సీతక్కే సీఎం?

Publish Date:Jul 10, 2023

Advertisement

 తెలంగాణలో ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించి అధికారంలోకి వస్తే సీఎం ఎవరు? కాంగ్రెస్ లో గ్రూపులు, విభేదాలు, నాయకుల మధ్య అనైక్యత గురించి తెలిసిందే. ఎన్నికల ముందు ఐక్యంగా కదిలినా ఫలితాలు వచ్చిన తరువాత పరిస్థితి మళ్లీ మొదటికే వస్తుందని, ఇందుకు ఆ పార్టీ గతాన్ని పరిశీలిస్తే సరిపోతుందని పరిశీలకులు అంటున్నారు. కర్నాటకలో సాధించిన ఫలితంతో ఇప్పుడు కాంగ్రెస్ లో కొత్త జోష్ కనిపిస్తున్నది. అంతకు ముందు వరకూ నిస్తేజంగా కనిపించిన పార్టీ శ్రేణులు ఇప్పుడు గెలుపు ధీమాతో కదంతొక్కుతున్నాయి.

పరిశీలకులు కూడా బీఆర్ఎస్ బీజేపీలో రెండో స్థానం కోసం పోటీ పడాల్సిందేనని విశ్లేషిస్తున్నారు. అయితే కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణ సీఎం ఎవరు అన్నదే ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా జరుగుతున్న చర్చ. ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెరమీదకు వస్తే.. పార్టీలోనే సహాయ నిరాకరణ ఉంటుందన్న అంచనాలు బలంగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఇప్పుడు మారిన మనిషిగా కనిపిస్తున్నారు. పార్టీలో తన వ్యతిరేకులందరినీ కలుపుకుని పోవడమే కాకుండా.. తనంత తానుగా స్వయంగా వచ్చే ఎన్నికలలో పార్టీ విజయం సాధిస్తే ముఖ్యమంత్రిగా సీతక్క పదవీ బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయని ప్రకటించారు.  

రేవంత్ ప్రకటనతో పార్టీలో సీఎం పదవి కోసం రేసు లేకుండా పోయిందని పరిశీలకులు అంటున్నారు. సీతక్క ముఖ్యమంత్రి అంటే ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా పార్టీ నేతలంతా అంగీకరించి తీరాల్సిన పరిస్థితిని రేవంత్ తన ప్రకటన ద్వారా తీసుకువచ్చారని అంటున్నారు. రేవంత్ ప్రకటన పట్ల బడుగు,బలహీన వర్గాల్లో హర్షం వ్యక్తం అవుతున్నది.మహిళలు మద్దతుగా నిలుస్తారనడంలో సందేహం లేదు.   త్వరలో తెలంగాణ రాష్ట్రం లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే సీతక్క కాంగ్రెస్ సీఎం అభ్యర్థి గా ఉంటారని అమెరికా లో జరుగుతున్న తానా సభల్లో టిపిసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి సీతక్క ఉంటారా అనే ప్రశ్న కు జవాబుగా రేవంత్ రెడ్డి  కాదు సీఎంగా అని విస్పష్టంగా చెప్పారు.   కాంగ్రెస్ పార్టీ లో సీఎం అభ్యర్థి ని ఎన్నికలకు ముందే ప్రకటించే ఆనవాయితీ ఇంత వరకూ లేదు. రేవంత్ ప్రకటన కూడా అధిష్ఠానం అధికారిక ప్రకటనగా భావించలేం. అయితే.. రేవంత్ వ్యూహాత్మకంగా సీతక్క పేరును తెరమీదకు తీసుకురావడం ద్వారా  .రాష్ట్రం లోని కాంగ్రెస్ లో గ్రూపుల కు చెక్ పెట్టారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

నిజానికి 2023 లోని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చాలా ప్రణాళికలు తో ముందుకు వెళ్లే అవకాశం ఉందని.అన్ని పరిస్థితులను పార్టీకి అనుకూలంగా చేసుకునే ఏ అవకాశాన్నీ  రేవంత్ రెడ్డి వదలడం లేదు. సీఎం తానే కావాలనే లక్ష్యం కాకుండా పార్టీ ని అందరి తో కలిసి అధికారంలోకి తీసుకొని రావాలనే లక్ష్యంతో ఉన్నారని సీతక్క సీఎం అనడం ద్వారా విస్పష్టంగా చాటారు.  గడచిన తొమ్మిది సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ లో ఐక్యతారాగం వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జాతీయ ఉపాధ్యక్షురాలు ఆదివాసీ బిడ్డ,మాజీ నక్సలైట్,సీతక్క పేరును ప్రకటించడం ద్వారా రేవంత్ కేసీఆర్ కు పెద్ద ఝలక్ ఇచ్చారనే చెప్పాలి. ఆయన 2014 ఎన్నికలలో బీఆర్ఎస్ (అప్పడు తెరాస) విజయం సాధిస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించారు. గెలిచిన తరువాత ఆయన మళ్లీ ఆ ఊసే ఎత్తలేదు. వరుసగా రెండు సార్లు గెలిచి సీఎం అయ్యారు. హ్యాట్రిక్ విజయం కోసం ఆశపడుతున్నారు. గెలిస్తే ఆయనో లేదా ఆయన తనయుడు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆరో సీఎం అవుతారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలో రేవంత్  దళిత మహిళను సీఎం అభ్యర్థిగా ప్రకటించి బీఆర్ఎస్ కు గట్టి షాక్ ఇచ్చారనే చెప్పాలి.  కరోనా సందర్బంగా సీతక్క చేసిన సేవలు,స్వయంగా భోజనం మోసుకుని వెళ్లడం వంటి సేవా కార్యక్రమాలు ఆమెకు జనబాహుల్యంలో అంతులేని అభిమానాన్ని సంపాదించి పెట్టాయి. మానవీయ కోణం ఉన్న విద్యా వంతురాలిగా సమాజంలోని అన్ని వర్గాలూ ఆమెను అభిమానిస్తాయి, గౌరవిస్తాయి. విపక్షాలు కూడా ఆమెను విమర్శించేందుకు సాహసించరు. అదీ సీతక్క వ్యక్తిత్తం.  ఈ నేపథ్యంలోనే రేవంత్ ప్రకటన కాంగ్రెస్ లో ఒక్క సారిగా జోష్ నింపింది. ఎన్నికలలో విజయంపై ధీమా పెరిగింది.

By
en-us Political News

  
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.