ఒకప్పుడు ఏదైనా రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలంటే ఆ పార్టీకి ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహకర్త అయి ఉండాలన్న అభిప్రాయం ఉండేది. 2014 కేంద్రంలో మోడీ నాయకత్వంలో ప్రభుత్వం కొలువుదీరడానికైనా, 2019 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లో జగన్ ముఖ్యమంత్రి అయ్యారన్నా.. అలాగే పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి వరుసగా మూడో సారి అధికార పగ్గాలను అందుకున్నారన్న.. అందుకు ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహాలే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తుంటారు. అలాంటి ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు సొంతంగా జన సురాజ్ పేరుతో ఒక రాజకీయ పార్టీ పెట్టుకుని బీహార్ లో తిరుగుతున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఒంటరి పోరుకు సిద్ధమై ఎదురీదుతున్నారు. అలాంటి ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు రాహుల్ గాంధీకి వత్తాసుగా మాట్లాడారు. రాహుల్ గాంధీ భారత ఎన్నికల కమిషన్ పై ఆటంబాంబు లాంటి ఆరోపణతో విరుచుకుపడుతున్న సమయంలోనే ఆయన అభిప్రాయాలకు మద్దతుగా ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రజలకు భారత ఎన్నికల సంఘంపై నమ్మకం పూర్తిగా పోయిందని ప్రశాంత్ కిశోర్ తాజాగా పేర్కొన్నారు.
ఎన్నికల కమిషన్ పారదర్శకత, పనితీరు, సమర్థత విషయంలో ప్రజా విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయిందని అనడమే కాకుండా ఇది చాలా ఆందోళనకర విషయమన్నారు. ఈ సందర్భంగా ఆయన రాహుల్ గాంధీ మాటలను ప్రస్తావించారు. వాటినే మరోమారు వల్లె వేశారు. ఎన్నికల కమిషన్ అధికార బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని రాహుల్ గాంధీ చేసిన విమర్శలనే ప్రశాంత్ కిశోర్ అఅలియాస్ పీకే చేశారు. బీహార్‌లో నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ను గాంధీ తీవ్రంగా విమర్శించారు, దీని ద్వారా దాదాపు 65 లక్షల మంది ఓటర్లను తొలగించినట్లు ఆరోపించిన రాహుల్ గాంధీ, అదుకు సంబంధించిన ఆధారాలున్నాయని పేర్కొన్నారు. అంతే కాదు బీహాఆర్ లో ఒకే నియోజకవర్గంలో దాదాపు లక్ష ఓట్లు గల్లంతయ్యాయనీ ఆయన తాజా ఓటరు జాబితాను ప్రదర్శించారు. ముస్లిం , వలసదారులకు బీహార్ లో ఓటు హక్కు లేకుండా చేయాలన్న కుట్ర జరుగుతోందని రాహుల్ ఆరోపణలు చేశారు.
అదే విషయాన్ని ప్రశాంత్ కిశోర్ కూడా చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘంపై ప్రజలు విశ్వాసం కోల్పోయారనీ, ఇది ప్రజాస్వామ్యం ఉనికికే పెనుముప్పు అని పీకే ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ప్రతిపక్షాల పట్ల ఒక విఆధంగా, అధికార పక్షం విషయంలో మరో విధంగా వ్యవహరిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం పక్షపాత వైఖరి ప్రదర్శిస్తోందన్నారు. ఇటువంటి చర్యలే ఎన్నికల సంఘంపై ప్రజల విశ్వాసం సన్నగిల్లేలా చేస్తోందని ప్రశాంత్ కిశోర్ అన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/election-strategist-prashant-kishore-jpin-rahul-against-election-39-203763.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.