Publish Date:Jun 25, 2026
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రతిష్ఠను మసకబార్చిన ఎన్ స్టీన్ ఫైల్స్ కు సంబంధించి సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. వాటిని స్వయంగా బిల్ గేట్స్ వెల్లడించడం విశేషం. లైంగిక నేరాలతో ప్రపంచవ్యాప్తంగా అపఖ్యాతి పాలైన జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో తనకున్న సంబంధాలపై , బిల్ గేట్స్ తొలి సారి బాహాటంగా చెప్పారు. అమెరికా కాంగ్రెస్ ప్యానెల్ ఎదుట ఈ నెల 10న జరిగిన రహస్య విచారణలో బిల్ గేట్స్ వాంగ్మూలం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తన వ్యక్తిగత జీవితంలోని బలహీనతలను, రహస్యాలను అడ్డం పెట్టుకుని జెఫ్రీ ఎప్‌స్టీన్ తనను బ్లాక్‌మెయిల్ చేసినట్టు బిల్ గేట్స్ వెల్లడించారు. ఈ సందర్భంగానే.. గేట్స్ తన వ్యక్తిగత జీవితంలో ముగ్గురు మహిళలతో ఎఫైర్స్ ఉన్నాయని అంగీకరించాడు.
ఈ ఎఫైర్లు.. తన వివాహం తరువాత కూడా కొనసాగించినట్లు అంగీకరించాడు. రష్యాకు చెందిన ప్రముఖ బ్రిడ్జ్ ప్లేయర్ మిలా ఆంటోనోవా, న్యూక్లియర్ ఫిజిసిస్ట్ కరిమా నిగ్మటులినాతో తనకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని, ఆ విషయాలన్నీ ఎప్‌స్టీన్‌కు తెలుసని చెప్పిన బిల్ గేట్స్.. వీరిద్దరితో పాటు మెడికల్ ఆంట్రప్రెన్యూర్ ఆలిస్ జాకబ్స్ నెస్సెల్‌రోడ్ట్‌తో కూడా తనకు ఎఫైర్ నడిచిందని అంగీరించాడు. ఈ ముగ్గురు మహిళలతో ఉన్న సంబంధాల గురించిన గుట్టును ఆయుధంగా మార్చుకుని.. తనను ఎన్ స్టీన్ బ్లాక్ మెయిల్ చేశాడన్న సంచలన నిజాలను బిల్ గేట్స్ తన వాంగ్మూలంలో చెప్పారు. తన వ్యక్తిగత రహస్యాలు వెల్లడి అవ్వడంతో తన కుటుంబ సభ్యులు మానసికంగా ఎంతో బాధపడ్డారన్న బిల్ గేట్స్..
తన వివాహేతర సంబంధాల సమాచారానికి కొన్ని ఘోరమైన అబద్ధాలను కూడా తోడు చేసి, తనను భయపెట్టి, మళ్లీ తనతో వ్యాపార, వ్యక్తిగత సంబంధాలు పెట్టుకునేలా ఒత్తిడి తెచ్చేందుకు ఎప్‌స్టీన్ ప్రయత్నించాడని బిల్ గేట్స్ ఆ వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఇందుకు సాక్ష్యంగా 2013 నాటి ఒక ఈమెయిల్ డ్రాఫ్ట్‌ను గేట్స్ ఉదహరించారు. ఆ ఈమెయిల్‌లో గేట్స్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆరోపణలతో పాటు ఆయన మాజీ ఉద్యోగి బోరిస్ నికోలిక్ ప్రస్తావన కూడా ఉంది. నిజాలు, అబద్ధాలను కలిపి తనను బ్లాక్‌మెయిల్ చేయడానికి ఎప్‌స్టీన్ ఆ మెయిల్‌ను సిద్ధం చేశాడని గేట్స్ వివరించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/epstein-blackmailed-bill-gates-36-224066.html
వ్యవస్థీకృత దుష్ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకునే క్రమంలో.. రాజ్యాంగం కల్పించిన భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు, ప్రజాస్వామ్య చర్చలకు, చట్టబద్ధమైన విమర్శలకు ఎలాంటి భంగం కలగకుండా పోలీసులు వ్యవహరించాలని స్పష్టం చేశారు.
ఇరాన్ అంతు చూస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఫినిష్ ది జాబ్ అంటూ ఓవల్ ఆఫీస్ నుండి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, టెహ్రాన్‌లో వ్యక్తమవుతున్న ప్రతీకార జ్వాలల వెనుక ఉన్న అసలు కారణాలు మరియు పూర్తి వివరాలు ఈ వెబ్ స్టోరీలో చూడండి.
బజాజ్ ఆటో సంస్థ ప్రకటించిన రూ. 5,633 కోట్ల మెగా బైబ్యాక్ ఆఫర్ నేటితో ముగియనుంది. ఒక్కో షేరును రూ. 12,000 చొప్పున 20% ప్రీమియం ధరతో కొనుగోలు చేస్తున్న కంపెనీ. అర్హత వివరాలు, ముగింపు గడువు మరియు నిపుణుల సూచనలు ఇక్కడ చదవండి.
ఆత్మహత్యకు ప్రేరేపించడంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కృష్ణలంక పోలీసులు నాగరాజుపై కేసు నమోదు చేశారు.
ఇన్కమ్ టాక్స్ సెక్షన్ 143(3) కింద స్క్రూటినీ నోటీసు వచ్చిందా? ఆందోళన పడకుండా ఆన్‌లైన్‌లో DIN నంబర్ వెరిఫై చేసుకునే విధానం, నోటీసును నిర్లక్ష్యం చేస్తే పడే 50% నుండి 200% భారీ జరిమానాలు మరియు e Proceeding ద్వారా సురక్షితంగా స్పందించే పూర్తి వివరాలు ఈ వెబ్ స్టోరీలో చూడండి.
ప్రముఖ ఇన్వెస్టర్ ఆశిష్ కచోలియా పోర్ట్‌ఫోలియోలోని వి మార్క్ ఇండియా మల్టీబ్యాగర్ స్టాక్ ఒక్కరోజే 81% పతనమైందా ఇన్వెస్టర్లు ఎందుకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదో, 5:1 బోనస్ షేర్ల వెనుక ఉన్న అసలు మార్కెట్ లెక్కలను ఈ స్టోరీలో వివరంగా తెలుసుకోండి.
కళ్యాణ్ జ్యువెలర్స్ ఇండియా షేర్లు మంగళవారం ట్రేడింగ్‌లో దాదాపు 8 శాతం పడిపోయాయి. ఆదాయం పెరిగినప్పటికీ, ప్రత్యర్థి టైటాన్ కంపెనీ ఫలితాల ప్రభావం మరియు మార్కెట్ అంచనాల వల్ల ఈ భారీ పతనం సంభవించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
నోబుల్ సంస్థ సరికొత్తగా తెచ్చిన నోబుల్ ఆస్ప్రే వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ పూర్తి రివ్యూ. $199 ధర, బ్లూటూత్ 6.0, LDAC సపోర్ట్ ఉన్నా ఈ ఇయర్‌బడ్స్ ఎందుకు ఫెయిల్ అయ్యాయో ఇక్కడ చదవండి.
అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో వైరల్ హిట్ నింజా లక్స్ కేఫ్ ప్రీమియర్ ఎస్ప్రెస్సో మెషిన్‌పై ఏకంగా 53% భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఆస్ట్రేలియాలో ఆల్-టైమ్ లో ధరకు దొరుకుతున్న ఈ త్రీ-ఇన్-వన్ కాఫీ మేకర్ ఫీచర్లు, ధర వివరాలు ఇక్కడ చూడండి.
భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదు కానుందా? రాబోయే 12 నెలల్లో సెన్సెక్స్ లక్ష మార్కును తాకడానికి ఉన్న అవకాశాలు, బుల్ మార్కెట్ ర్యాలీని ప్రేరేపించే కీలక ఆర్థిక అంశాలపై మోర్గాన్ స్టాన్లీ Morgan Stanley నివేదిక పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే రికార్డ్ స్థాయిలో సెన్సెక్స్ వచ్చే 12 నెలల్లో 1,00,000 మార్కును తాకే అవకాశం ఉందని గ్లోబల్ బ్రోకరేజ్ మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. మార్కెట్ తదుపరి భారీ ర్యాలీకి కారణమయ్యే బుల్, బేస్, బేర్ కేస్ సినారియోల పూర్తి వివరాలు మీకోసం.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI బ్యాంకింగ్ రంగంలో ఏఐ, మెషిన్ లెర్నింగ్ వినియోగంపై కొత్త డ్రాఫ్ట్ రూల్స్ తెచ్చింది. మోడల్ రిస్క్ మేనేజ్‌మెంట్ కోసం తెచ్చిన ఈ నిబంధనలతో బ్యాంకింగ్ రంగంలో ఏఐ గవర్నెన్స్, మోడల్ వాలిడేటర్ ఉద్యోగాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
జూలై 7న దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. 100 గ్రాముల 24 క్యారట్ల బంగారంపై ఏకంగా రూ. 13,600 తగ్గింది. హైదరాబాద్, విజయవాడ సహా మీ నగరంలో నేటి 22K, 24K పసిడి లేటెస్ట్ రేట్లను ఇప్పుడే తెలుసుకోండి!