయకులు ఫోను చేసి తమవైపు రావాలని టార్చర్ చేస్తున్నారని ఈటల ఆరోపించారు. రాత్రి పూట దొంగలాగా.. మా నాయకుల ఇళ్లకు పోలీసుల వాహనాల అండతో హరీశ్ వస్తున్నాడు.. సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు రాకపోతే.. పోలీసుల వాహనాలను ముందు పెట్టుకుని మా నాయకుల ఇండ్లకు వస్తున్నాడు.. ప్రగతి భవన్ లో కూర్చుని కేసీఆర్ ఆదేశిస్తే.. వాటిని ఆచరించే మూర్ఖుడు హరీశ్ రావు అంటూ ఈటల వ్యాఖ్యానించారు. మిస్టర్ హరీశ్ రావు .. ఇట్లాంటి పిచ్చివేషాలు బంద్ చేయకపోతే నీ భరతం పట్టడం ఖాయం అంటూ హెచ్చరించారు. ఇలాంటి దురగతాలను ఆపగలిగే శక్తి హుజురాబాద్ ప్రజలకు మాత్రమే ఉందన్నారు.
నీకున్న వేల కోట్ల రూపాయలను, పోలీసులను, అధికారులను బొంద పెట్టే రోజులు దగ్గర్నే ఉన్నాయని హెచ్చరిస్తున్నా అన్నారు రాజేందర్. మా సహనాన్ని, ఓపికను పరీక్షించే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు,.
ఆనాడు కత్తి ఆంధ్రోళ్లదైతే.. పొడిచేది తెలంగాణవాడని ఆనాడు కేసీఆర్ చెప్పేవాడు.. ఇప్పుడు కత్తి కేసీఆర్, హరీశ్ రావు ఇస్తే.. మనోళ్లే పొడుస్తున్నారన్నారు. పనిగట్టుకుని పరిచయాలను, కులాన్ని, చుట్టరికాన్ని ఆసరా చేసుకుని ఇండ్లకెళ్లి పట్టుకొచ్చే వాళ్ల భరతం పట్టడం ఖాయమన్నారు. తన నుంచి దూరం పోయిన నాయకుల పరిస్థితి గంజిలో ఈగ కంటే అధ్వానంగా మారింది రాజేందర్ అన్నారు.
మిస్టర్ పరకాల ఎమ్మెల్యే.. నిన్ను ప్రజలు ప్రేమతో గెలిపించారు. ఓటుకు 2 వేలు పంచి గెలిచావు.. పరకాల నియోజకవర్గంలో నేను అడ్డపెడతా ఎలా గెలుస్తావో చూస్తా..వర్ధన్నపేట, చొప్పదండి ఎమ్మెల్యేల్లారా మీ నియోజవర్గాల్లో దళిత బంధు ఇప్పిస్తున్నావా బిడ్డా.. అక్కడ దద్దమ్మ నా కొడుకులు మీరు.. ఇక్కడకొచ్చి మాట్లాడుతారా? అంటూ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మీద జరిగిన దుర్గార్మం రేపు మరికొందరిపై జరిగే అవకాశం ఉందన్నారు. కేసీఆర్ మాటలు తప్పే.. పేదల బతుకుల్లో ఏనాడు తొంగి చూడలేదని విమర్శించారు.
పేదరికానికి కులంతో పనిలేదన్న ఈటల. దళితులతో పాటు అన్ని కులాల్లో పేదలకు పది లక్షల రూపాయలు ఇవ్వాలన్నారు. దళిత సోదరుల ఖాతాల్లో పది లక్షలు జమ అయినట్లుగా మెసేజ్ వస్తోన్నా.. వాటిని స్వేచ్ఛగా ఖర్చు చేసుకునే అవకాశం ఇవ్వడం లేదని చెప్పారు. ఎవరి స్థలాల్లో వారు ఇల్లు కట్టుకునేలా డబ్బులు ఇవ్వాలన్నారు. 2014 వరకు కేసీఆర్ కు 5 కోట్ల ఖర్చు చేసే కెపాసిటీ లేకుండే.. కానీ ఇప్పుడ ఒక్క హుజురాబాద్ లోనే వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని చెప్పారు.
http://www.teluguone.com/news/content/etela-rajender-target-kcr-harish-rao-25-122527.html












