ఈటల రూటెటు?

Publish Date:Dec 30, 2023

Advertisement

ఈటల రాజేందర్ తెలంగాణ రాజకీయాలలో పరిచయం అక్కర్లేని పేరు. వామపక్ష భావజాలం ఉన్న ఈటల తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) లో చేరి కేసీఆర్ తో కలిసి నడిచారు. రాష్ట్ర విభజన తరువాత ఏర్పడిన తొలి ప్రభుత్వంలో ఈటల కేసీఆర్ కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు. బీఆర్ఎస్ (అప్పడు టీఆర్ఎస్) వరుసగా రెండో సారి గెలిచిన తరువాత ఈటలను కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా దూరం పెట్టారు. అయితే  ఆ తరువాత కేబినెట్ లోకి తీసుకుని ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు కూడా అప్పగించారు.

అయితే   పార్టీ అధినేతో విభేదాలు మాత్రం ముదిరిపోయాయి. చివరకు ఆయన బీఆర్ఎస్ (టీఆర్ఎస్) నుంచి బయటకు వచ్చి బీజేపీ గూటికి చేరారు. అయితే ఈటల బీజేపీలో చేరడంపై ఆయన గురించి తెలిసిన వారంతో అప్పట్లో విస్తుపోయారు. ఈటల బీజేపీలో ఇమడటం సాధ్యం కాదన్న అనుమానాలు అప్పట్లో బలంగా వ్యక్తం అయ్యాయి. అయితే ఆయన బీజేపీలో కొనసాగారు. ఇమిడారు. సర్దుకుపోయారు. పోరాడారు. మొత్తంగా బీజేపీలో అత్యంత కీలక నేతగా ఎదిగారు. కానీ ఈటల బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి బీజేపీ తీర్ధం పుచ్చున్న నాటి నుంచీ కూడా వామపక్ష బావజాలం ఉన్న ఆయన బీజేపీలో ఎలా ఇముడుతారన్న సందేహాలే వ్యక్తం అయ్యాయి. అందుకు తగ్గట్టుగానే బీజేపీలో ఈటల పలు మార్లు ఉక్కపోతకు గురయ్యారు. రాజీనామా చేసి బయటకు వచ్చేస్తున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆయన బీజేపీలో కొనసాగారు. ఆ పార్టీ చేరికల కమిటీకి నేతృత్వం వహించారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో స్టార్ క్యాంపెయినర్ గా కూడా వ్యవహరించారు.

అన్నిటికీ మించి బీజేపీ హై కమాండ్ ఆయన కోరినట్లుగా గజ్వేల్ లో కేసీఆర్ కు ప్రత్యర్థిగా పోటీ చేసే అవకాశం ఇచ్చింది. అదే సమయంలో ఆయన సొంత నియోజకవర్గం నుంచి కూడా సేఫ్ సైడ్ గా పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చింది. సాధారణంగా బీజేపీలో ఒకే వ్యక్తికి రెండు స్థానాల నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వడం చాలా అరుదు. అయితే ఈటల రెండు స్థానాల నుంచీ పరాజయం పాలు కావడంతో పార్టీలో ఆయన హవా తగ్గిందని అంటున్నారు.  

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో పరాజయంపాలైన ఆయన కేసీఆర్ ను ఢీ కొనే  సందర్భంలో  సొంత నియోజకవర్గంపై ఫోకస్ పెట్టలేకపోయాననీ అందుకే రెండు చోట్లా పరాజయం ఎదురైందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలనీ, అది కూడా బీజేపీకి కొంత బలం ఉన్న మల్కాజ్ గిరి స్థానం నుంచి పోటీ చేస్తాననీ, పార్టీ టికెట్ ఇవ్వాలనీ అంటున్నారు. అయితే ఇందుకు బీజేపీ హై కమాండ్ సుముఖంగా స్పందించలేదని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం పాలైన పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కు కరీంగన్ స్థాన నుంచి పోటీ చేసేందుకు ఇప్పటికే హై కమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందనీ, అయితే ఈటల విషయంలో మాత్రం నిర్ణయం తీసుకోలేదనీ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.  

తొలి నుంచీ ఈటలకు బీజేపీలోని ఒక బలమైన వర్గం వ్యతిరేకంగా పని చేస్తున్నది. అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసిన రెండు స్థానాల నుంచీ పరాజయం పాలైన తరువాత ఈటలకు ఆ వర్గం సెగ మరింత ఎక్కువైంది. ఆ వర్గమే అధిష్ఠానం వద్ద ఈటలకు లోక్ సభ టికెట్ విషయంపై గట్టిగా అభ్యంతరం చెబుతోంది.  ఇక ఈటల విషయానికి వస్తే ఆయన లోక్ సభకు పోటీ చేసి గెలిస్తేనే రాజకీయంగా నిలదొక్కుకోగలుగుతారు. బీజేపీ టికెట్ ఇవ్వకపోయినా, ఒక వేళ ఇచ్చినా పోటీ చేసి ఓడిపోయినా ఈటల రాజకీయ భవిష్యత్ కు ఫుల్ స్టాప్ పడినట్టే.

అందుకే ఈటల ఈ సారి ఒకింత సేఫ్ స్థానమైన మల్కాజ్ గిరి నుంచి పోటీ చేయాలని గట్టిగా భావిస్తున్నారు. ఒక వేళ పార్టీ నిరాకరిస్తే బీజేపీ నుంచి బయటకు రావడానికి కూడా ఆయన వెనుకాడే పరిస్థితి లేదు. అందుకే ఈటల బీజేపీ వీడి కాంగ్రెస్ గూటికి చేరు అవకాశాలున్నాయని అంటున్నారు. ఈటల ఈ వార్తలను కొట్టిపారేసినప్పటికీ ఆ దిశగా ప్రచారం మాత్రం కొనసాగుతూనే ఉంది. మరి ఈటల విషయంలో బీజేపీ హై కమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

By
en-us Political News

  
జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏమాట‌కామాట నాదెండ్ల‌, ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ జీవితాన్ని మ‌లుపు తిప్పిన వారే.
కార‌ణం విజ‌య్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప‌రీక్ష‌కు నిల‌ప‌డంతో.. ఇతర న‌టుల పార్టీలు, అవి తొలి సారి ఎన్నిక‌ల్లో పాల్గొన్న‌పుడు సాధించిన ఓట్ల శాతం ఎంత‌? అన్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేచింది.
ప‌సుపు ఒక మ‌హిళ‌కు ఎంత ముఖ్య‌మో తెలిసిందే. ఆపై నీలం అంటే ద‌ళిత సందేశం ఇస్తుంది. ఇక పోతే ఆకుప‌చ్చ అంటే అది భార‌త జెండాలో ఒక భాగం. ముస్లీం మైనార్టీల‌ను ఏకం చేసేది. కాబ‌ట్టి క‌విత జెండా రంగుల్లో ఇవి ప్ర‌ముఖంగా ఉండొచ్చ‌ని తెలుస్తోంది. దీంతో క‌విత ప్ర‌క‌టించ‌బోయే పార్టీ జెండా రంగులు, గుర్తు ఆల్రెడీ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నారు.
బెంగాల్ ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే, ఓటింగ్ శాతం క్రమంగా పెరుగుతూ వస్తోంది. 1969లో కేవలం 70 శాతంగా ఉన్న ఓటింగ్, 1987 నాటికి 78 శాతానికి చేరింది. ఆ తర్వాత 1996లో 80 శాతం, 2011లో 84 శాతంగా నమోదైంది. గత 2021 ఎన్నికల్లో 82 శాతానికి పరిమితమైన ఓటింగ్.. ఇప్పుడు 2026లో ఏకంగా 92 శాతాన్ని దాటి సరికొత్త రికార్డును సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు జగిత్యాల వేదికగా జరిగిన సభ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాజకీయ చరిత్రను పరిశీలిస్తే నాదెండ్ల భాస్కరరావుకు, చంద్రబాబు నాయుడుకు మధ్య సుదీర్ఘమైన రాజకీయ వైరం ఉంది. 1984లో ఎన్టీఆర్ అమెరికా వెళ్లిన సమయంలో జరిగిన రాజకీయ పరిణామాలు, ఆపై నాదెండ్ల ముఖ్యమంత్రి కావడం వంటి సంఘటనలు తెలుగు రాజకీయాల్లో ఒక కీలక మలుపు. ఆ సమయంలో ఎన్టీఆర్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు.
న్టీఆర్ అమెరికాలో గుండె ఆపరేషన్ చేయించుకుని తిరిగి వచ్చేలోపు, నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ క్లిష్ట సమయంలో తెలుగుదేశం పార్టీ చెల్లాచెదురు కాకుండా, ఎమ్మెల్యేలను ఏకం చేయడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. పార్టీని కాపాడిన రక్షకుడి ఇమేజ్ ఆయనకు అప్పుడే వచ్చింది.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిథి స్టాలిన్, టీవీకే అధినేత విజయ్, బీజేపీ నాయకురాలు ఖుష్బు, కమల్ హాసన్, రజనీకాంత్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
విజయ్ రాజకీయాల్లోకి రావడాన్ని చంద్రబాబు స్వాగతిస్తూనే.. ప్రజా సేవ చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చే ఎవరినైనా ఆహ్వానించాల్సిందేనన్నారు. అయితే సినిమాల్లో ఉన్న ఇమేజ్ రాజకీయాల్లో రాణించడానికి సరిపోదనీ, రాజకీయాలలో పట్టుదల, సహనం చాలా ముఖ్యమన్న చంద్రబాబు.. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకువచ్చారు.
విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వైసీపీ పరిస్థితిని గమనిస్తే నేతల మధ్య సఖ్యత లేదన్న విషయం ప్రస్ఫుటంగా తెలుస్తుంది. పార్టీలో కీలక నేతలు ఉన్నప్పటికీ, వారంతా సమష్టిగా కాకుండా ఎవరికి వారే యమునా తీరే అన్న చంద్రంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పార్టీ కేడర్‌ అయోమయంలో పడింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ చార్జ్‌గా కన్నబాబు నియామకం తరువాత స్థానిక నేతల నుంచి ఆయనకు ఏ మాత్రం సహకారం అందడం లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.