Publish Date:May 29, 2025
మద్యం కుంభకోణం కేసులో కింగ్ పిన్ గా భావిస్తున్న కీలక నిందితుడు రాజ్ కేశిరెడ్డి వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు నమోదు చేశారు. కోర్టు అనుమతితో బుధవారం (మే28) ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ ఈడీ అధికారులు విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న రాజ్ కేశిరెడ్డిని విచారించారు. ఈ సందర్భంగా కేశిరెడ్డిపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రధానంగా మద్యం కుంభకోణం కేసులో అక్రమ నగదు ఎక్కడ నుంచి ఎక్కడకు చేరవేశాడన్న విషయంపైనే ఈడీ అధికారులు ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. దాదాపు ఏడు గంటల పాటు ఈడీ అధికారలు కేశిరెడ్డిని విచారించారు. వందకు పైగా ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. ఈ కుంభకోణంలో కమిషన్ రూపంలో వసూలు చేసిన నగదును ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు. ఏయే రంగాల్లో పెట్టుబడులు పెట్టారు? బ్యాంకు ఖాతాలు ఎన్ని? ఏయే బ్యాంకులలో ఖాతాలు తెరిచారు వంటి ప్రశ్నలతో కేశిరెడ్డిని ఈడీ అధికారులు ఉక్కిరిబిక్కిరి చేసినట్లు చెబుతున్నారు. ఏడుగంటల సుదీర్ఘ విచారణ అనంతరం కేశిరెడ్డి వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు నమోదు చేశారు. ఇప్పటికే మద్యం కుంభకోణంపై ఈడీ మనీలాండరింగ్ కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
ఇలా ఉండగా ఇదే మద్యం కుంభకోణం కేసులో రాజ్ కేశిరెడ్డిని మూడు రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ సిట్ దాఖలు చేసిన పిటిషన్ పై విజయవాడలోని ఏసీబీ కోర్టు గురువారం (మే29) తీర్పు వెలువరించింది. రాజ్ కేశిరెడ్డితో పాటు ఈ కేసులో అరెస్టైన ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్, బాలాజీ గోవిందప్పలను కూడా కస్టడీకి అప్పగించాలంటూ సిట్ పిటిషన్ పై కూడా ఏసీబీ కోర్టు గురువారం (మే 29) తీర్పు వెలువరించనుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/enforcement-directorate--record-statement-from-raj-kesireddy-25-198904.html
అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది, దీని ఫలితాన్ని అనేక నిర్మాణాత్మక మరియు రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం తన చోటుకు ఎసరు వస్తున్నదా అన్న అనుమానంతో.. ఆ కాపు నేత తానేనని చాటుకోవడానికి తన వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారంటున్నారు. నేను సైతం అంటూ ఆయన రంగంలోకి దిగినట్లు వైసీపీ వర్గీయులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఇందుకు తార్కానాలు కూడా చూపుతున్నారు.
ఉభయ సభలలో ఆమోదం పొందిన ఆ బిల్లు ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరింది. ఇక ఆమె సంతకం పెట్టడానూ ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఆమె నేడో, రేపో ఈ బిల్లుపై సంతకం చేయడం ఖాయమని అంటున్నారు.
తమిళనాడులో 2026 ఎన్నికలు హోరాహోరీగా సాగే పోరుగా రూపుదిద్దుకుంటున్నాయి, ఇందులో స్పష్టమైన విజేత ఎవరూ లేరు. స్వల్ప ఓట్ల మార్పులు సీట్ల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపవచ్చు.
రాజకీయం అంటే కేవలం అధికారంలో ఉండటం మాత్రమే కాదని, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ముందుకు సాగాలని వైసీపీకి హితవు పలుకుతున్నట్లుగా మాట్లాడుతూనే.. ఆ పార్టీకి కర్తవ్యబోధ చేశారు.
బిజెపికి 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్‌తో పునాదులు పడ్డాయి. అక్కడి నుంచి ఈ పార్టీ అంచలంచలుగా ఎదిగి నేడీ స్థితికి చేరుకుంది. గతంలో వాజ్ పేయి ఈ పార్టీకి అధికార వాసన రుచి చూపడంతో.. ఇప్పుడు వరుసగా మూడు పర్యాయాల పాటు అధికారం చేజిక్కించుకుని.. ప్రస్తుతం అప్రతిహాత జైత్ర యాత్ర చేస్తోంది.
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఎండలు మండిపోతాయి. వడగాలుల ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది.
రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారాయి.
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్.. ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
మూడు రాజధానుల అంశం గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించి.. మళ్ళీ అదే తరహా ప్రత్యామ్నాయ వాదనలు వినిపించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. పార్టీ కేడర్ సైతం మావిగన్ ఏంటి అదేదో పంటకు పట్టే తెగుల్లా ఉందని నెత్తీ నోరూ బాదుకుంటోంది.
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.