ఎన్డీఎ ఖాళీ.. శుభం కార్డు పడినట్లేనా?

Publish Date:Aug 10, 2022

Advertisement

 జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఎ) కథ ముగిసినట్లేనా? ఒకప్పుడు అటల్ బిహారీ వాజ్’పేయి సారధ్యంలో 24 పార్టీల కూటమిగా  కేంద్రంలో చక్రం తిప్పిన ఎన్డీఎ చిత్రానికి శుభం కార్డు పదినట్లేనా? అంటే రాజకీయ విశ్లేషకులు అవుననే అంటున్నారు. ఇంతవరకు జాతీయ స్థాయిలో ఎంతో కొంత గుర్తింపు ఉన్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సారధ్యంలోని జనతా దళ్ (యు) కూటమిలో కొనసాగడంతో, జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఉనికి ఉందని పించుకుంది. ఇప్పుడు, కొంచెం ఆలస్యంగానే అయినా పులి మీద స్వారీలోని ప్రమాదాన్ని గుర్తించి  నితీష్ కుమార్, కూటమికి గుడ్ బై చెప్పడంతో, ఎన్డీఎ కథ కంచికి చేరినట్లే అంటున్నారు.

నిజానికి, 2014 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ‘ఏకపార్టీ’ ఆధిక్యత సాధించిన రోజునే, ఎన్డీఎ కథ చివరి పేజికి చేరింది. ఇంచు మించుగా మూడు దశాబ్దాల తర్వాత మొదటిసారిగా లోక్ సభలో బీజేపీ సొంతగా సాధారణ మెజారిటీ (272)కు 10 సీట్లు అదనంగా (282) గెలిచి, మూడు పదుల చరిత్రను తిరగ రాసింది. అలాగే, 2019 ఎన్నికల్లో బీజేపీ సొంత బలమే 303 కు చేరింది. మరో వంక ప్రతిపక్ష కూటమి, యూపీఎకు సారధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ దినదిన ప్రవర్థమానంగా దిగజారి ప్రాంతీయ పార్టీల పంచన చేరే పరిస్థితికి చేరుతోంది.

అయినా 2014లో తిరిగి 2019లో బీజీపీ  ప్రధాని మోడీ సారధ్యంలో ఎన్డీఎ సంకీర్ణ ప్రభుత్వాలే ఏర్పాటు చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ మొదటి మంత్రివర్గంలో తెలుగు దేశం, శివసేన, అకాలీదళ్, సహా అనేక ప్రాంతీయ పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి. అయితే, ఆ తర్వాత ఏమి జరిగింది అన్నది చరిత్ర. ఎవరి కారణాలు వారికీ ఉన్నా, ఒక్కొక్క పార్టీ ఎన్డీఎకి దూరమవుతూ వచ్చాయి. ఆ క్రమమలోనే ఇప్పుడు జేడీ(యు) వంతు వచ్చింది. 

2019 ఎన్నికల్లోనూ అకాలీ దళ్, శివసేన, పాశ్వాన్ పార్టీ ఎల్’జేపీ, ఎఐఎడిఎంకే, జేడీ(యు)సహా అప్నా దళ్, ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ వంటి మరికొన్ని చిన్నా చితక పార్టీలు సహా మొత్తం తొమ్మిది పార్టీలు కలిసి పోటీచేశాయి. కానీ, ఇప్పుడు ఆ చిన్నా  చితక పార్టీలలో కొన్ని మాత్రమే కూటమిలో మిగిలాయి. బీజేపీ సహజ మిత్ర పక్షాలు శివసేన, అకాలీ దళ్’ తాజాగా జేడీ(యు) సహా ప్రధాన ప్రాంతీయ పార్టీలు అన్నీ ఎన్డీఎ గూడు వదిలి పోయాయి.. ఇక  ఇప్పుడు ఎన్డీఎలో ఉన్న పార్టీలు ఏవీ రాజకీయంగా అంతగా ప్రభావం చూపగలిగే పార్టీలు కాదు. ఏ పార్టీకి కూడా లోక్ సభలో  ఒకటి రెండు స్థానాలకు మించి లేవు. 

అయితే, మిత్ర పక్షాలు బీజేపీకి ఎందుకు దూరం అవుతున్నాయి? బీజేపీతో చెలిమిని మిత్ర పక్షాల ఎందుకు దృతరాష్ట్ర కౌగిలిగా భావిస్తున్నాయి? బీజేపీకి మిత్ర పక్షాలు దురమవుతున్నాయా? లేక బీజేపీనే ఉద్దేసపూర్వకంగా మిత్ర పక్షాలను పోమ్మనకుండా పొగబెట్టి, సాగనంపుతోందా? మిత్ర పక్షాలు మోడీ, షా జోడీ రాజాకీయ వ్యూహ చతురతను తట్టుకోలేక చక్రబంధాలను చేదించుకుని బయట పడుతున్నారా? అంటే,ఇదమిద్దంగా ఇదీ కారణం అని చెప్పడం కొంచెం కష్టమే అవుతుంది.

ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ. తెలుగు దేశం పార్టీ బయటకు వచ్చిన కారణాలకు, ఇప్పుడు నితీష్ కుమార్  బయటకు వెళ్ళిన కారణాలకు పొంతన లేదు. చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రత్యేక హోదా కోసం  ధర్మ పోరాటం ప్రకటించి బయటకు వచ్చారు. చంద్రాబాబు రాజకీయ ప్రయోజనాలు చూసుకోలేదు.కానీ, నితీష్ కుమార్ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలుగుతుందని, కమల దళానికి కతీఫా చెప్పలేదు. బీజేపీ చెలిమి భస్మాసుర హస్తం అవుతోందన్న భయంతోనే ఆపర్తితో తెగతెంపులు చేసుకున్నారు. అలాగే, అకాలీ దళ్, శివసేన ఒక్కొక్క పార్టీది ఒక్కొక్క క(వ్య)థ.   

అయితే, ఒకటి మాత్రం నిజం, మోడీ, షా జోడీ నాయకత్వంలో బీజేపీ శతృమిత్ర బంధాలతో సంబంధం లేకుండా అన్ని పార్టీలను,‘సమ’ దృష్టితో చూస్తోంది. అన్ని పార్టీలను రాజకీయ ప్రత్యర్ధులుగానే చూస్తున్నారు. అందుకే మోడీ, షా జోడీ అడుగులు  ఏక పార్టీ ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్మాణం వైపుకు సాగుతున్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి, ఒక విధంగా మోడీ,షా జోడీ రాజకీయ అశ్వమేధ యాగం సాగిస్తున్నారు. కాంగ్రెస్ ముక్త భారత్’ లక్ష్యంగా మొదలు పెట్టిన ఈ యాగం కాంగ్రెస్ కథ ముగింపుతో ముగిసేలా లేదని జరుగుతున్నపరిణామాలు, నడుస్తున్న చరిత్ర స్పష్టం చేస్తున్నాయి. 
అయితే, గతంలో కాంగ్రెస్ పార్టీ ఏకచత్రాధిపత్యం నడిచే రోజుల్లో, హస్తం పార్టీ కూడా ఇవే పోకడలు పోయింది. ఒక దశలో ఇందిరాగాంధీ, ప్రతిపక్ష్లాల గొంతు నొక్కేందుకు ఏకంగా దేశంలో అత్యవసర పరిస్థితినే విధించారు. ఇప్పుడు ఆ పరిస్థతి పునరావృతం అయ్యే అవకాసం లేదు కానీ, అధికార ఇదే ధోరణి, ఇవే పోకడలు కొనసాగితే ప్రజవామ్య వ్యవస్థ వొడిదుడుకులు ఎదుర్కొనవలసి వస్తుందని అయితే, రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

By
en-us Political News

  
కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.