Publish Date:Feb 12, 2026
నెల్లూరు జిల్లా మనుబోలు మండలం ఆఖంపేటలో జరిగిన 'ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర'లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శల వర్షం కురిపించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రైతు రుణమాఫీ, గిట్టుబాటు ధర, ఆరోగ్యశ్రీ, మరియు మహిళలకు పావలా వడ్డీ రుణాలతో స్వర్ణయుగం సాగిందని గుర్తుచేసిన ఆమె, ప్రస్తుతం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. ఉపాధి కూలీలకు వేతనాల చెల్లింపులో నెలల తరబడి ఆలస్యం జరుగుతోందని, గ్రామసభల హక్కులను కాలరాస్తూ ఈ పథకాన్ని కాంట్రాక్టర్లకు లేబర్ సప్లై చేసే విధంగా మార్చాలని చూస్తున్నారని ఆరోపించారు.
కేంద్రం తన వాటాను 100% నుండి 60% కి తగ్గించాలనే ఆలోచన రాష్ట్రంపై అదనపు భారం మోపడమేనని, ఇప్పటికే లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న ఏపీకి ఇది గొడ్డలి పెట్టు వంటిదని ఆమె వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా, పోలవరం వంటి రాష్ట్ర ప్రయోజనాలపై ఎంపీలు ఢిల్లీలో గళమెత్తలేదని విమర్శిస్తూ, రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని, ప్రజల తరపున పోరాడేందుకు తాము సిద్ధమని ఆమె పిలుపునిచ్చారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/employment-guarantee-protection-tour-36-213938.html
పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పీక్ స్టేజ్‌కు చేరాయి.
మాజీ మంత్రి, వై.ఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు చేపట్టాలంటూ ఆయన కుమార్తె సునీత రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది.
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB)కి చెందిన ఇన్‌స్పెక్టర్ బి. మహేందర్‌కు సంబంధించిన ఎసీబీ (ACB) రిమాండ్ కాపీలో పలు సంచలన అంశాలు వెలుగుచూశాయి.
తెలంగాణ వ్యాప్తంగా రవాణా శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ వ్యవస్థను మరింత బలో పేతం చేసి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక రంగంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
విశాఖ స్టీల్ ప్లాంట్‌లోని SMS-1 విభాగంలో భారీ పేలుడు సంభవించింది.
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ దేహత్ జిల్లాలో అత్యంత విచిత్రమైన, సమాజాన్ని నివ్వెరపరిచే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్‌లో ఆహార భద్రత, ప్రజారోగ్య పరిరక్షణ లక్ష్యంగా పనిచేస్తున్న H-FAST (Hyderabad Food Adulteration Surveillance Team) బృందం మృగశిర కార్తి రోజున భారీ ఆపరేషన్ నిర్వహించారు.
కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన బీటెక్ విద్యార్థి అదృశ్యం కేసు విషాదాంతమైంది.
క్రికెట్ ప్రపంచంలో సరికొత్త చరిత్ర సృష్టించబడింది.
నేటి ఆధునిక కాలంలో ఐదెంకల జీతం వస్తే జీవితం ఎంతో విలాసవంతంగా ఉంటుందని చాలా మంది భావిస్తారు.
ఇద్దరు మేజర్లు పరస్పర అంగీకారంతో శారీరక సంబంధాలు కలిగి ఉండటం చట్టప్రకారం నేరం కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంగిచెర్ల ఎంఎల్ఆర్ కాలనీకి చెందిన రసూల్ జాకబ్ 2024లో అల్వాల్‌కు చెందిన మేఘనను వివాహం చేసుకున్నాడు. వివాహ సమయంలో అమ్మాయి తల్లిదండ్రులు భారీగా కట్నకానుకలు ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు తలెత్తడంతో పరిస్థితి దిగజా రింది. రోజురోజుకీ గొడవలు పెరిగిపోతూ ఉండడంతో మేఘన ఈ క్రమంలో జాకబ్‌తో పాటు అతని కుటుంబ సభ్యులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.