ఈడీనా..బీజేపీ శాఖోప‌శాఖ‌?

Publish Date:Aug 5, 2022

Advertisement

గ‌తంలో సిబిఐని పంజ‌రంలో బంధించ‌బ‌డి, అయ్య‌వారి ప‌లుకుల‌నే ప‌లికే చిలుక అని ఏకంగా సుప్రీం కోర్టు పేర్కొన్న‌ది. స‌రిగ్గా ప‌దేళ్ల త‌ర్వాత స్వేచ్ఛ‌పొందిన ఆ చిలుక‌లు.. అదే కేంద్ర ఏజెన్సీ లు..సిబిఐ, ఈడీ, ఐటీ.. వాటి య‌జమానుల ప‌లుకులు ప‌ల‌క‌డ‌మేగాకుండా త‌మ య‌జ‌మాని ఆదేశాల‌ను తిర‌స్క‌ రించిన వారి భ‌ర‌తం ప‌డుతున్నాయి. దుర‌దృష్ట‌మేమంటే,  అవి వాటి ప్ర‌త్యేక‌త‌ల్ని కోల్పోయి రాజ‌కీయ అస్త్రాలుగా మారి, కేంద్ర ప్ర‌భుత్వ ఆదేశాల‌ను మాత్ర‌మే రామాజ్ఞ‌లా పాటిస్తున్నాయి. 

కేంద్రం చేతిలో కీలుబొమ్మ‌ల్లా మారిన వాటిలో ఈడీ ఇటీవ‌ల బీజేపీకి బ్ర‌హ్మాస్త్రంలా మారింది. కాగా సిబిఐ త‌మ విచార‌ణ చేప‌ట్ట‌డానికి  ఇంకా రాష్ట్ర ప్ర‌భుత్వాల  అనుమ‌తిని  కోరాల్సివ‌స్తోంది. మ‌నీలాండ‌రింగ్ ప్రివెన్ష‌న్ చ‌ట్టం-2002 క్రింద ఈడీ ఆ చ‌ట్టం అమ‌లు విష‌యంలో స్ప‌ష్ట‌మైన విచార‌ణ చేప‌ట్ట‌డంలో అనేక అడ్డంకులు ఎదుర‌వుతున్నాయి. ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు అడ్డంకుల‌ను తొల‌గించింది. 2022 జులై  26న రాజ్య‌స‌భ‌లో ఒక  స‌భ్యుని ప్ర‌శ్న‌కు  ఆర్ధిక మంత్రి స‌మా ధానం చెబుతూ,  గ‌త ప్ర‌భుత్వంలో సుప్రీం కోర్టు 112 కేసులు చేప‌ట్టింద‌ని, 2014లో బీజీపే ప్ర‌భు త్వం వ‌చ్చిన  త‌ర్వాత  తొలి ఎనిమిదేళ్ల‌లో 3,010 కేసులు చేప‌ట్ట‌డం గ‌మ‌నార్హ‌మ‌ని అన్నారు. 

భార‌త‌దేశంలో ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితుల్లో కోర్టులో కేసు విచార‌ణ‌కంటే ముందే శిక్ష అమ‌లు జ‌రిగిపో తోవ‌డం స‌మ‌స్య‌ల‌కు ఒక స‌మాధానంగా క‌న‌ప‌డుతోంది.  అస‌లు కేసు విచార‌ణ కాల‌మే శిక్ష‌గా మార‌డ‌మే శిక్ష‌ల రేటు త‌గ్గ‌డానికి కార‌ణమ‌వుతోంది. నిత్యం కాక‌పోయినా, పాక్షికంగా చేప‌ట్టిన విచార‌ణ ఆధారంగా, వాస్త‌వాల‌ను స‌రిగా చూప‌లేక‌పోవ‌డం పైనా ఛార్జీషీటు ఆధార‌ప‌డి ఉంటోంది. ఈ ర‌కంగా ప్ర‌తిప‌క్షాల‌పై క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌టానికి వీల‌వుతోంది. విచార‌ణ పూర్త‌య్యే స‌మ‌యానికే జ‌ర‌గా ల్సిన న‌ష్టం జ‌రిగిపోతోంది. 

ఇటీవ‌లి  మ‌హారాష్ట్రా రాజ‌కీయ ప‌రిణామాల్లో అనేక‌మంది ఎమ్మెల్యే లు, ఎంపీలు చాలామందిపై  ఈడీ ఛార్జీలు ఎదుర్కొంటున్నందువ‌ల్ల‌నే అవ‌త‌ల‌కి దాటేసేరు. అలాగే అనేకమంది ఎంపీలు కూడా ఈడీ చ‌ర్య ల ప‌ట్ల కాస్తంత భ‌య‌ప‌డ్డారు. అంతెందుకు, శివ‌సేన మాజీ ఎమ్మె ల్యే అర్జున్ ఖోట్క‌ర్ ఏకంగా  మీడియా స‌మావేశంలో క‌న్నీళ్ల‌ప‌ర్యంతమయ్యారు. కార‌ణం ఏక్ష‌ణాన్నయినా అరెస్టు చేస్తారేమోన‌ని, ఫ‌లితంగా త‌న కుటుంబం రోడ్డు మీద‌కి వ‌స్తుంద‌న్న భీతి ఆయ‌న్ను క‌ల‌వ‌ర పెట్టిం ది. ఆయ‌న ఆస్తులు ఈడీ లాగేసు కుంది. దీంతో  ప్ర‌త్య‌ర్ధికి  మ‌ద్ద‌తు ప‌ల‌క‌డం త‌ప్ప‌నిస‌రి అయింది. 

ఈ సంఘ‌ట‌న‌ల దృష్ట్యా, ప్ర‌తీవారికి బీజేపీ నీడ‌లోకి చేర‌డ‌మే దాదాపు ప్ర‌తీవారికీ శ్రీ‌రామ‌ర‌క్ష‌గా మారింది. పార్టీ అయినా ఎవ‌ర‌యినా నియ‌మ నిబ‌ద్ధంగా ఉంటే రూలుకు క‌ట్టుబ‌డి వ్య‌వ‌హ‌రించి త‌న దారినే పోతుంటే ప్ర‌భుత్వ అధీనంలోని సంస్థ‌లు త‌ప్ప‌కుండా శిక్షిస్తున్నాయి. అదీ చ‌ట్ట‌బ‌ద్ధంగా కాదు, దాడు లు, వేధిం పులు, త‌ప్పుడు ఛార్జీల‌నే అస్త్రాల‌తోనే. మ‌హారాష్ట్ర‌లో రెబెల్స్ అధికార‌ప‌గ్గాలు చేప‌ట్ట‌డానికి బీజేపీ నీడ లోకి వెళ్లాయి. కానీ సంజ‌య్ రౌత్ మాత్రం కేంద్రం ఒడిగ‌డుతున్న దారుణ పాల‌న‌కు ఒగ్గేదే లేద‌న్నట్టు వ్య‌వహ‌రించి ఈడీ దాడికి, అరెస్టుకు గుర‌య్యారు. 

ఆస‌క్తిక‌రవిష‌య‌మేమంటే, బీజీపీ ప‌విత్ర నీడ‌లోకి వ‌చ్చిన‌వారికి వారి గ‌త త‌ప్పిదాల‌ను మాఫీ చేస్తోంది. వారిని స‌చ్ఛీలురుగానూ ప్ర‌క‌టించేస్తోంది. 2014 నుంచి క‌నీసం 609 రాజ‌కీయనాయ‌కుల‌ను వారి కుటుం బాల‌ను ల‌క్ష్యంగా పెట్టుకుని దాడి చేస్తున్నాయి. వీరిలో కేవ‌లం 39 మంది బీజేపీకి చెందిన‌వారు కాగా, 570 మంది ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షానికి చెందిన‌వారు. కాంగ్రెస్‌కి చెందిన‌వారు గ‌నుక బీజేపీ తీర్ధంపుచ్చుకుంటే ఈ దాడులు, కేసుల‌కు కొంత దూర‌మై ఊపిరిపీల్చుకోగ‌ల్గుతారు. అస‌లు ఈ దాడులు, కేసుల మోతా హ‌డా వుడి అంతా చిత్రంగా బీజేపీయేత‌ర పార్టీల పాల‌న‌లోని రాష్ట్రాలకే ప‌రిమితం కావ‌డం. ఇలా ఏక‌ప‌క్ష‌, క‌క్ష సాధింపు చ‌ర్య‌ల్లో భాగంగా జ‌రుగుతున్న దాడులు క్ర‌మేపీ మ‌రింత ప‌క‌డ్బందీగా కొన‌సాగు తున్నాయి. 

ఇక ఇక్క‌డ స‌మ‌స్య‌ల్లా, 2018లో డైర‌క్ట‌ర్ ప‌ద‌విలో ఉన్న వ్య‌క్తి  స‌ర్వీసును మ‌రో ఏడాది పొడిగిస్తే ఏ విధంగా  ప‌దవిలో నిల‌బ‌డ‌గ‌ల్గుతార‌న్న‌ది. వాస్త‌వానికి ఆయ‌న మ‌రో రెండు మూడు రోజుల్లో రిటైరు కానుం డ‌గా ప‌దవీ కాలాన్ని మ‌రో ఏడాది పొడిగించారు. అందుకు సంబంధించి ఆదేశాల‌ను సుప్రీంకోర్టు జారీ చేసింది. అన్నింటికంటే చిత్రమేమంటే ఈడీ చ‌ట్టం అమ‌లు విష‌యం  ఏమంటే, ఇడిసి ఐ నివేదిక బ‌య‌ట‌పెట్ట కుండానే రివ్యూకి ఆట్టే అవ‌కాశం ఉండ‌దు , చ‌ర్య‌లు వేగిరం చేయ‌వ‌చ్చు. ఈ ర‌క‌మైన కొత్త విధానంతో ప్రాథ‌మిక హ‌క్కుల‌కు భంగం చేకూరే అవ‌కాశాలే ఎక్కువ‌. అందువ‌ల్ల దీని విష‌యంలో విప‌క్షాలు చ‌ట్టం అమ‌లు గురించిన అంశాల్లో పున‌ర్విచార‌ణ చేప‌ట్టాల‌ని కోరుతున్నారు. 

ప్ర‌స్తుత ప్ర‌భుత్వం రూల్ ఆఫ్ లా  స్థానంలో రూల్ బై లా నే ఎక్కువ‌గా అనుస‌రిస్తున్న‌ది. రాజ‌కీయ నాయకులు, జ‌ర్న‌లిస్టులు, వ్యాపార‌స్తుల మీద బీజేపీ ప్ర‌భుత్వం క‌క్ష‌గ‌ట్టిన‌ట్టుగా వేటాడుతోంది. ఇక ప్ర‌తిప‌క్షాల మీద మ‌రింత విరుచుకుప‌డ‌డం, వేధించ‌డం చూస్తుంటే ఇదంతా దీనికి అంతం ఎప్పుడు దేవా అని ప్ర‌జ‌లు కూడా గోడు పెడుతున్నారు. ప్ర‌జాస్వామ్యం, అంతిమంగా మ‌న దేశం ఇందుకు పెను స‌మ‌స్య‌ల్ని ఎదుర్కొంటున్న‌ది. దీన్ని గురించి పార్ల‌మెంటులో అస‌లు చ‌ర్చే లేక‌పోవ‌డం, ప్ర‌శ్నించే వారిని అణ‌చి వేయ‌డం, బాధ్యతా రాహిత్యం అన్నీ వెర‌సీ దేశంలో స్వేచ్ఛాస్వాతంత్య్రాల‌కు అవ‌కాశం లేకుండా పోతుంది. 

By
en-us Political News

  
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.