లోకేష్ కు ఎలివేషన్ లాంఛనమేగా?

Publish Date:May 28, 2025

Advertisement

కడప మహానాడు వేదికగా ఐటీ, విద్యాశాఖ మంత్రి,  తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ప్రమోషన్ లంఛనమేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పార్టీలో, ప్రభుత్వంలో  తనదైన ముద్ర వేస్తున్న నారా లోకేష్ కు టీడీపీలో నిర్ణయాత్మక పదవి ఇచ్చేందుకు కడప మహానాడు వేదిక అవుతుందన్న  ప్రచారం జోరందుకుంది. లోకేష్‌కు ప్రమోషన్‌పై టీడీపీలో ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. ఆ ప్రమోషన్ ఎలా ఉండబోతుందనే ప్రశ్నలకు ఈ మహానాడు సమాధానం చెప్పనుందని అంటున్నారు. అందుకు తగ్గట్టుగానే లోకేష్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ను చేయాలంటూ పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ల నరేంద్ర వంటి వారు మహానాడు ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. అయితే వాస్తవానికి వర్కింగ్ ప్రెసిడెంట్ గా కాకుండా లోకేష్ కు తెలుగుదేశం ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా నియమించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. లోకేష్ కోసమే ప్రత్యేకంగా పార్టీలో  ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్‌ పోస్ట్‌ క్రియేట్ చేయబోతున్నట్లు చెబుతున్నారు.

పార్టీలో ఒక నేతకు ఒకే పదవి, అది కూడా రెండు సార్లు మాత్రమే అంటూ ఒక చర్చ జరుగుతోందనీ, ఆ చర్చను ప్రారంభించిందే లోకేష్ అని కూడా చెబుతున్నారు. ఆ మేరకు పార్టీ జాతీయ కార్యదర్శి పదవిని వదులు కోవడానికి లోకేష్ సిద్ధమయ్యారనీ కూడా అంటున్నారు. అందుకే  పార్టీలో ఇప్పటి వరకూ లేని ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ పదవిని క్రియేట్ చేసి ఆ పదవిలో లోకేష్ ను నియమించాలన్నది చంద్రబాబు ఉద్దేశంగా చెబుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలుగుదేశం తొలి ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా లోకేష్ బాధ్యతలు చేపట్టడం లాంఛనమేనని చెబుతున్నారు. వాస్తవానికి  తెలుగుదేశంలో ఇప్పటి వరకూ కార్యనిర్వాహక అధ్యక్ష పదవే లేదు. ఇప్పుడా పదవిని క్రియేట్ చేసి మరీ లోకేష్ కు అప్పగించనున్నారని పార్టీ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.  నారా లోకేశ్ ఇప్పుడు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ అత్యంత కీలకంగా ఉన్నారు.  పార్టీ వ్యవహారాలలోనూ, పాలనాపరంగానూ కూడా లోకేష్ తన ముద్ర బలంగా వేశారు. 

అన్నిటికీ మించి లోకేష్ నడక, నడత, ప్రసంగాలూ, ఆలోచనలూ అన్ని యువతకు బాగా కనెక్ట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కూడా లోకేష్ కు ప్రమోషన్ ఇవ్వాలన్న డిమాండ్ తెలుగుదేశంలో పెరుగుతోంది. పైగా ఈ డిమాండ్ పార్టీలోని సీనియర్ మోస్ట్ లీడర్స్ నుంచే వస్తోంది.  ప్రభుత్వంలో ప్రమోషన్ అంటూ డిప్యూటీ సీఎం. అయితే ఆ విషయంపై మాట్లాడొద్దని చంద్రబాబు స్వయంగా పార్టీ నేతలను హెచ్చరించడంతో, ఇప్పుడు పార్టీలో ప్రమోషన్ విషయంపై జోరుగా చర్చ జరుగుతోంది.  పార్టీ కీలక నేతలు సైతం లోకేష్ కు పార్టీలో మరింత ప్రాధాన్యత పెరగాలని పట్టుబడుతున్నారు.  పార్టీ మరింత బలోపేతం కావాలంటే లోకేష్ కు ఎలివేషన్ ఇచ్చి తీరాల్సిందే అంటున్నారు.   

ఇక రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలోనూ లోకేష్ చాలా కీలకంగా ఉన్నారు. ఆయన  నేతృత్వంలో ఇప్పటి వ‌ర‌కూ 91 ఐటీ, ఎల‌క్ట్రానిక్స్ కంపెనీలు రాష్ట్రంలో ఏర్పాటుచేయడానికి ముందుకు వచ్చాయి.  భారీ స్థాయిలో పెట్టుబడులు, భారీ సంఖ్యలో ఉద్యోగావకాశాలూ కల్పించేందుకు ఆ కంపెనీలు సంసిద్ధంగా ఉన్నాయి.   రాబోయే ఐదేళ్లలో ఐటీ, ఎల‌క్ట్రానిక్స్ రంగాల్లో 5 ల‌క్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా లోకేష్ ముందుకు సాగుతున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ఆయన పలు సందర్భాలలో చెప్పారు. ఈ నేపథ్యంలోనే పార్టీలో మరింత నిర్ణయాత్మక పాత్ర లోకేష్ కు అప్పగిం చాలని చంద్రబాబు కూడా భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇక జాతీయ స్థాయిలో కూడా లోకేష్ కు మంచి గుర్తింపు వచ్చింది. స్వయంగా ప్రధాని మోడీ లోకేష్ ను తన నివాసానికి విందుకు ఆహ్వానిం చారు. మహామహులకే అంత తేలిగ్గా లభించని ప్రధాని మోడీ అప్పాయింట్ మెంట్ లోకేష్ కు అడగకుండానే లభించడమే ఆయన స్థాయి ఏమిటన్నది అవగతమౌతుందంటున్నారు. ఈ నేపథ్యంలోనే మహానాడు ప్రాంగణం నుంచే పార్టీ సీనియర్ లీడర్లు లోకేష్ కు ఎలివేషన్, ప్రమోషన్ కోసం డిమాండ్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు. రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి.
కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో ఆయనతో పాటు మరికొందరు  వైసీపీ నేతలపై  పోలీసులు  ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని అడ్డుకుని, వారిపై భౌతిక దాడికి దిగారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు. 
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌశిక్ రెడ్డి ఒక ఛాలెంజ్ విసిరారు. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని వెంటనే ఎత్తిపోయాలని, ఆ నీటిని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మీదుగా ఎల్లంపల్లికి తరలించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆ విధంగా నీటిని ఎత్తిపోసే ప్రక్రియలో అన్నారం లేదా సుందిళ్ల బ్యారేజీలకు ఏవైనా నష్టాలు లేదా ప్రమాదాలు జరిగితే, దానికి పూర్తి బాధ్యత తమదేనన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్.. ముద్రగడ సమాజానికి చేసిన సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని, అన్ని రకాల ప్రభుత్వ మర్యాదలు లోటు లేకుండా చూడాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ల్పపీడన ప్రభావంతో జులై మూడో వారంలో దేశవ్యాప్తంగా వర్షాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మధ్య భారతదేశం, తూర్పు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సాగుతున్న ఈ వినూత్న నిరసన ప్రదర్శనలకు మెల్లిమెల్లిగా జనం ముఖం చాటేస్తున్నారు. పరీక్షల అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా డిమాండ్‌తో ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం.. ఆరంభంలో లక్షలాది మంది యువతను ఆకర్షించింది. అయితే క్రమక్రమంగా జనాదరణ కోల్పోయి ఇప్పుడు జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆ పార్టీ నిరసనలు తూతూ మంత్రంగా మారాయి.
ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో స్థానిక ఎన్నికల జరిగే అవకాశం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఇప్పటికే తమ పార్టీ శ్రేణులకు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే ఎన్నికల వ్యూహాలను పక్కాగా అమలు చేయడానికి కూటమి పార్టీల ముఖ్య నేతల కీలక సమావేశం బుధవారం జరగనుంది.
హరీష్ రావు ఇప్పుడు తన కుటుంబ వ్యాపారమైన మిల్చీ మిల్క్  విషయంలో తలెత్తుతున్న ప్రశ్నలకు, వెల్లువెత్తుతున్న విమర్శలకూ సమాధానం చెప్పుకోలేక సతమతమౌతున్నారు.
విజయ్ ప్రస్తుతం చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్డు (ఈసీఆర్) లోని నీలాంకరి నివాసంలో ఉంటున్నారు. అక్కడి నుంచి ఆయన సచివాలయం ఉన్న రాజాజీ రోడ్డుకు రోజువారీ ప్రయాణం చేస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.