మేనిఫెస్టో చించి వార్తల్లో నిలిచి..

Publish Date:May 4, 2023

Advertisement

 కర్ణాటకలో ఈ నెల 10న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అయితే కాంగ్రెస్ , బీజేపీలు తమ తమ మేనిఫెస్టోలో విడుదల చేశాయి. మేనిఫెస్టోలో బూటకపు హామీలు, వాగ్దానాలు ఉంటే ప్రత్యర్థుల చేతికి కొబ్బరి చిప్ప దొరికినట్టే.

 ఆరోపణలు ,  ప్రత్యారోపణలు  షరా మామూలే. కానీ ప్రత్యర్థి పార్టీ మేనిఫెస్టో ను ఏకంగా చింపి వేయడం అరుదు. గురువారం అదే జరిగింది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి యడ్యూరప్ప మంత్రి వర్గంలో డిప్యూటి సీఎంగా పని చేసిన ఈశ్వరప్ప  కాంగ్రెస్ మేనిఫెస్టోను చించివేశారు. ఆయన ముఖ్యమంత్రి యడ్యూరప్ప మంత్రివర్గంలో కీలక బాధ్యతలు నిర్వహించారు .  భజరంగ్ దళ్ విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్న కారణంగా ఆ సంస్థను తాము అధికారంలో రాగానే నిషేధిస్తామని కాంగ్రెస్ ఎన్నికల వాగ్దానంలో పేర్కొంది.  సీనియర్ బీజేపీ నేత అయిన ఈశ్వరప్పకు ఇది రుచించలేదు. హడావిడిగా మీడియాను పిలిచి మేనిఫెస్టోను చించి వేసి వార్తల్లో నిలిచారు. భజరంగ్ దళ్ కాంగ్రెస్ పార్టీని తూర్పారబట్టింది. కానీ బిజేపీ ఒక అడుగు ముందుకు వేసి ఏకంగా మేనిఫెస్టోను చించివేయడం చర్చనీయాంశమైంది. 
ఎమర్జెన్సీ సమయంలో ఆయన బళ్లారి జైల్లో గడిపారు. ఎమర్జెన్సీ అయిపోయాక ఆయన రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు. షిమాగో నియోజకవర్గంలో భారతీయ జనతాపార్టీ తొలిసారి విజయం పొందడానికి ఈశ్వరప్ప ప్రధాన కారణం. ప్రభుత్వ ప్రాజెక్టుల్లో కమీషన్లు కావాలని  కాంట్రాక్టర్లను ఈశ్వరప్ప వేధించేవారని ఆరోపణలు ఉన్నాయి. విహెచ్ పి, ఆర్ ఎస్ ఎస్ లలో ఆయన ముఖ్య భూమిక వహించారు. రైట్ వింగ్ సంస్థలతో ఆయన దశాబ్దాల పాటు మమేకం అయి పని చేశారు. మధుర, కాశీ టెంపుల్స్ విధ్వంసం జరిగినప్పుడు ఈశ్వరప్ప విద్వేష ప్రసంగాలను చేసినట్టు ఆరోపణలున్నాయి. 

By
en-us Political News

  
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
భారతీయ చలనచిత్ర పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో అత్యంత వైభవంగా జరిగింది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
సినిమా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ప్రముఖ సినీనటి రాధ తన కుటుంబ సభ్యులపై చెన్నై పోలీసులను ఆశ్రయించారు.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
పెళ్లంటే సంబరమా.. అప్పుల భారమా? రూ.45 లక్షల లోన్‌పై నెటిజన్ ఆవేదన..!
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.