జగన్ నిర్వాకం..ఏపీలో విద్యావ్యవస్థకు గ్రహణం!

Publish Date:Jul 10, 2023

Advertisement

మనదేశంలో విద్యావ్యవస్థ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. అనేక రాష్ట్రాల్లో కార్పొరేట్‌ విద్యా వ్యవస్థలదే పైచేయి. అనాది నుండి మహాముహులు చదివిన స్కూళ్ళు, కాలేజీలు ఇప్పుడు వెనకబడిపోయాయి. ఒకప్పుడు వెలుగు వెలిగిన ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు ఇప్పుడు అంధకారంలోకి నెట్టివేయబడ్డాయి. ఒక పద్ధతి ప్రకారం చొచ్చుకొచ్చిన కార్పొరేట్‌ విద్యాసంస్థలు పిల్లల తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తూ కొత్త సంస్కరణలు రాసుకొచ్చాయి. ప్రభుత్వాల హెచ్చరికలను వారు ఖాతరు చేయరు.. ప్రభుత్వ సంస్కరణలనూ వాళ్ళు లెక్కచేయరు. దీంతో ఇప్పుడు పేదవాడికి విద్య దూరమవుతుంది. కొనగలిగిన వారికే సరస్వతీ చేరువవుతుంది. అందుకే చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వ స్కూళ్ళు, కాలేజీలను పునరిద్ధరుస్తున్నారు. సరికొత్త చట్టాలను తీసుకొచ్చి మరీ విద్యావ్యవస్థను బలీయం చేస్తున్నాయి. 

తెలంగాణ సహా దేశంలోని చాలా రాష్ట్రాలు ఇప్పుడు కార్పొరేట్ విద్యకు చెక్ పెట్టేలా కొత్త విధానాలను అవలంభిస్తూ మళ్ళీ ప్రభుత్వ విద్యాసంస్థలకు పూర్వ కళ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, ఏపీలో మాత్రం విద్యావ్యవస్థ నిర్వీర్యమవుతుంది. జగన్ మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ముందు చూపు లేని విధానాలు, మొండిపట్టు జీవోలు ఇప్పుడు పేద పిల్లల పాలిట శాపంగా మారాయి. ఎలాంటి ప్రణాళికలు లేకుండా మూర్ఖత్వపు నిర్ణయాలు ప్రభుత్వ విద్యావ్యవస్థ నాశనానికి బాటలు వేశాయి. నాలుగేళ్ళలో ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంగ్లీష్ మీడియం, నాడు నేడు పేరిట చేసిన మార్పులు, భారీగా టీచర్ల కొరత ఉన్నా నియామకాలు చేపట్టకపోవడం, ఉన్న టీచర్లు, లెక్చరర్లకు జీతాల కొరత, పాఠశాలల విలీనం, ఫీజ్ రీఎంబర్స్ మెంట్ కు పేరుకుపోయిన బకాయిలు, ప్రభుత్వ కళాశాలలకు కేటాయించని నిధులు.. ఇలా చెప్పుకుంటూపోతే నాలుగేళ్ళ పాలనలో విద్యావ్యవస్థ నాశనానికి అనేక కారణాలు కనిపిస్తూనే ఉన్నాయి.

గత నాలుగేళ్ళ వైసీపీ పాలనలో కొత్తగా ఉపాధ్యాయ, లెక్చరర్ల నియామకాలు లేవు. ఉన్నవారిని కుదించి సర్దుబాటు చేస్తున్నారు. ఉన్న వారికి న్యాయబద్ధంగా రావాల్సిన జీతభత్యాలు అందడం లేదు. వచ్చే ఆ జీతాలు కూడా సమాయానికి అందడం లేదు. దీంతో వారు రోడ్డెక్కాల్సిన దుస్థితి. దీనికి తోడు ఎలాంటి ముందస్తు ప్రణాళికలు లేకుండా తీసుకొచ్చిన 172, 117 రెండు జీవోలు ఏపీ విద్యావ్యవస్థను సర్వనాశనం చేశాయి. పాఠశాలల విలీనం పేరుతో అర్ధరాత్రి ఉత్తర్వులు జారీచేసిన జగన్ సర్కార్.. ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులను తరలించేశారు. దశాబ్దాలుగా గ్రామంలో పేద పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిన బడులను సైతం మూసేసి.. కిలోమీటర్ల దూరంలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. అది కూడా మాతృభాష ఊసు లేకుండా ఒక్క ఇంగ్లీష్ మీడియంను ఉంచారు.  

ఇంగ్లీష్ మీడియం తెచ్చినా.. అందుకు తగిన ప్రొఫెషనల్ టీచర్లు లేకపోవడంతో అది అక్కరకురాని మీడియం మారిపోయింది. ఇక కొత్తగా ఉపాధ్యాయ నియామకాలు లేకపోగా టీచర్, స్టూడెంట్స్ నిష్పత్తిని తెరపైకి తెచ్చారు. ప్రాథమిక పాఠశాలలో ప్రతీ 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడ్ని నియమించారు. అదే ప్రాథమికోన్నత పాఠశాలకు అయితే ప్రతీ 53 మంది విద్యార్థులకు, ఉన్నత పాఠశాలలో ప్రతీ 60 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండేలా నిబంధనలు మార్చారు. మరి అంత మంది విద్యార్థులకు ఒకరే ఉపాధ్యాయుడు విద్యాబోధన ఎలా చేయగలరో.. వారిపై ఎంతవరకు టీచర్లు దృష్టి పెట్టగలరో అనే మేధావుల ప్రశ్నకు ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. 

ఇక వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన అట్టర్ ప్లాప్ కార్యక్రమాలలో నాడు నేడు కూడా ఒకటి. లీడర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం.. ఫోటో ఫోజులకు తప్ప ఈ కార్యక్రమం ఎందుకు పనికిరాకుండా పోయింది. రూ.వేల కోట్లు ఖర్చు చేసి పాఠశాలల్లో బెంచీలు, కుర్చీలు వేశారు. మరికొన్ని పాఠశాలల్లో నిధుల కొరతతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. కొన్ని స్కూల్స్ లో పైపై మెరుగులు దిద్ది, రంగులేసి భారీగా నిధులను కొల్లగొట్టారు. అయితే, ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా రంగులు వేసుకొని ఆనందం పొందడమే తప్ప పాఠశాలలకు విద్యార్థులను రప్పించే ఏర్పాట్లు చేయలేకపోయారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందిస్తాం ఇకపై విద్యారులు ఇక్కడే చేరండని ఏపీ ప్రభుత్వం నమ్మకం కలిగించలేకపోవడంతో ప్రభుత్వ విద్యావ్యవస్థ నిర్వీర్యమైంది.

By
en-us Political News

  
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.