తెలంగాణలో రెండో సీఎం! ఎవరో తెలుసా... 

Publish Date:Jun 6, 2021

Advertisement

తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈటల రాజేందర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన తర్వాత రోజుకో కీలక అంశం బయటికి వస్తోంది. తాజాగా తెలంగాణలో రెండో సీఎం విషయం వెలుగులోనికి వచ్చింది. టీఆర్ఎస్ కు చెందిన ఓ సీనియర్ నేత రెండో  సీఎం గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. డిప్యూటీ ముఖ్యమంత్రి ప్రస్తుతం ఎవరూ లేరు. తొలి ప్రభుత్వంలో ఇద్దరు డిప్యుటీ సీఎంలుగా ఉన్నా.. రెండోసారి అధికారంలోకి వచ్చాకా ఆ సంప్రదాయానికి తెరదించారు గులాబీ బాస్. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు కేటీఆర్. మున్సిపల్, ఐటీ శాఖ మంత్రిగా కూడా ఉన్న కేటీఆర్.. ప్రగతి భవన్ లో కీలకంగా వ్యవహరిస్తారు. దీంతో కేటీఆర్ షాడో ముఖ్యమంత్రి అని విపక్షాలు ఆరోపిస్తుంటాయి. సీఎం కేసీఆర్ చూడాల్సిన కొన్ని కార్యక్రమాలను కూడా కేటీఆర్ చూడటం... విదేశీ ప్రతినిధులు ఆయననే కలుస్తుండటంతో విపక్షాల ఆరోపణలకు బలం చేకూరుతుంది. అయితే షాడో సీఎం అనే వ్యాఖ్యలు ఎప్పటినుంచో ఉండగా.. తాజాగా తెరపైకి వచ్చిన రెండో సీఎం అంశంమే రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. 

ఈటల రాజేందర్ నియోజకవర్గం హుజురాబాద్‌ పై టీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్ చేసింది. తమ  పట్టు కోల్పోకుండా.. నేతలు, కార్యకర్తలు చేజారకుండా జాగ్రత్తపడుతోంది. ఇందులో భాగంగానే హుజురాబాద్ టీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో ఎమ్మెల్సీ , మాజీ మంత్రి బసవరాజు సారయ్య సమావేశమయ్యారు. అందరూ టీఆర్ఎస్ వెంటనే ఉండాలని ప్రమాణం చేయించారు. హుజురాబాద్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్‌పై ఆయన విమర్శలు గుప్పించారు.ఈటలను రెండో సీఎంగా, సొంత తమ్ముడిలా కేసీఆర్ చూసుకున్నారని అన్నారు. తండ్రిలాంటి వాడిని ధిక్కరించి.. కష్టపడి గెలిపించిన తమల్ని కాదని.. ఈటల వెళ్లిపోయాడని విమర్శించారు. ఈటలను ఎవరూ బయటకు పంపలేదని.. తనకు తానుగానే వెళ్లిపోయాడని చెప్పుకొచ్చారు. బీజేపీ మతతత్వ పార్టీయని.. అలాంటి పార్టీలోకి ఈటల వెళ్లడం దారుణమని మండిపడ్డారు సారయ్య.

ఈటల రాజేందర్ రెండో సీఎం అంటూ బస్వరాజు సారయ్య చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చగా మారాయి. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా సందర్భంగా సీఎం కేసీఆర్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు ఈటల రాజేందర్. కేసీఆర్ పాలనలో మంత్రి పదవి.. బానిస కంటే దారుణంగా మారిందని విరుచుకుపడ్డారు. ప్రగతిభవన్ పేరును 'బానిసల నిలయం'గా మార్చుకోవాలని విమర్శలు గుప్పించారు. ఒక్క మంత్రి పదవి ఇచ్చి బానిసలా బతకమంటే.. తాను బతకలేనని ఈటల స్పష్టం చేశారు. తాను బానిసలా ఉండలేకే బయటికి వచ్చానని ఈటల ఆరోపిస్తుండగా.. కేసీఆర్ రెండో సీఎంగా ఈటలను చూశారని సారయ్య చెప్పడం ఆసక్తి రేపుతోంది. 

By
en-us Political News

  
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆయన భారీ కాన్వాయ్‌తో అక్కడికి రావడంపై స్థానిక ప్రజలు, తెలుగుదేశం వర్గీయులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా  అంకాలమ్మ గూడూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది. 
ఇదే వేదికపై నుంచి   544.11 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన రేవంత్ రెడ్డి,  ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కూడా   ప్రారంభించారు.
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.