ఉత్తుత్తి హామీలు కుదరవ్.. కేంద్ర ఎన్నికల సంఘం
Publish Date:Oct 4, 2022
Advertisement
ఉత్తుత్తి హామీలు ఇచ్చేసి ఎన్నికల పబ్బం గడుపుకోవాలనుకునే పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. పార్టీలు ఎన్నికల సమయంలో ఇచ్చే ఉత్తుత్తి హామీలకు చెక్ పెట్టాలని నిర్ణయించింది. ఇందు కోసం ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో కఠినమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించి పలు ప్రతిపాదనలు చేసింది. ఆ ప్రతిపాదనలపై అభిప్రాయాలు కోరుతూ దేశంలో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలకు లేఖ రాసింది. ఆ ప్రతిపాదనలలో ముఖ్యమైదని ఉత్తుత్తి హామీలకు చెక్ పెట్టడం. పార్టీలు ఎన్నికల సమయంలో కేవలం వాగ్దానాలు చేసి ఓట్లు దండుకోవాలన్న యావతో వ్యవహరించడం తగదు. చేసిన వాగ్దానాలతో ఆ వాగ్దానాలు నెరవేర్చుందకు అయ్యే వ్యయం వివరాలను, వాటి కోసం నిధుల లభ్యత వంటి వివరాలన్నీ ఓటర్లకు తెలియజేయాలన్నది ఎన్నికల సంఘం చేసిన ముఖ్యమైన ప్రతిపాదన. వాగ్దానాల అమలు కోసం నిధులను ఎలా సమకూరుస్తారు? ఎఫ్ఆర్‌బీఎం పరిమితులపై వాటి ప్రభావం ఎలా ఉంటుంది? మరిన్ని అప్పులను తీసుకొస్తారా? వంటి వివరాలను రాజకీయ పార్టీలు ఒక ప్రామాణిక ఫార్మాట్ లో తెలియజేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆ లేఖలో పేర్కొంది
http://www.teluguone.com/news/content/election-commissio-shock-to-political-parties-25-144890.html





