సొంత గడ్డలో ఈటలకు బిగ్ షాక్! హుజూరాబాద్ లో ఏం జరుగుతోంది..?

Publish Date:Jun 21, 2021

Advertisement

కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరారు. కమలం నేతలతో కలిసి కేసీఆర్ టార్గెట్ గా దూకుడు పెంచారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల.. సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్నాురు. రోజుకో రెండు, మూడు గ్రామాలు తిరుగుతూ తన మద్దతుదారులతో బలప్రదర్శన చేస్తున్నారు రాజేందర్. అటు టీఆర్ఎస్ కూడా హుజురాబాద్ పై స్పెషల్ ఫోకస్ చేసింది. కేసీఆర్ ఆదేశాలతో మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో తిరుగుతూ.. గులాబీ కేడర్ చేజారకుండా చూస్తున్నారు. దీంతో హుజురాబాద్ రాజకీయాల్లో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. ఏ లీడర్ ఎవరికి పక్షాన ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. సమీకరణలు రాత్రికి రాత్రే మారిపోతున్నాయి. ఇవాళ ఈటలతో ఉన్నవారు.. మరుసటి రోజు టీఆర్ఎస్ సమావేశంలో ప్రత్యక్షమవుతున్నారు. కారు పార్టీలోనే ఉంటామన్న వారు తెల్లారేసరికి ఈటల క్యాంపులో కనిపిస్తున్నారు. 

తాజాగా మరో కీలక పరిణామం హుజురాబాద్ నియోజకవర్గంలో చోటు చేసుకుంది. ఈటల రాజేందర్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న కొందరు నేతలు... ఆయనకు హ్యాండ్ ఇచ్చారని తెలుస్తోంది. ఢిల్లీ వెళ్లే వరకు ఈటల వెంట నేతలు.. కొందరు కీలక నేతలు ఆయనతో టచ్ లోకి రావడం లేదంటున్నారు. ఈటల రాజేందర్‌కు ఆయన సన్నిహితుడు ఒకరు షాకిచ్చినట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్‌లో చేరి ఈటలకు ప్రధాన అనుచరుడిగా వ్యవహరించిన జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి ఈటలకు దూరమయ్యారని తెలుస్తోంది.  ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఈటల వద్దకు కూడా వెల్లకుండా తుమ్మెటి తన ఇంటికే పరిమితం అయ్యారట.  నాలుగు రోజులుగా రాజేందర్ హుజురాబాద్‌లోనే ఉన్నా.. తుమ్మేటి సమ్మిరెడ్డి ఆయనను కలవలేదని చెబుతున్నారు. 

ఈటలకు ప్రధాన అనుచరుడిగా ఉన్న సమ్మిరెడ్డి సడెన్ గా సైలెంట్ కావడంపై నియోజకవర్గంలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. పార్టీలో చేరే సమయంలో బీజేపీ జాతీయ నాయకుల వద్దకు వెల్లిన ఈటల.. తన వెంట సమ్మిరెడ్డిని తీసుకెళ్లకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. కాషాయం కండువా కప్పుకునేందుకు జాతీయ నాయకుల వద్దకు వెళ్లే జాబితాలో సమ్మిరెడ్డి పేరు లేకపోవడంతో ఆయన మనస్థాపానికి గురైనట్టు సమాచారం. కొవిడ్ కారణంగా ఈటల వెంట వచ్చిన వారందరినీ లోపలకు రావద్దని కేవలం 25 మంది మాత్రమే రావాలని బీజేపీ నాయకులు సూచించారు. ఇందుకు సంబంధించిన జాబితాను ఈటల బీజేపీ నాయకులకు పంపించారు. ఈ లిస్ట్‌లో తుమ్మేటి పేరు లేకపోవడం చూసి షాక్‌కు గురైన ఆయన ఢిల్లీ నుండి వచ్చిన తరువాత నేరుగా జమ్మికుంటకు వెళ్లిపోయారు. అప్పటి నుండి ఈటలతో టచ్‌లో ఉండటం లేదని తెలుస్తోంది.

బీజేపీలో చేరిన తరువాత తొలిసారిగా హుజురాబాద్‌కు వచ్చిన ఈటలను  కూడా సమ్మిరెడ్డి కలవలేదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.  సమ్మిరెడ్డి ఎందుకు రావడం లేదన్న విషయంపై ఈటల కూడా అంతగా పట్టించుకోకపోవడంతో.. ఆయన మరింతగా బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై సమ్మిరెడ్డి తన సన్నిహితుల వద్ద బాధ పడుతున్నట్టుగా తెలిసింది. ఇంత జరిగినా ఈటల నుండి మాత్రం పిలుపు రాకపోవడం ఏమై ఉంటుందా అని సమ్మిరెడ్డి వర్గీయులు చర్చించుకుంటున్నారు. ఏదీ ఏమైనా ఈటల బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్న తరువాత నుండి మారిపోయారన్న అభిప్రాయాలు కూడా వారు వ్యక్తం చేస్తున్నారు. ఈటలతో సమ్మిరెడ్డి దూరంగా ఉంటున్నారని తెలుసుకున్న గులాబీ లీడర్లు ఆయనతో చర్చలు జరిపారని తెలుస్తోంది. త్వరలోనే ఆయన తిరిగి కారెక్కనున్నారని సమాచారం. సమ్మిరెడ్డి బాటలోనే మరికొందరు ఈటల అనుచరులు.. టీఆర్ఎస్ ముఖ్యలతో టచ్ లోకి వెళ్లారని అంటున్నారు. రాబోయే రోజుల్లో హుజురాబాద్ నియోజకవర్గంలో మరిన్ని కీలక పరిణామాలు ఉంటాయనే చర్చ జరుగుతోంది. 

By
en-us Political News

  
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన అధిష్టానం.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.