సీట్లు భర్తీకాక ఆందోళనలో ఇంజనీరింగు కళాశాలలు?
Publish Date:Sep 30, 2012
Advertisement
ప్రభుత్వపోకడ, జరిగిన ఆలస్యం వల్ల ఇంజనీరింగు కళాశాలల సీట్లు భర్తీ కాలేదు. దీంతో ఇంజనీరింగు కళాశాలల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. ఎప్పుడు ఈ సీట్లు భర్తీ అవుతాయో తెలియటం లేదని, ఈ సీట్లు కనుక భర్తీ కాకపోతే తమ కళాశాలకు తీవ్ర నష్టం తప్పదని యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రత్యేకించి ఉభయగోదావరి జిల్లాల్లోని ఇంజనీరింగు కళాశాలల యాజమాన్యాలతో ‘తెలుగువన్.కామ్’ మాట్లాడితే అన్ని ప్రైవేటు కళాశాలల్లోనూ 40శాతం సీట్లే భర్తీ అయ్యాయని తెలిసింది. పూర్తిగా సీట్లు భర్తీ చేసుకున్న కళాశాలలు వేళ్లతో లెక్కపెట్టవచ్చని, ఈ రెండు జిల్లాల్లో రెండు, మూడు కళాశాలలు మాత్రమే ఆ స్థితిలో ఉన్నాయని ఇంజనీరింగు కళాశాలల యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వం ఫీజు రీయంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్పుల పేరుతో తమ కళాశాలల భవిష్యత్తుతో చెలగాటమాడిరదని ఒక ఇంజనీరింగ్ కళాశాల ఛైర్మన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎక్కువైన ఫీజురీయంబర్స్‌మెంట్ వల్ల ప్రభుత్వం కూడా భారీగా నష్టపోతోందన్నది వాస్తవమేనని ఆయన అంగీకరించారు. అయితే తమను కూడా ప్రభుత్వమే పరోక్షంగా నష్టపరించిందన్నారు. అసలు రీయంబర్స్‌మెంట్ ఆశయం గొప్పదైనా ప్రభుత్వం సీట్ల భర్తీ గురించి ఒక ప్రణాళిక లేకుండా వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వానికి సీట్ల భర్తీపై ఒక ప్రణాళిక ఉంటే ప్రైవేటు కళాశాలల విషయంలో ప్రవర్తించే తీరే మారేదని ప్రత్యేకించి మంత్రి పితాని సత్యాన్నారాయణ గురించి వ్యాఖ్యానించారు. పితాని ఫీజురీయంబర్స్‌మెంట్ విషయంలో ఒక నిబంధనావళిని ప్రకటించటం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేసేలా ఉందని స్పష్టం చేశారు. లగ్జరీ జీవితాన్ని అనుభవించేవారికి రీయంబర్స్‌మెంట్ అందకుండా చర్యలు తీసుకోవటం సాధ్యమయ్యే పని కాదని ఆయన గుర్తించాలని సూచించారు.
http://www.teluguone.com/news/content/engineering-seats-vacant-24-17778.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





