ఎల్ నినో ఎఫెక్ట్: బాసర త్రిపుల్ ఐటీ దసరా సెలవులు పొడగింపు.!

Publish Date:Oct 23, 2026

Advertisement

ఎల్ నినో ఎఫెక్ట్ వ్యవసాయంపైనే తీవ్రంగా చూపుతోందని అంతా భావిస్తున్నారు. కానీ విద్యా సంస్థలపైనా, విద్యార్థులపైనా కూడా ఎల్ నినో ప్రభావం పడింది. విద్యాలయాల్లో, హాస్టళ్లలో నీటి లభ్యత గణనీయంగా పడిపోయింది. తీవ్ర వర్షాభావ పరిస్థితులు విద్యా సంస్థలపైనా పడుతోంది. తాజాగా బాసర త్రిబుల్ ఐటీ విద్యార్థులకు దసరాసెలవులను పొడిగించారు. 

బాసరలోని  రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం  ట్రిపుల్ ఐటీ లో అసాధారణ పరిణామాలు చోటుచేసుకున్నాయి. క్యాంపస్‌లో వేలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఎల్ నినో ఎఫెక్ట్ తో అక్కడ   నీటి ఎద్దడి తీవ్రతరమైంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా, స్థానిక నీటివనరుల్లో నీటి లభ్యత లేకుండా పోయింది. భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. దీంతో బాసర త్రిబుల్ ఐటీలో  విద్యార్థులకు అవసరమైన  తాగునీరు, ఇతర అవసరాలకు కావలసిన నీటి సరఫరా నిలిచిపోయే పరిస్థితి తలెత్తింది.  

పరిస్థితి తీవ్రతను గ్రహించిన విశ్వవిద్యాలయ  పాలనా యంత్రాంగం,   క్యాంపస్‌లో నెలకొన్న ఈ తాగునీటి సంక్షోభం కొద్దిరోజుల్లో పరిష్కారం కాకపోవచ్చని భావించి, విద్యార్థుల ఇబ్బందిని నివారించేందుకు  దసరా సెలవులను  పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.   సెలవులు ముగిసి విద్యార్థులు క్యాంపస్‌కు తిరిగి వస్తే నీటి సమస్య మరింత జఠిలమయ్యే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సెలవుల పొడిగింపునకు సంబంధించిన సమాచారాన్ని అధికారికంగా ప్రకటించారు.  విద్యార్థులు తమ ఇళ్ల నుంచి క్యాంపస్‌కు ఎప్పుడు రావాలనే సమాచారాన్ని  త్వరలోనే మళ్లీ వెల్లడిస్తామని పేర్కొన్నారు.  


[Elnino Effect On Basara IIIT,  RGUKT Basara,  Dasara Holidays Extended, Basara IIIT Water Crisis, Telangana, Telugu One]

By
en-us Political News

  
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న జాతీయ స్థాయి నిరసన ర్యాలీకి తెలంగాణ నుంచి పార్టీ శ్రేణులను తరలించేందుకు ప్రత్యేక రైళ్లు కేటాయించకపోవడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో ప్రయాణికురాలు తోసివేయడంతో గాయపడిన టీజీఎస్‌ఆర్టీసీ కండక్టర్ ప్రవళికకు ప్రభుత్వం అండగా ఉంటుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు.
సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) కోసం ప్రభుత్వానికి దరఖాస్తు సమర్పించారు. ఈ నిర్ణయం రాష్ట్ర పాలనా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  తదుపరి సీఎస్ రేసులో  ఉన్న జయేష్ రంజన్ వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకోవడం సంచలనంగా మారింది. 
మరీ ముఖ్యంగా హైదరాబాద్ పై చలిపులి పంచా విసిరింది.  ఉదయం పూట ఎండ తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటున్నా, రాత్రి వేళల్లో,  తెల్లవారుజామున చలి తీవ్రత భారీగా ఉంటోంది.  
కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మకల్ సల్ఫీ నగర్‌లో చోటుచేసుకున్న ఒక అంతులేని విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది
నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు మందగించడం, పెండింగ్ బిల్లులు విడుదల కాకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేసిన  జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తీవ్ర నిరవధిక దీక్ష హెచ్చరిక చేశారు.
అశ్వాపురం మండలం మిట్టగూడెం గ్రామం వద్ద  ఆ మహిళా ప్రయాణీకురాలు   కండక్టర్‌ను బలంగా తోసివేసింది. ఈ ఊహించని పరిణామానికి కండక్టర్ అదుపుతప్పి నడుస్తున్న బస్సులోంచి రోడ్డుపై పడిపోయారు. ఈ ఘటనలో బస్సు వెనుక చక్రాలు ఆమె  కాళ్లపై నుంచి దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డారు.  
హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో భారీ పేలుడు కలకలం రేపింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో వేగంగా మార్పులు వస్తున్నాయి.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళ నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే కరువు పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు వ్యూహాలకు పదును పెట్టింది.
తెలంగాణ రాజకీయాల్లో సన్నవడ్ల సాగు అంశం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.