గిట్టుబాటు ధర లేక రైతులు,నిత్యావసరాల ధరలు పెరిగి వినియోగదారులు దోపిడీకి గురవుతున్నారు. ఇందుకు కారణం దేశంలో సరైన మార్కెట్ వ్యవస్థ లేకపోవడమే. ఈ కారణంగానే ఇటు ప్రజలు, అటు ప్రభుత్వాలూ కూడా నష్టపోతున్నాయి. ప్రభుత్వం దళారీ వ్యవస్థ ను రూపుమాపలేకపోతోంది. దళారీల నుంచి ప్రజలను రక్షించాల్సిన ప్రభుత్వం ఆ పని చేయడం మానేసి ఖజానా నింపుకోవడానికి జీఎస్టీ పేరుతో ప్రజల నడ్డి విరుస్తోంది. ద్రవ్యోల్బణం అదుపు చేయలేక పోవడంతో సామాన్యుడిపై రోజు రోజుకూ ధరల భారం పెరుగుతోంది.
దాదాపు ఏడాది కాలంగా ద్రవ్యోల్బణం పెరుగుతూ ప్రజల కొనుగొలుశక్తిని క్షీణింప చేసింది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం 7.1శాతంగా ఉంది. నిత్యావసరాలపై జీఎస్టీ భారం పెరగడంతో మధ్యతరగతి, బడుగు జీవుల పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగంభోట్టు అన్నట్లుగా తయారౌతోంది. కుటుంబ ఖర్చులు పెరిగిపోయి మధ్యతరగతి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నది. కుటుంబరుణాలు జీడీపీలో 6.4 శాతానికి చేరాయి. ఆర్బీఐ గణాంకాల ప్రకారమే భారతీయ కుటుంబాల ఆదాయాలు తగ్గి,రుణాలు పెరుగుతున్నాయి. తాకట్టు రుణాలు 56 శాతం పెరిగాయి. వీటిలో 30శాతం డీఫాల్ట్ గా మారుతున్నాయి. రూపాయి మారకపు విలువ కనిష్ట స్థాయికి చేరడంతో విదేశీ ద్రవ్య నిల్వలు అడుగంటిపోతున్నాయి. ప్రపంచంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతోందని చెప్పుకునే కేంద్రంలోని మోడీ సర్కార్.. ప్రజల ఆర్థిక పతనాన్ని పట్టించుకోవడం లేదు. షేర్లు, కార్పొరేట్లు అంటూ సంపన్న వర్గాల ప్రయోజనాలే పరమావధి అన్నట్లుగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ప్రపంచంలో అత్యధికంగా జీఎస్టీ విధించే దేశంగా భారత్ అగ్రభాగంలో నిలబడింది.
ఒకేదేశం,ఒకే పన్ను అంటూ జీఎస్టీ విధానాన్ని ప్రవేశపెట్టిన మోడీ సర్కార్ ఈ విధానంలోని లోటుపాట్లను సరిదిద్దే విషయంలో మాత్రం ముందుకు రావడం లేదు. పెట్రోల్,డిజిల్ లను జీఎస్టీ పరిధిలో తీసుకురావాలన్న ప్రతిపక్షాల డిమాండ్ ను పెడచెవిన పెడుతోంది. సెస్సు,సుంకాలపేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎడాపెడా బాదేస్తూ ప్రజలపై మోయలేని భారం వేస్తున్నాయి. ఇక తమది రైతు సంక్షేమ ప్రభుత్వం అని సొంత భుజాలు చరిచేసుకుంటున్న కేంద్రంలోని మోడీ సర్కార్ ఎరువులు ధరలు విపరీతంగా పెరుగుతున్నా వాటి నియంత్రణకు చర్యలు తీసుకోలేదు సరికదా డీఏపీ కి సబ్సిడీ ఎత్తివేసే ఆలోచన చేస్తున్నది. ఇక బియ్యం అయితే పండిచిన రైతుకూ, కొనుగోలు చేసే వినియోగదారులకూ కూడా చుక్కలు చూపిస్తోంది. పండించిన రైతుకు గిట్టుబాటు ధర లభించడం లేదు. బియ్యాన్ని మార్కెట్లో కొనుగోలు చేసే వినియోగదారుడికి మాత్రం ధరా భారం నడ్డి విరిచేస్తున్నది. బ్రాండ్ల పేరుతో 25కేజీలు రూ.1600 పైగా అమ్ముతున్నారు. అలాగే పప్పుల ధరలు రైతులకు మేలు చేయలేకపోయినా వినియోగదారులకు మాత్రం చుక్కలు చూపుతున్నాయి. ఏ పప్పు అయినా కేజీ ధర 100 నుంచి 200వరకూ ఉన్నాయి. ఇక కూరగాయల విషయానికి వస్తే ఏ కూరగాయ కొనాలన్నా కిలో రూ.60నుంచి 100 వరకూ వెచ్చించాల్సిందే.
గత 8 నెలలలో నిత్యావసర సరుకుల ధరలు సగటున 50 శాతంపైగా పెరిగాయని ఒక అంచనా. ప్రభుత్వాలు ద్రవ్యోల్బణం తగ్గడానికి, నిత్యావసర ధరలు అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ పెరుగుతున్నది. జాతీయ మార్కెట్ వ్యవస్థ అభివృద్ధి చేయక పోవడం వల్లనే దళారులు చెలరేగిపోతున్నారు. వినియోగదారుడికీ, రైతుకీ కూడా నష్టం కలగడమే కాకుండా, ప్రభుత్వ ఆదాయానికీ గండి పడుతున్న పరిస్థితి నుంచి బయటపడాలంటే కేంద్రం జీఎస్టీ బాదుడుపై కాకుండా జాతీయ మార్కెట్ వ్యవస్థ అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. ఒకే దేశం ఒకే పన్ను అని మాత్రమే కాకుండా ఒకే దేశం.. ఒకే ధర అన్న విధానాన్ని అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/essential-commodities-prices-high-25-190849.html
జీవన్ రెడ్డి, కేటీఆర్ లు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్ సూచన మేరకే సహచరులతో కలిసి జీవన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానిం చేందుకు ఆయన నివాసానికి వచ్చినట్లు చెప్పారు. 2014 ఎన్నికలకు ముందే కేసీఆర్ జీవన్ రెడ్డిని బీఆర్‌ఎస్‌లో చేరాలని ఆహ్వానించారన్నారు.
ల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవిపై ఎన్నికల అక్రమాల ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మిరాకిల్ సాఫ్ట్ వేర్ సంస్థ ద్వారా ఉద్యోగుల ఖాతాల్లో భారీగా నగదు జమ చేసి.. ఆ నగదును ఎన్నికల ఖర్చులకు మళ్లించారనే ఫిర్యాదు ఈసీకి చేరింది. దీనిపై సమగ్ర విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక వేళ ఆ ఆరోపణలు నిజమని రుజువైతే.. ఆమె పదవికి ముప్పు ఉండొచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కడప జిల్లా నేతలలైన పుట్టా సుధాకర్, వరదరాజులు రెడ్డి, మాధవి రెడ్డిపై లోకేష్ ఫైరయ్యారు. ఈ నెల మొదటి వారంలో జరిగిన సమీక్షలో, నారా లోకేష్ కడప జిల్లా నేతలపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా ఫిర్యాదుల విన్నపం కార్యక్రమాలకు ఈ నేతలు హాజరుకాకపోవడంపై నిలదీసినట్లు చెబుతున్నారు.
రాజకీయాల్లో నిరంతరం ఉండే సవాళ్లు, మానసిక ఒత్తిడి కారణంగానే తాను దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడ్డానన్న రోజా.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తనకు బ్లడ్ ప్రషర్ సమస్య వచ్చిందనీ, ఇక రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిని అయిన తరువాత డయాబెటిస్ అటాక్ అయ్యిందనీ వివరించారు.
కష్టపడిన వారిని గుర్తించాలనేది పార్టీ సిద్ధాంతం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.
మావిగన్ ప్రతిపాదనతో జగన్ నెటిజనులకు ఒక ట్రోల్ మెటీరియల్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రతిపాదనపై లెక్కలేనన్న మీమ్స్, సెటైర్లు నెట్టింట వెల్లువెత్తాయి. అయినా కూడా జగన్ తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్న చందంగా మావిగన్ ను మించిన రాజధాని ఉండనే ఉండదన్నట్లు మాట్లాడుతున్నారు. అయితే ఇదే మావిగన్ ను ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఎందుకు ముందుకు తీసుకురాలేదన్న ప్రశ్నకు మాత్రం జగన్ సమాధానం ఇవ్వడం లేదు.
కేరళలోని మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు, పుదుచ్చేరిలోని 30 స్థానాలకు రేపు ఒకేసారి ఓటింగ్ నిర్వహించనున్నారు. అలాగే అస్సాంలో 126 స్థానాలకూ కూడా ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. గతంలో బహుళ విడతల్లో ఎన్నికలు జరిగినప్పటికీ, ఈసారి మాత్రం ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు.
సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు నేపథ్యంలో విజయవాడలోని లోకో పైలట్ల గాలా(సికింద్రాబాద్) డిపోను తరలించకుండా విజయవాడలోనే కొనసాగించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆ డిపో సిబ్బంది మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. విజయవాడ బోర్డును కొండపల్లి నుంచి మోటమర్రికి పెంచడం వల్ల గత 17 ఏళ్లుగా విజయవాడలో ఉన్న సికింద్రాబాద్(గాలా) డిపో ఉనికి సందిగ్ధంలో పడిందని, డిపోను మోటమర్రికి లేదా డోర్నకల్ కు తరలిస్తారనే ప్రచారంతో సుమారు 500 కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయనే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరుకుంది.
సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కిద్వాయ్, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలిగా గుర్తింపు పొందారు. మోహ్సినా కిద్వాయ్ అంత్యక్రియలు ఢిల్లీలోని నిజాముద్దీన్ స్మశాన వాటికలో బుధవారం (ఏప్రిల్ 8) సాయంత్రం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
జగన్ చుట్టపుచూపుగా రాష్ట్రానికి వస్తున్నారు. అడపాదడపా పరామర్శలంటూ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో వినా మిగిలిన సమయంలో రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఉనికి మాత్రంగానే మారింది. గత ఎన్నికలలో వైసీపీ కేవలం 11 స్థానాలలో మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే. ఆ గెలిచిన స్థానాలలో కూడా వెసీపీ స్తబ్దుగానే ఉంది. అయితే మచిలీపట్నంలో మాత్రం వైసీపీ హడావుడి ఒకింత ఎక్కువగా ఉంది.
ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన జనసేన నేతలు ద్వారంపూడిపై చర్యల తీసుకోవాల్సిందే అని ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవినీతి బండారాన్ని బట్టబయలు ప్రభుత్వం పకడ్బందీగా అడుగులు వేస్తున్నదని అంటున్నారు. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌లో ద్వారంపూడికి ఉన్న పట్టును సడలించడం ద్వారా ఆయన ప్రాభవాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అంబటి రాంబాబును కొద్ది రోజుల కిందట గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే.. ఆ సమయంలో పోలీసు స్టేషన్‌లో తనను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ అంబటి రాంబాబు తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.