ప్రోత్సాహానికి కేరాఫ్ అడ్రస్ మీరే కావచ్చు…

Publish Date:Sep 12, 2023

Advertisement

అరేయ్ నువ్వు చేయగలవురా నీ వల్ల అవుతుంది. నీ గురించి నీకు అర్థం కావడం లేదు, హనుమంతుడికి తన బలం తనకే తెలియనట్టు.. నువ్వు కూడా ఇంతే.. ఊరికే ఎలాంటి అనుమానాలు, భయాలు పెట్టుకోకుండా నువ్వు అనుకున్నది చెయ్యి.. నీ వెంట నేనుంటా కదా…


ఇలాంటి మాటలు ప్రతి మనిషి జీవితంలో ఉంటే బహుశా ఓటమి  ఎదురవ్వడం అనే సందర్భం రాదేమో.  ఓ మనిషిని ప్రోత్సహించాలన్నా, వెనక్కు లాగాలన్నా అదంతా ఇంకొక మనిషి చేతిలో ఉంటుంది. ప్రతిభ ఉండి, ఆత్మవిశ్వాసం ఉండి కూడా ఒక్కో సందర్భంలో ఇతరులు నిరాశ పరచడం ద్వారా విఫలం అయ్యేవారు చాలామందే ఉంటారు. అందుకే ప్రోత్సాహం గొప్ప ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది.  బద్దకస్తుడిని కూడా పరుగులు పెట్టిస్తుంది.


ప్రోత్సాహంలో ఉన్న గొప్పదనాన్ని, ప్రోత్సాహం ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రతి ఏడు సెప్టెంబర్ 12 ను నేషనల్ ఎంకరేజ్మెంట్ డే ని జరుపుకుంటారు. దీన్ని జాతీయ ప్రోత్సాహ దినోత్సవం అని తెలుగులో పిలుస్తారు. ఈరోజు ఏం చేయవచ్చంటే..


పిల్లలు, కుటుంబ సభ్యులను ప్రోత్సహించడం..


ప్రతి మనిషి మొదట తన ఇంటిని బాగు చేసుకుంటే ఆ తరువాత సమాజాన్ని బాగు చేయడానికి అర్హుడు అవుతాడు అని అంటారు. దానికి అనుగుణంగానే… కుటుంబ సభ్యులు, పిల్లలు, తోడబుట్టిన వారు, పెద్దలు ఇలా ప్రతి ఒక్కరూ ఏవైనా పనులలో కానీ, మరేదైనా విషయంలో కానీ జంకుతున్నా, సందిగ్ధంలో ఉన్నా వారికి ధైర్యం చెప్పి ఎంకరేజ్ చెయ్యాలి.  దీనివల్ల వారికి ఎక్కడలేని ధైర్యం, ఆత్మవిశ్వాసం కలుగుతాయి. కుటుంబ సభ్యులు విజేతలు అయినా, ఎదైనా సాధించినా పరోక్షంగా అధి ఆ ఇంటి విజయం అవుతుంది. కాబట్టి పిల్లలు, కుటుంబ సభ్యులను ప్రోత్సహించండి.


పేదవారిని, స్నేహితులను వదలొద్దు..


పేదరికం కారణంగా ప్రతిభ ఉన్నా మరుగున ఉంటున్న పిల్లలు, యువత ఎంతోమంది ఉన్నారు. అందరినీ భుజాన వేసుకోకపోయినా వారికి కాస్త ఆర్థిక సాయం, మరికాస్త ధైర్యం చెబితే ఊహించని విధంగా విజయాన్ని సాధిస్తారు. అలాగే  తల్లిదండ్రులలో కూడా చెప్పుకోలేని విషయాలు స్నేహితులతో చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి స్నేహితులను వైఫల్యం బాటలో వదిలేయకుండా వారిని ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేస్తూ ముందు తోయాలి. అప్పుడు వారి విజయంలో మీరు భాగమవుతారు.


కళాకారులు,  ప్రతిభ గలవారిని ప్రోత్సహించాలి..


కళను తమలో నింపుకున్నవారు కళాకారులు. కానీ చాలావరకు కళలు కడుపు నింపవు అనే మాట వాస్తవ చిత్రంగా అందరికీ కళ్లెదుటే కనిపిస్తుంటుంది. ప్రతిభ కలిగిన కళాకారులను ఎంకరేజ్ చెయ్యాలి. ఏ వర్గంలో అయినా ప్రతిభ ఉంటే వారిని చేతనైన విధంగా మాటలతోనూ, ఆర్థికంగానూ సహాయం అందించాలి.
 

By
en-us Political News

  
కొత్త వస్తువులు కొంటేనే చాలామంది చాలా సంతోషంగా ఉంటారు.  ఇక మహిళలు అయితే వంటింటి వస్తువుల నుండి వారు కొనుగోలు చేసే వస్తువు పట్ల చాలా ఇష్టంతో ఉంటారు.  కానీ కొత్త వస్తువుల లుక్ పాడు చేసే వాటిలో వాటి మీద ఉండే స్టిక్కర్లు ప్రధానంగా ఉంటాయి...
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభానికి గుర్తుగా బుధవారం దేశంలో రంజాన్ చంద్రుడు కనిపించాడు. అంతకుముందు సౌదీ అరేబియాలో ఫిబ్రవరి 17న చంద్రుడు కనిపించాడు.  ఫిబ్రవరి 18న అక్కడ రంజాన్ ఉపవాసం ప్రారంభానికి గుర్తుగా చంద్రుడు కనిపించాడు...
ప్రతి వ్యక్తి జీవితం గురించి చాలా ఆలోచిస్తారు.  తమ జీవితం ఎలా ఉండాలో,  ఎలా ఉంటే బాగుంటుందో అని చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు.  సరిగ్గా గమనిస్తే.. కొందరు నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది అని అంటూ ఉంటారు...
తల్లిదండ్రులు పిల్లలు ఎంత పెద్దైనా వారు చిన్నవారిగానే కనిపిస్తారు అని  అంటుంటారు.  కానీ ఈ రోజుల్లో తల్లిదండ్రులు,  పిల్లల మధ్య గొడవలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. దీనికి   అతిపెద్ద కారణం  చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు..
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు  అన్ని ఆనందాలను పొందాలని,  జీవితంలో విజయం సాధించాలని కోరుకుంటారు. తమ పిల్లలు తమలాగా కష్టాలను పడకూడదని అనుకుంటారు.  అందుకే నేటికాలంలో మేము కష్టాలు...
డబ్బు మనిషి జీవితానికి చాలా అవసరం.  డబ్బు లేని జీవనం దుర్బరంగా ఉంటుంది. ముఖ్యంగా డబ్బు విషయంలో పేద వారు మరీ అంత ఇబ్బందులలో ఉండరు...
వాలెంటైన్స్ డే ప్రతి ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన జరుపుకుంటారని అందకీ తెలిసిందే. అయితే ఫిబ్రవరి 14కు ముందు వారం రోజుల నుండే వాలెంటైన్  హడావిడి మొదలవుతుంది.  వారం రోజుల పాటు ఒక్కొక్క రోజు ఒక ప్రత్యేక దినంగా పరిగణిస్తూ..
నేటికాలంలో మనిషి కష్టపడి డబ్బు సంపాదించేది ధనవంతుడు కావడానికే. ఎందుకంటే ధనవంతుడిగా ఉంటే చాలా రకాల సమస్యలు దూరం అవుతాయి.  కానీ చాలామంది ఆర్థికంగా ఎదగలేరు...
రవాణా ప్రజల జీవితాలలో ఎంతో ముఖ్యమైనది. రోడ్డు రవాణా చాలా సహజంగా అందరికీ తెలిసేది,  కనిపించేది. కానీ  వాయు రవాణా, జల రవాణా ప్రజల నివాసాలకు దూరంగా జరుగుతుంది. మరీ ముఖ్యంగా వేల సంవత్సరాల..
ఏదైనా సంబంధానికి పునాది నిజాయితీపై ఆధారపడి ఉంటుందని చాలామంది చెబుతారు.  భాగస్వామి నుండి ఏదీ దాచకుండా ఉండటం, ప్రతిదీ పారదర్శకంగా ఉండాలి అని అనడం చూస్తుంటాం.  భాగస్వామితో ప్రతి చిన్న విషయాన్ని..
ఫిబ్రవరి అంటేనే వాలెంటైన్స్ డే గుర్తుకు వస్తుంది. మనసులోనే తమ ప్రేమను దాచుకున్న ఎందరో ప్రేమికులు తమ మనసు విప్పే సమయమిది.  అయితే చాలా మంది తమ ప్రేమను వ్యక్తం చేయడానికి ఏదో ఒక బహుమతి కొని ఆ బహుమతి...
స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటీషు పాలనలో భారతీయుల పరిస్థితి ఎంతో ధీనంగా ఉండేది. భారత పౌరులు అందరూ బ్రిటీషర్లకు బానిసలుగా మారారు.  కానీ భారతదేశంలో ఎందరో వీరులు ఈ బానిసత్వం నుండి దేశానికి విముక్తి కలిగించాలని...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.