ఇంగ్లండ్, ఆసీస్ మ్యాచ్ వర్షార్పణం

Publish Date:Oct 28, 2022

Advertisement

ఆస్ట్రేలియా మెల్బోర్న్ లో టీ20 ప్రపంచకప్ సూపర్ 12 పోటీల్లో భాగంగా గ్రూప్ 1లో జరగాల్సిన ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మ్యాచ్ భారీ వర్షం కారణంగా రద్దయింది. ముందు పెద్దగా అడ్డంకి కాదనే అనుకున్నారు. కానీ గ్రౌండ్ అవుట్ ఫీల్డ్ బాగా ముద్దగా మారడంతో మ్యాచ్ రద్దుచేయకా తప్పలేదు. మధ్యాన్నం టాస్ కి కూడా జాప్యం అయింది. అప్పటికి వర్షం కొంత తెరిపిచ్చింది. కొంతసమయం తర్వాత ఆట ప్రారంభించవచ్చని అనుకున్నారు. కానీ అందుకు అవకాశం లేకుండా పోయింది. మ్యాచ్ ఈవిధంగా రద్దు కావడంతో రెండు జట్లకు చెరో పాయింట్ లభించింది. గ్రూప్ 1లో ప్రస్తుతం ఇంగ్లండ్ రెండో స్థానంలో, ఆసీస్ నాలుగో స్థానంలో ఉన్నాయి. 

ఇరుజట్లూ చెరో మ్యాచ్ ఓడిపోయాయి గనుక మరో మ్యాచ్ కల్పోయేందుకు అవకాశం ఉండదు. ఈ పర్యాయం సెమీస్ చేరాలంటే రెండు జట్లు మరో మ్యాచ్ తప్పకుండా గెలవవవలసి ఉంటుంది. ఇంతవరకూ జరిగిన  మ్యాచ్ లను పరిశీ లిస్తే మెల్బోర్స్ పిచ్ బ్యాటర్లకు అనుకూలించేలానే ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆసీస్ ప్రారంభ మ్యాచ్ లోనే కివీస్ చేతిలో ఓడిపోయినప్పటికీ  లంక మీద గెలిచిన  సంగతి తెలిసిందే. అయితే ఆసీస్ జట్టులో టాప్ ఆర్డర్  చెప్పుకోదగ్గ సామర్ధ్యం ప్రదర్శించ లేకపోతోంది. అదే జట్టు కెప్టెన్ని, యాజమాన్యాన్ని కలవరపెడుతోంది. స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ ఇంకా చెప్పుకోదగ్గ ఫామ్ ప్రదర్శించలేకపోతున్నాడు. 

ఫించ్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్ వెల్ తమ పాత ఫామ్ ను ప్రదర్శించలేకపోతున్నారు. ఫలితంగా ఆసీస్ మంచి స్కోర్ సాధించలేక వెనుకంజలో పడుతోంది. బౌలింగ్ పరంగా చూసినా పాట్ కమిన్స్  తప్ప  జోష్ హాజెల్ ఉడ్, మిచెల్ స్టార్క్ అటాకింగ్ బాగా చేస్తున్నారనాలి. ప్రపంచకప్ కి రావడానికి ముందు రెండు జట్లూ పోటీపడినపుడు ఇంగ్లండ్ బ్యాటర్లు మంచి ఫామ్ ప్రదర్శించి మున్ముందు  జట్టు విజయాలకు వెన్నుదన్నుగా ఉంటారని ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయి బతికిపోయామనే అనుకుంటున్నారు ఇరజట్ల అభిమానులు. వారి హీరోలు అంతగా స్కోర్ చేయలేకపోతుండడమే అందుకు కారణం. ఇక ముందు జరిగే మ్యాచ్ లన్నీ అత్యంత ఉత్కంఠ భరితంగా సాగే అవకాశమే ఉంది. 

By
en-us Political News

  
హైదరాబాద్‌‌ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.
కనీస ధర రూ.30కి పెంపునకు సిఫార్సు.!
వెబ్‌సిరీస్‌ ల్లో ఎక్కువగా బ్యాంకులు, బంగారు దుకాణాల్లో దోపిడీలకు సంబంధించిన వీడియోలే చూసేవాడు.. ఆ తర్వాత తనకున్న ఆర్మీ అనుభవాన్ని ఉపయోగించుకోని సికింద్రాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌ను ఎంచుకున్నాడు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వ్యవహారశైలిని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
హైదరాబాద్ నగరవాసుల ప్రయాణ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది.
కొత్త కారు కొనుక్కోవాలని ఎన్నో రోజులుగా కలలు కంటారు.. ఆ కల నెరవేరిన రోజు ఆ ఆనందమే వేరు! ఎంతో ఇష్టపడి కొత్త బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి..
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త వాతావరణం నెలకొంది.
మహారాష్ట్రలోని ప్రఖ్యాత హిందూ హృదయసమ్రాట్ బాలాసాహెబ్ థాకరే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్‌పై జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి కెప్టెన్‌‌పై జరిగిన కత్తిదాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.
మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు వేగవంతమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.