లేదు లేదంటూనే జగన్..!

Publish Date:Jun 14, 2023

Advertisement

ఏపీలో ముందస్తుకు అవకాశం లేదని వరుసగా జరుగుతున్న పరిణామాలతో తేటతెల్లమౌతున్నాయి. ఇదే విషయాన్ని స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. అన్నిటికీ మించి కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలలో  సన్నాహాలు ప్రారంభించేయడమే కాకుండా ఆయా రాష్ట్రాలలో వివిధ రాజకీయ పార్టీలతో సమావేశాల ప్రక్రియ షురూ కూడా చేసేసింది.

ఈ పరిస్థితుల్లో ఒక వేళ వద్దు వద్దు అంటున్న జగన్ ముందస్తుకు మొగ్గు చూపినా ప్రయోజనం ఉండదని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఇంత జరుగుతున్నా.. కూడా  ఏపీలో ముందస్తు చర్చకు తెరపడటం లేదు. ఒకరి తరువాత మరొకరుగా రాజకీయ పార్టీల నేతలే కాదు, పరిశీలకులు కూడా ముందస్తు చర్చను సజీవంగా ఉంచుతున్నారు. తొలుత  వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు, ఆ వెంటనే ఒక రోజు వ్యవధిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్.. మళ్లీ మంగళవారం రచ్చబండలో రఘురామకృష్ణం రాజు కూడా ఏపీలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలు కొట్టి పారేయలేమని అన్నారు. సాంకేతికంగా ఏపీలో ముందస్తుకు అవకాశాలు లేవని విస్పష్టంగా తెలుస్తున్నా.. రాజకీయ నాయకులు, పరిశీలకులు, చివరాఖరికి సామాన్య జనం కూడా ముందస్తు చర్చను పదే పదే ముందుకు తీసుకురావడం విశేషం.  

ఇందుకు వారు చెబుతున్న కారణం రాష్ట్రంలో అమలు చేస్తున్నది  అభివృద్ధి రహిత  సంక్షేమం. ఒక్కసారి ఈ సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోయాయంటే, మళ్లీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే అవకాశం ఇసుమంతైనా ఉండదు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితికి..మంత్రి వేణుగోపాలకృష్ణ వ్యక్తిగత సిబ్బంది చాంబర్ కు తాళం వేయడమే నిలువెత్తు నిదర్శనం. గత ఆరు నెలలుగా జీతాలు అందని కారణంగా వారీ పని చేశారు. మంత్రి వ్యక్తిగత సిబ్బందికే వేతనాలు అందడం లేదంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు పట్ల ఆగ్రహంతో ఉన్న కేంద్రం, దొంగ అప్పులను నివారిస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటన్నది తేలిపోతుందన్నారు. ఇప్పటి వరకూ  ఏదో కేంద్రం దయతో, కరుణతో అప్పులు తెచ్చుకుంటూ, తిప్పలు పడుతూ బండి లాక్కొస్తున్న జగన్  కు ముందు ముందు ఆ పరిస్థితి ఉండదు. దీంతో  సంక్షేమ పథకాలు కొనసాగించి మళ్లీ అధికారంలోకి వస్తామన్న ఆశ ముఖ్యమంత్రి రోజు రోజుకూ కొడిగడుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన ముందస్తు లేదు లేదంటూనే అందుకే మొగ్గు చూపుతారని, ఆయన కాదు లేదు అన్నారంటే ఔను, ఉంది అనే అర్ధమని అంటున్నారు.

కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఏడాదిలో జరిగే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లను షురూ చేసినా.. కేంద్రం పెద్దల వద్ద తన పలుకుబడిని ఉపయోగించుకుని జగన్ అనుకున్నది సాధించుకుంటారని పరిశీలకులు చెబుతున్నారు. ఇందుకు గత నాలుగేళ్లుగా అడుగు కూడా ముందకు పడని జగన్ అక్రమాస్తుల కేసులను, ఎవరికీ లభించని విధంగా వివేకా హత్య కేసు విషయంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి లభిస్తున్న వెసులు బాట్లను ప్రస్తావిస్తున్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎనిమిదవ నిందితుడిగా అభియోగాలను ఎదుర్కొంటున్న కడప ఎంపీ  అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసి రెండు వారాలైనా సిబిఐ ఇంత వరకూ సుప్రీం కోర్టుకు అప్పీల్ కు వెళ్లకపోవడమే కాకుండా  అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ను సవాలు చేస్తూ వివేకా కుమార్తె  సునీత   సుప్రీం కోర్టును ఆశ్రయించినా,  సిబిఐ ఇంప్లిడ్ కాకపోవడం వెనుక ఉన్న రహస్యం జగన్ పలుకుబడేనన్నది పరిశీలకుల విశ్లేషణ.

ఈ నేపథ్యంలోనే  ముందస్తు నిర్ణయం విషయంలో సమయం మించిపోయినా కావాలనుకుంటే జగన్ కేంద్రం ద్వారా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఇన్ఫ్లయెన్స్ చేసి సాధించుకోగలరని, అందుకే ముందస్తు దారులు ముగిసిపోయినా ఏపీలో మాత్రం ఆ చర్చకు తెరపడటం లేదనీ అంటున్నారు. 

By
en-us Political News

  
భారతీయ రాజకీయ రంగంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
దసరా పండుగ సెలవులు ప్రారంభం కావడంతో భాగ్యనగరంలో ప్రయాణికుల రద్దీ తారాస్థాయికి చేరింది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రముఖ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం లైంగిక వేధింపుల ఉదంతంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి హసిరాణి రథ్‌ భారీ విజయం సాధించారు.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏవియేషన్ రంగానికి సంబంధించి అత్యంత కీలకమైన చారిత్రాత్మక పరిణామం చోటుచేసుకుంది.
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాదె సాయి కృష్ణ కస్టోడియల్‌ డెత్‌ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) కీలక ఛార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించింది.
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అత్యున్నత పురస్కారాలలో ఒకటైన 2026 సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతిని భారత సంతతికి చెందిన ప్రముఖ న్యాయకోవిదురాలు నవనీతం నవి పిళ్లై గెలుచుకున్నారు.
అర్ధరాత్రి వేళ రోడ్లపై పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నగరవాసులకు విజ్ఞప్తి చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.