రావల్ కోల్ లో ముదిరాజ్ భూమి కబ్జా! మరో వివాదంలో ఈటల ఫ్యామిలీ

Publish Date:May 23, 2021

Advertisement

అప్పుడు ఈటల రాజేందర్... ఇప్పుడు ఈటల నితిన్ రెడ్డి... అప్పుడు మెదక్ జిల్లా అచ్చంపేట.. ఇప్పుడు మెదక్ జిల్లా రావల్ కోల్. అప్పుడు.. ఇప్పుడు భూకబ్జా ఆరోపణలే. ఆసైన్డ్ ల్యాండ్ భూములను కబ్జా చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ మాజీ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మెడకు మరో వివాదం చుట్టుకోంది. ఈటల రాజేందర్ తనయుడు నితిన్ రెడ్డిపై ఓ రైతు భూ కబ్జా ఆరోపణలు చేశారు. ఏకంగా ముఖ్యమంత్రికే ఫిర్యాదు చేశాడు. 

మాజీ మంత్రి ఈటల రాజేందర్ కుమారుడు నితిన్ రెడ్డి తన భూమిని కబ్జా చేశాడ‌ని ఓ యువ‌కుడు ఫిర్యాదు చేశాడు. తనకు న్యాయం చేయాలని కోరుతూ సీఎం కేసీఆర్‌కు  మేడ్చల్ లోని రావల్ కోల్ గ్రామ నివాసి పీట్ల మహేశ్‌ ముదిరాజ్ లేఖ ద్వారా ఫిర్యాదు చేశాడు. సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో మహేష్ పలు అంశాలను పేర్కొన్నాడు.బాధితుడు మహేష్‌ ఫిర్యాదుపై స్పందించిన సీఎం కేసీఆర్‌.. తక్షణమే దార్యాప్తు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ను ఆదేశించారు. ఏసీబీ‌, రెవిన్యూ శాఖలు సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. తన భుమిని ఇనాం భూమిగా చూపుతూ కొనుగోలు చేసి ఇప్పుడు తమను ఆ భూమిలోకి రాకుండా బెదిరిస్తున్నారని మహేష్‌ బుధవారం మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌, కీసర ఆర్డీఓ కార్యాలయాల్లో ఫిర్యాదు చేశారు. 

తెలంగాణ‌లో ఈటల రాజేంద‌ర్ భూకబ్జా వ్య‌వ‌హారం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఈటల రాజేందర్ మెదక్‌ జిల్లా అచ్చంపేట, హకీంపేటలో భూకబ్జాకు పాల్పడ్డారనే ఆరోపణలపై ప్రభుత్వం విచారణ జరుపుతోంది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈటల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి తొలగించారు. ఈటల రాజేందర్‌పై పలువురు రాష్ట్ర మంత్రులు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ఎమ్మెల్యే పదవికి ఖచ్చితంగా రాజీనామా చేస్తానని.. ఈటల రాజేందర్ ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. కరోనా ముగిసిన తర్వాతే ఆ నిర్ణయం ఉంటుందని ఆయన తెలిపారు. ఈటల రాజీనామా చేస్తే... అక్కడ జరిగే ఉప ఎన్నికల్లో ఆయనను ఓడించాలనే ప్రణాళికలు రచిస్తోంది టీఆర్‌ఎస్. స్థానిక టీఆర్‌ఎస్ నేతలు ఎవరూ ఈటలకు మద్దతుగా నిలవకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ బాధ్యతలను టీఆర్‌ఎస్ అధిష్టానం పలువురు పార్టీ ముఖ్య నేతలకు అప్పగించినట్టుగా ప్రచారం జరుగుతోంది. 

తాజాగా ఈటల కుమారుడు కూడా భూ క‌బ్జాకు పాల్ప‌డ్డాడ‌ని ఫిర్యాదు రావ‌డం సంచలనంగా మారింది. ఈటల రాజేందర్ కొడుకుపై భూ కబ్జా  ఫిర్యాదు రావడం.. సీఎం విచారణకు ఆదేశించడం చకాచకా జరిగిపోయాయి.  ముదిరాజు బిడ్డనైన తనను సీఎం కేసీఆర్ కావాలనే టార్గెట్ చేశారని పదే పదే ఆరోపిస్తున్నారు రాజేందర్. తనది ఆత్మగౌరవ పోరాటమని చెబుతున్నారు. తాజాగా ఈటల తనయుడిపై భూకబ్జా ఆరోపణలు చేసింది ముదిరాజ్ యువకుడే కావడం ఆసక్తిగా మారింది. ముదిరాజునని గొప్పగా చెప్పుకునే రాజేందర్... ముదిరాజ్ వ్యక్తి భూములను కబ్జా చేసినట్లు ఆరోపణలు రావడంపై రాజకీయ వర్గాల్లోనూ చర్చగా మారింది. పిట్ల మహేశ్ ముదిరాజ్ అంశం.. ఈటలకు కొంతగా ఇబ్బందిగా మారవచ్చని భావిస్తున్నారు.  

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.