సరదాగా వేసవి సెలవులు ఎంజాయి చేయడానికి వెళ్లిన రెండు కుటుంబాలలో పెను విషాదం నెలకొంది. హైదరాబాద్ నుంచి గోవాకు ఒక ప్రైవేటు ట్రావెల్స బస్సు మాట్లాడుకుని రెండు కుటుంబాలకు చెందిన 32 మంది గోవా పర్యటనకు వెళ్లారు. అక్కడ ఆనందంగా ఉత్సాహంగా గడిపి తిరుగు ప్రయాణమయ్యారు. అయితే తిరుగు ప్రయాణంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు.
దీంతో విహార యాత్ర కాస్తా విషాదంగా మారిపోయింది. తిరుగు ప్రయాణంలో కర్నాటకలోని కలబురిగి వద్ద వీరు ప్రయాణిస్తున్న బస్సు ఎదురుగా వస్తున్న మినీ లారీని ఢీకొని కల్వర్టులో పడిపోయింది. వెంటనే బస్సు మంటల్లో చిక్కుకుంది.
ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా ఎనిమిది మంది మరణించారు. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన మరో 12 మంది అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/eight-hyderabad-residents-died-in-road-accident-near-kalaburigi-in-karnataka-25-136988.html
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు
మియాపూర్ మెడికో సృజన హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొద్దికొద్దిగా కొలిక్కి వస్తోంది.
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీఆర్ఎస్, హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.